ఈమె రాసిన పుస్తకాలు మార్కెట్లో హాట్ కేకులు !!

ఈమె రాసిన పుస్తకాలు మార్కెట్లో హాట్ కేకులు !!

Friday January 29, 2016,

2 min Read

ప్రీతి షెనాయ్. ఆమె అక్షరాలు తరంగ తురంగాలు. ఆమె వేసిన చిత్తరువులు మనసుని మార్దవంగా తడిమే ముగ్ద మనోహర దృశ్యాలు. ఎవరైనా ఒకటి రెండు రంగాల్లో టాలెంట్ చూపిస్తే మహా ఎక్కువ. కానీ ప్రీతి అలాకాదు. ఎక్స్ ట్రీమ్ టాలెంటెడ్ పర్సన్. వెర్సటైల్ ఆర్టిస్ట్. మంచి కథకురాలు. అందమైన పోయెట్రీ రాస్తారు. బ్లాగ్ మెయింటెన్ చేస్తారు. పేపర్ మడతలతో కళాఖండాలు సృష్టిస్తారు. ఒకప్పుడు బాస్కెట్ బాల్ ఆడేవారు. నేచర్ లవర్. టెడ్ ఎక్స్ స్పీకర్. అన్నిటికీ మించి ఒక మంచి మదర్. ఇన్నిరకాల ప్రతిభా పాటవాలున్నాయి కాబట్టే, ఇన్నిరకాల అభిరుచులు మేళవించాయి కాబట్టే, డిగ్రీలు కూడా అన్నేసి ఉన్నాయి. ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకో విశేషం ఏంటంటే, ప్రీతికి చిత్రలేఖనంలో (పోర్ట్రయిట్) యూకే నుంచి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. అన్నట్టు ఫోటోగ్రఫీలోనూ అనుభవం ఉంది.

image


కీన్లీ అబ్జర్వెంట్ మైండ్. ఏ విషయాన్నయినా ఎంతో ఆసక్తితో, చాలా సునిశితంగా గమనించే మనస్తత్వం ప్రీతిది. కథ అల్లే విధానం అద్భుతం. ఆమె కథనంలో అంతర్లీనంగా ఒక పాజిటివ్ దృక్ప‌థం పాఠకులను ఆద్యంతం వెంటాడుతుంది. ప్రతీ ఒక్కరూ నిండు జీవితాన్ని కోరుకోవాలనే తత్వం ఆమె రచనలో కనిపిస్తుంది. ఆ రైటింగ్ స్కిల్సే కోట్లాది మంది పాఠకుల అభిమానాన్ని సొంతం చేసుకునేలా చేశాయి.

ఈ స్టోరీ కూడా చదవండి

అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తక రచయితల్లో ప్రీతి ఒకరు. ఆ మాటకొస్తే ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఇండియాలో టాప్ 100 ప్రభావశీలురులో ఒకరు. ప్రీతి రాసిన మొదటి పుస్తకం 34 బబుల్ గమ్స్ అండ్ కేండిల్స్. సెకండ్ బుక్ లైఫ్ ఈజ్ వాట్ యు మేక్ ఇట్. 2011లో అత్యధికంగా అమ్ముడుపోయిందది. ఆ మాటకొస్తే ఇప్పటి వరకు కూడా ఆ బుక్కే హాట్ కేకులా అమ్ముడువుతోంది. మూడో పుస్తకం టీ ఫర్ టూ అండ్ ఏ పీస్ ఆఫ్ కేక్. ఫ్రిబ్రవరి 2012లో విడుదలైన ఆ ఫిక్షన బుక్- టాప్ ఫైవ్ సెల్లింగ్ కేటగిరీలో ఉండటం విశేషం. ఇక ఆమె నాలుగో పుస్తకం ద సీక్రెట్ విష్ లిస్ట్. అది 2013లో రిలీజ్ అయింది. అదీ బెస్ట్ సెల్లరే. రివ్యూలు కూడా బీభత్సంగా వచ్చాయి. ద వన్ యు కెనాట్ హావ్ అనే పుస్తకం ఐదవది- నీల్సన్ లిస్టు ప్రకారం అది ఇండియాలో బాగా అమ్ముడయిన ఫిక్షన్ పుస్తకాల్లో టాప్ 2 ప్లేస్ లో నిలిచింది. 2014లో ఇట్ హాపెన్స్ ఫర్ ఏ రీజన్ అనే పుస్తకాన్ని మార్కెట్లోకి తెచ్చారు. ఇటీవలే వై వియ్ లవ్ ద వే వీ డూ పేరుతో మరో బుక్ పబ్లిష్ చేశారు. ప్రీతి రచనలో ఎక్కువగా కనిపించే అంశాలు ప్రేమ, అభిమానం. ప్రతీ కథలోనూ ఆ రెండు అంతర్లీనంగా సాగుతుంటాయి.

image


పుస్తకాలే కాకుండా, ప్రముఖ ఇంగ్లీషు దినపత్రికలకు రెగ్యులర్ గా కాలమ్స్ కూడా రాస్తుంటారు. అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ కోసం ఇంగ్లీష్, మేథమెటిక్స్ బోధిస్తారు. ఇప్పటిదాకా అనేక స్కూళ్లో క్రియేటివ్ స్కిల్స్ పెంచేలా వర్క్ షాప్స్ నిర్వహించారు.

తండ్రి ఉద్యోగ రీత్యా ప్రీతి కుటుంబం దేశమంతా తిరగాల్సి వచ్చింది. అలా ఆమె ఇండియాలో ఉన్న అన్ని కేంద్రీయ విద్యాలయాల్లోనూ చదివారు. 2006 నుంచే బ్లాగ్ రాయడం మొదలుపెట్టారు. 2008 కల్లా ఆమె రాసిన బ్లాగ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని ఆంగ్ల దినపత్రికలకు కాలమ్స్ రాసేవారు. అలా అలా పుస్తక రచనకు దారితీసిందంటారు ప్రీతి. పుస్తకాలు చదివిన వాళ్లంత ఈ మెయిల్ ద్వారా అంతులేని అభిమానాన్ని కురిపించేవారని ఆమె సంతోషంతో చెప్పుకొచ్చారు. 

ఈ స్థాయికి రాడానికి కారణం కుటుంబ ఇచ్చిన సహకారమే అంటారు ప్రీతి. చిన్నప్పుడు పేరెంట్స్, పెళ్లయ్యాక భర్త మద్దతుతోనే ఈ స్థాయికి చేరుకున్నానంటారు. ఆడపిల్లల చదువుకోసం భవిష్యత్తులో పూర్తిస్థాయి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నారామె.

image


ప్రీతి చెప్పేదొక్కటే-

జీవితం చాలా చిన్నది. మనసుకు నచ్చినట్టు ఉండండి.. ఆ ఆటిట్యూడే మిమ్మల్ని గమ్యస్థానానికి చేరవేస్తుంది.

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి