మీ ఇంటికే చెఫ్‌లు వచ్చి అద్భుతంగా వండిపెడ్తారు - రెస్టో కిచ్ వినూత్న కాన్సెప్ట్

లంచ్, డిన్నర్, పార్టీ ఇచ్చే ఇళ్లలో...వంటింటికే పరిమితం ఆతిథ్యమిచ్చేవారుసమస్యను తీర్చేందుకు మేమున్నామంటున్న రెస్టోకిచ్చెఫ్‌లకు తమ బ్రాండ్ నిర్మించుకునే అవకాశంప్రఖ్యాత చెఫ్‌లతో మార్కెట్ ప్లేస్ రూపొందించిన ముకుల్, అమిత్

0

“ ఏ ఫుడ్ బిజినెస్‌కయినా సరే.. చెఫ్‌లే రియల్ హీరోలు... హోటల్, రెస్టారెంట్, పబ్‌లు కాదు” అంటున్నారు ముకుల్ శర్మ. ఇతను ఐఐటీ రూర్కీలో ఇంజినీరింగ్ విద్యాభ్యాసం చేసిన వ్యక్తి. కొన్నేళ్లపాటు యూజర్ ఇంటర్‌ఫేజ్ ఇంజినీర్‌గా పని చేశారు ముకుల్. ఫుడ్ ఇండస్ట్రీపై ఇతనికి మక్కువ ఎక్కువ. అందుకే కాలేజ్‌లో తన జూనియర్ అమిత్ కుమార్‌తో కలిసి.. చెఫ్‌ల కోసం ఒక కమ్యూనిటీ మార్కెట్ ప్లేస్ రూపొందించారు. ప్రతిభావంతులైన చెఫ్‌లతో కూడిన ఈ మార్కెట్ ప్లేస్ 'రెస్టోకిచ్'... ప్రజలకు రుచికరమైన ఆహారం పొందేందుకు ఉపయోగపడుతుంది.

ముకుల్ శర్మ, అమిత్ కుమార్, రెస్టో కిచ్ వ్యవస్థాపకులు
ముకుల్ శర్మ, అమిత్ కుమార్, రెస్టో కిచ్ వ్యవస్థాపకులు
“స్నేహితులు, కుటుంబ సభ్యులతో చిన్నపాటి పార్టీలు చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి సమయాల్లో పార్టీలకు పిలిచిన ఇంట్లోని వారు... ఎక్కువగా వంటింటికే పరిమితం కావాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని అర్ధం చేసుకునే రెస్టోకిచ్ మొదలైంది” అని చెప్పారు ముకుల్.

ముందు రీసెర్చ్.. తర్వాతే బిజినెస్

ఈ వ్యాపారం ప్రారంభించేందుకు ముందుగా ముకుల్ టీం మార్కెట్ రీసెర్చ్ నిర్వహించింది. స్థానిక కేటరింగ్ సర్వీసులతో కస్టమర్లు అసంతృప్తిగా ఉన్నారనే విషయం వారికి అర్ధమైంది. అదే సమయంలో వారికి మంచి చెఫ్‌లు అందుబాటులో లేకపోవడాన్ని కూడా గమనించారు వీరు.

“ ఈ గ్యాప్‌ను తగ్గించడానికే మా రెస్టోకిచ్. కస్టమర్లు, చెఫ్‌ల మధ్య ఉన్న ఈ అంతరాన్ని తగ్గించి, వారిని కలిపేందుకు ప్రయత్నిస్తున్నా”మని ముకుల్ అంటున్నారు.

డిన్నర్స్, లంచెస్, బ్రంచెస్, కాక్‌టైల్ పార్టీస్, పిక్నిక్స్... ఇలా సందర్భం ఏదైనా సరే... రెస్టోకిచ్ సేవలందిస్తుంది. టాప్ చెఫ్‌లు అందించే పదార్ధాల్లో కస్టమైజ్జ్ మెనూలను ఇవ్వగలగడం దీని ప్రత్యేకత. ప్రఖ్యాతి చెందిన రెస్టారెంట్స్, పబ్‌లకు చెందిన చెఫ్‌లు కస్టమర్లకు కావాల్సిన సేవలను అందిస్తారు. వంటలకు అవసరమైన పదార్ధాల షాపింగ్, కుకింగ్, సర్వింగ్ కూడా వారే నిర్వహిస్తారు. అసలు రెస్టోకిచ్ ప్రధాన ఉద్దేశ్యమే ఇది. వ్యక్తిగత, కుటుంబ పార్టీల్లో కూడా ప్రతిభావంతులైన చెఫ్‌ల సర్వీసులను... ఏమాత్రం ఇబ్బంది లేకుండా పొందాలనే దీన్ని ప్రారంభించామంటారు అమిత్.

రెండింటితో మొదలై... దేశమంతా

ప్రస్తుతం పూణె, ముంబైల్లో సేవలందిస్తున్న రెస్టోకిచ్... చెఫ్‌లు తమ సొంత బ్రాండ్‌ను అభివృద్ధి చేసుకునేందుకు సహకరిస్తోంది. “చెఫ్‌లు సొంత వ్యాపారాన్ని ఇష్టపడతారు, వాళ్లకు ఫేమ్ రావడం ద్వారా కొత్త క్లయింట్లు పెరుగుతారు. మాకు ఢిల్లీ, బెంగళూర్, చండీఘడ్, గోవా, అహ్మదాబాద్, హైద్రాబాద్ నగరాలకు విస్తరించే ప్రణాళికలున్నాయం”టున్నారు ముకుల్.

చెఫ్‌లు వారి సర్వీసులకు ఛార్జ్ చేసిన అమౌంట్లో కొంత పర్సంటేజ్‌ను ఫీజ్ రూపంలో తీసుకుంటుంది రెస్టోకిచ్. వారు వంట చేసే ప్రాంతంలో ఏర్పాటు చేసే ఈవెంట్లు మరో ఆదాయపు వనరు ఈ కంపెనీకి.

అంతర్జాతీయంగానూ ఇలాంటి సర్వీసులు అందించే కంపెనీలు కొన్ని ఉన్నాయి. యూనియన్ స్క్వేర్ వెంచర్స్ ఆధ్వర్యంలోని కిచెన్‌సర్ఫింగ్‌తోపాటు కిట్‌చిట్ కూడా ఇలాంటి సేవలే అందిస్తోంది. ఈ బిజినెస్ మోడల్‌ను ఇండియాకు తీసుకొచ్చింది రెస్టోకిచ్. బెంగళూరులో నడుస్తున్న కుకుంబర్‌ టౌన్, పూణే కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డిషూంఇట్ కూడా రెస్టోకిచ్ మాదిరి సర్వీసులు అందించేవే.

రుచికరమైన ఆహారం తీసుకోవడంలో ఆనందాన్ని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకురావాలి అంటారు ముకుల్, అమిత్. రెస్టోకిచ్ ఇప్పటికే ఈ తరహా గుర్తింపు పొందినా... వీరి ప్రయాణం ఇప్పుడే మొదలైంది. కస్టమర్లను తమ దగ్గరు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మురంగానే చేస్తోంది. త్వరలో ఆండ్రాయిడ్ ఆప్‌ను కూడా లాంఛ్ చేయనున్నారు ముకుల్, అమిత్‌లు.

వెబ్‌సైట్ : restokitch