ఇండియా స్టార్టప్ అవుట్ లుక్ రిపోర్ట్ -2016 ఎలా వుందో తెలుసుకోవాలనుందా..?

0


స్టార్టప్ కంపెనీల రాజధానిగా ఢిల్లీ అవతరించింది. ఇప్పటి దాకా ఇండియా సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరు, వాణిజ్య రాజధాని ముంబై స్టార్టప్ కంపెనీల విషయంలో ముందున్నాయి. అయితే తాజా "ఇండియా స్టార్టప్ అవుట్ లుక్ రిపోర్ట్ -2016" నివేదిక ప్రకారం ఈ రెండు నగరాలను ఢిల్లీ అధిగమించింది. ఇన్నోవాన్ క్యాపిటల్ సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం ఇప్పుడు అత్యధిక స్టార్టప్ కంపెనీలు ఢిల్లీలోనే పురుడు పోసుకుంటున్నాయి.

కన్జ్యూమర్ ఇంటర్నెట్, ఈ కామర్స్ రంగాలే స్టార్టప్స్ కు హాట్ ఫేవరేట్లు. మెట్రో నగరాలు ఐటీ హబ్ లుగా మారుతున్న దశలో కంపెనీలకు విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తున్నాయి. ఈ నేపధ్యం ఇండియన్ స్టార్టప్ వ్యవస్థ శైశవ దశ నుంచి కొద్దిగా ఎదిగింది. అతి త్వరలోనే చిచ్చర పిడుగులా చెలరేగిపోయే అవకాశం ఉందని నివేదిక అంచనా వేస్తోంది.

వందకోట్ల మందికిపైగా యువ జనాభా ఉన్న మన దేశంలో నిరుద్యోగం ఓ ముఖ్య సమస్య . అయితే స్టార్టప్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఉద్యోగ అవకాశాలు అమాంతం పెరిగే అవకాశం కనిపిస్తోందని అవుట్ లుక్ రిపోర్ట్ అంచనా వేసింది. వచ్చే ఏడాది 130 స్టార్టప్ కంపెనీలు ఐదు వేల ఉద్యోగాలను సృష్టిస్తాయని అంచనా. 97 శాతం స్టార్టప్ లు తమ కార్యకలాపాలను పూర్తిగా కొత్తవారితోనే ప్రారంభించాలని భావిస్తున్నాయి. వచ్చే కొత్త ఉద్యోగాల్లో 28 శాతం టెక్నాలజీ నేపధ్యం ఉన్నవే.

స్టార్టప్ కంపెనీల భవిష్యత్ ఆశావాహంగా కనిపించడానికి ప్రభుత్వ విధానాలు కూడా దోహదంగా మారుతున్నాయి. " స్టార్టప్ ఇండియా-స్టాండప్ ఇండియా" నినాదంతో కేంద్రం ఆంట్రపెన్యూర్లకు, ఇన్వెస్టర్లకు ప్రొత్సాహం ఇస్తోంది. ప్రస్తుత రాజకీయ, వ్యాపార పరిస్థితులు గతంతో పోలిస్తే 76 శాతం మెరుగ్గా ఉన్నాయని 65 శాతం కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇదే ప్రొత్సాహకర పరిస్థితి ఉంటుందని కంపెనీలు నమ్ముతున్నట్లు ఇన్నోవేన్ స్టడీలో వెల్లడయింది.

ఇండియన్ స్టార్టప్ లలో ఆశావాహదృక్పధం, ప్రొత్సహకర పరిస్థితులను ఇన్నోవేన్ స్టడీ వెల్లడించిందని గ్రూప్ సీఈవ్ అండ్ సీవోవో అజయ్ హట్టంగడి అభిప్రాయపడ్డారు. స్టార్టప్ లకు సవాళ్లుగా ఉన్నవి ప్రధానంగా టాక్సేషన్, రెగ్యులేషన్ అని "ఇండియా స్టార్టప్ అవుట్ లుక్ రిపోర్ట్ -2016" తెలిపింది.

స్టార్టప్ ల విజయశాతం కూడా ప్రొత్సాహకరంగా ఉందని స్టడీ వెల్లడించింది. సొంత సొమ్ముతో ప్రారంభిస్తున్న స్టార్టప్ లలో యాభై శాతం, ఎంజిల్ ఫండింగ్ కంపెనీలు ప్రమోట్ చేస్తున్న స్టార్టప్ లలో 45 శాతం లాభాలు నమోదు చేసుకుంటున్నాయి. అయితే వెంచక్ క్యాపిటల్ ఫండెడ్ కంపెనీల్లో ప్రాఫిటబుల్ వెంచర్ల శాతం 22 శాతంగా మాత్రమే ఉంది.

ఇన్నోవేన్ క్యాపిల్ సంస్థ విడుదల చేసిన "ఇండియా స్టార్టప్ అవుట్ లుక్ రిపోర్ట్ -2016"... స్టార్టప్ లకు ఉజ్వల భవిష్యత్ ను అంచనా వేసింది.

As an IT engineering graduate... i am passionate to know about new and innovative ideas and explore them.....

Related Stories

Stories by SOWJANYA RAJ