3 బిలియన్ డాలర్ల పరిశ్రమలో మార్కెట్ లీడర్ కావాలనే తాపత్రయం

బ్రాండ్ వస్తువుల అమ్మకంలో నూతన ఒరవడిని తీసుకొస్తున్న క్రియాలోపాలను సరిదిద్ది పరిశ్రమను సంస్కరించడంపై దృష్టి పెట్టిన సంస్థకొత్త కొత్త వ్యూహాలతో ముందుకు దూసుకువెళ్తున్న క్రియా

3 బిలియన్ డాలర్ల పరిశ్రమలో మార్కెట్ లీడర్ కావాలనే తాపత్రయం

Tuesday September 01, 2015,

3 min Read

5000 మంది వ్యాపారుల మధ్య సాగుతున్న పోటీలో, బ్రాండ్ వస్తువుల అమ్మకపు విభాగంలో లీడర్ అవ్వాలని ప్లాన్ చేస్తోంది క్రియా.

అడ్వర్టైజింగ్ రంగంలో బ్రాండ్ వస్తువుల అమ్మకం చాలా ముఖ్య పాత్ర వహిస్తోంది. ఒక కంపెనీ, కార్పొరేట్ ఇమేజ్, బ్రాండ్ లేదా ఈవెంట్‌ని వ్యాపార వేడుకలు, సదస్సులు మొదలైన వాటిలో ప్రమోట్ చేసేందుకు గొరిల్లా మార్కెటింగ్ క్యాంపైన్స్‌లో భాగంగా ఇది చాలా ఉపయోగపడుతోంది. దాదాపు 3 బిలియన్ డాలర్లతో, 5000 కంటే ఎక్కువ మంది పోటీదారులతో (ఒక అంచనా ప్రకారం) ఈ విభాగం కళకళాలాడుతోంది. కాకపోతే ఇంత పరిమాణం, ఇంతమంది వ్యాపారులతో ఈ పరిశ్రమ అలరారుతున్నా సరే పూర్తిగా ఛిన్నాభిన్నంగా, అసంఘటితంగా ఉంది.

ఎస్. ఉపకార్ శర్మ

ఎస్. ఉపకార్ శర్మ


ఇలాంటి సమయంలోనే మార్కెట్ ని అంచనా వేసారు ఎస్. ఉపకార్ శర్మ. ఈ విభాగంలో పెద్ద వ్యాపార అవకాశం ఉందని గమనించారు. 2008 లో బ్రాండ్ వస్తువుల వ్యాపారంలో బహుమతులు, అవార్డులు, ప్రమోషనల్ వస్తువులు మరియు యూనిఫామ్‌లు వంటివాటితో కంపెనీల అవసరాలను తీరుస్తూ బి2బి విభాగానికి సేవలు అందించడానికి ఆయన క్రియా ప్రారంభించారు.

“మేము ఈ వేదిక మీదకి డొమైన్ ఎక్స్‌పర్ట్స్‌గా వచ్చాం. కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మేము వారికి సహకరిస్తాం. ఇవాళ మేము సౌందర్య ఉత్పత్తులు, మద్యం, హోటళ్లు మరియు జిమ్‌ల వంటి పరిశ్రమలకి సేవలు అందిస్తున్నాం. ఇక్కడ వ్యాపార వస్తువులు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి కానీ ఇవి మరీ ఖరీదు ఎక్కువుండవు. అందుకే, ఈ పరిశ్రమలకి చెందిన వర్తకులు వ్యాపారాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ విషయమే మా సామర్ధ్యాలను చూపించేందుకు సహకరిస్తోంది”, అంటున్నారు ఉపకార్.

క్రియా దృక్పథంలో కొత్తదనం ఏమిటి ?

ఉపకార్ దృష్టిలో ఈ విభాగంలోకి అడుగుపెట్టడం చాలా సులువు, పైగా ఎంతో పెట్టుబడి కూడా అవసరం లేదు. చిన్న వ్యాపారుల ప్రవేశానికుండే అవరోధాన్ని పరిశీలిస్తే, ఇప్పటికే చాలామంది చిన్న చిన్న వ్యాపారులు, వర్తకులు మరియు కేటలాగ్ ఆధారిత వెబ్ సైట్స్ ఉన్నాయి. ఈ విభాగంలోని వ్యాపారులు ఉత్పత్తి-ప్రధాన వ్యాపారం దిశగా ప్రయాణిస్తున్నారు. క్రియా సేవలని అందిస్తోంది కానీ వ్యాపారం దిశగా మాత్రం నైపుణ్య-ప్రధాన దృక్పథంతో ఉందని ఆయన వివరిస్తారు.

“మా మాటల్లో ధరకి ప్రాధాన్యత ఉండదు. ఆలోచనలకే ప్రాధాన్యత ఉంటుంది. ఇది అమలు చెయ్యడం కొంచెం కష్టమే కానీ మా బంధాలు చాలా కాలం నిలిచి ఉంటున్నాయి. అలాగే కార్యకలాపాలు లాభదాయకంగా ఉండేలా కూడా చూస్తున్నాం”, అంటున్నారు ఉపకార్.

కంపెనీ ఎదుగుదల

గత ఐదేళ్లలో ఏటికేడాదిగా 60 శాతం స్థిరమైన రేటుతో వెంచర్ అభివృద్ధి చెందుతూ వస్తోంది. 2014-15 ఆర్ధిక సంవత్సరానికి 15 కోట్ల రూపాయలకంటే ఎక్కువ టర్నోవర్ ని కలసికట్టుగా సాధించింది. ఈ ఆర్ధిక సంవత్సరానికి 25 కోట్ల రూపాయల టర్నోవర్ ని దాటాలని చూస్తోంది.

