టాలెంట్ ఎక్కడున్నా ఎంకరేజ్ చేస్తాం- మద్రాస్ ఐఐటీయన్లతో మంత్రి కేటీఆర్  

0

విద్యార్ధుల్లో దాగిఉన్న సృజనకు తగిన ప్రోత్సాహమిస్తే దేశంలో స్టార్టప్ ఇకో సిస్టమ్ అద్భుతంగా వృద్ది చెందుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మద్రాస్ ట్రిపుల్ ఐటీ విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడిన కేటీఆర్.. టాలెంటెడ్ విద్యార్ధులకు తగిన చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్కార్పొరేట్ అనే అంశంపై మాట్లాడారు. ముఖ్యంగా ఐఐటీ విద్యార్ధులు పరిశోధనల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. టీ హబ్, దాని కాన్సెప్టును విద్యార్ధులకు వివరించారు. వారితో జరిగిన ముఖాముఖి సమావేశంలో అనేక విషయాలను షేర్ చేసుకున్నారు మంత్రి కేటీఆర్.

రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి దేశంలోని ఐఐటీ విద్యార్ధులతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. అన్ని కీలక శాఖలను ఎలా నిర్వర్తిస్తున్నారని ఒక విద్యార్ధి అడిగితే... ఇంట్రస్ట్ ఉంది కాబట్టే చేయగలుగుతున్నాను అని కేటీఆర్ నవ్వుతూ సమాధానమిచ్చారు. అందుకే మీలాగా నాకు ఫ్రీ టైం దొరకడం లేదని చమత్కరించారు.

ఐటీ రంగమే కాదు.. చేనేత రంగాన్ని కూడా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కేటీఆర్ అన్నారు. ప్రతీ సోమవారం అధికారులంతా చేనేత దుస్తులు ధరించేలా చొరవ తీసుకున్నామని తెలిపారు. టీ షర్టు వేసుకుని మీ దగ్గరికి వచ్చానుగానీ.. అంతకు ముందు హాండ్లూమ్ షర్టే వేసుకున్నానని అన్నారు. ఈ సమావేశంలో కేటీఆర్ తో పాటు మద్రాస్ ఐఐఐటీ డైరెక్టర్ భాస్కర్ రామ్మూర్తి, తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. 

Related Stories