ప్రపంచంలోనే అందరికీ సుపరిచితమైన బ్రాండ్స్- గూగుల్, పెర్నాడ్ రికార్డ్, లోరియల్, రిట్జ్ కార్ల్ టన్ హోటల్స్, పిజ్జా హట్, వెరో మోడా, జాక్ జోన్స్ మరియు కోహినూర్ ఫుడ్స్ మొదలైన వాటితో క్రియా పనిచేస్తోంది. “ మేం 25 కంటే ఎక్కువ కంపెనీలతో పనిచేస్తున్నాం. మొత్తంగా మాకు 400 మంది క్లైంట్లు ఉన్నారు, వీళ్లంతా మాతో ఎప్పటికప్పుడు పని చేస్తూనే ఉంటారు,” అంటూ వివరిస్తారు క్రియా స్థాపకుడు ఉపకార్.

వ్యాపార మోడల్ గురించి ఉపకార్ ఇలా చెప్తారు, “మాది చాలా పద్ధతిగా, ముక్కుసూటితనంగా సాగే వ్యాపార మోడల్. మేం క్లైంట్లకి, వస్తు వ్యాపార ఆలోచన నుంచి దాని అమలు వరకు సేవలు అందిస్తుంటాం, దానికి బదులుగా మాకు వాళ్లు డబ్బు చెల్లిస్తారు. మేము రీటైనర్ మోడల్ దిశగా కూడా పనిచెయ్యాలని ముందుకు సాగుతున్నాం.

మార్కెట్ విభాగం మరియు సవాళ్లు

బ్రాండ్ వస్తువుల వ్యాపారం మొత్తం దాదాపుగా మూడు బిలియన్ డాలర్లు ఉంది. నిపుణులు చెప్తున్నదాని ప్రకారం, ఈ విభాగంలో సీరియస్ గా చేపట్టిన అధ్యయనాలు లేనప్పటికీ, 5000 కంటే ఎక్కువమంది ఉన్నట్లు అంచనా. కాకపోతే, ఈ రంగంలో కొన్ని నిర్మాణాత్మక లోపాలు ఉన్నాయన్నది నిజం.

“పరిణామక్రమం లేదా అనుసంధానం వంటివాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాకరించే పరిశ్రమల్లో ఇది కూడా ఒకటి ఎందుకంటే ఈ దిశలో ఏకీకరణ లేదా ఎటువంటి ప్రయత్నం జరగడం లేదు. అందుకనే, క్రియాలో మేము ఈ పరిస్థితిని వీలైనంత త్వరగా అంతం చెయ్యడానికి ఒక మోడల్ మీద పని చేస్తున్నాం”, అంటారు ఉపకార్.

వస్తు వ్యాపారంలోని ప్రజలైనా లేదా క్లైంట్లైనా, భాగస్వాములందరి దృక్పథంతో మొదలుకొని ఇతర సవాళ్లు కూడా ఉన్నాయని ఈ వెంచర్ భావిస్తోంది. “బ్రాండ్ నిర్మాణం, అంటే అడ్వర్టైజింగ్ మరియు ఈవెంట్లు వంటి వాటి మీద పెట్టే దృష్టి, వ్యాపారం చెయ్యడంపై అంతగా పెట్టడం లేదు. మార్కెట్ ని ప్రక్షాళన చెయ్యడం ద్వారానే మార్పు వస్తుందని నేను నమ్ముతున్నాను,” అంటూ ఉపకార్ మరింతగా వివరిస్తున్నారు.

పోటీ

పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్న ఈ మార్కెట్ లో, చాలా చిన్న వ్యాపారులు, వర్తకులు తమ వ్యాపారాలు చేసుకుంటూ డబ్బు గడిస్తున్నారు. ఒకపక్క ఈ యంత్ర, డాల్ఫిన్ డిస్ ప్లేస్, బ్రాండ్ స్టిక్ వంటి పేరొందిన సంస్థలు బ్రాండ్ వస్తు వ్యాపారంలో తమ సేవలు అందిస్తున్నాయి.

భారతదేశంలో ఈయంత్ర వంటి కంపెనీలు ఎదగాలని చాలా ప్రయత్నం చేస్తూ అపరితమితమైన పెట్టుబడులు సంపాదిస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చక్కని ఫలితాలని అందుకోలేకపోయాయి. ఒకసారి చుట్టూ పరికించి చూస్తే, వర్చువల్ గా క్రియా యొక్క పోటీ వాతావరణంలో కేటలాగ్-ఆధారిత వెబ్ సైట్స్ వ్యాపారులే ఎక్కువగా ఉన్నారు.

రాబోయే సంవత్సరాల్లో, పోటీ వాతావరణంలో చెప్పుకోదగ్గ భారీ మార్పులే సంభవిస్తాయి. ఎందుకంటే 50 మిలియన్ డాలర్లకంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన అంతర్జాతీయ కంపెనీలు చాలావరకూ ఇప్పుడు భారతదేశం వైపే దృష్టి సారిస్తున్నాయి. ఈ అంశం తప్పకుండా మార్కెట్ ని కుదిపేస్తుంది, కానీ అదే సమయంలో చెల్లాచెదురుగా ఉన్న విభాగాన్ని ఒకతాటిపై తీసుకురావడానికి దోహద పడుతుంది.