రిటైలర్ల వ్యాపారం పెంచుతున్న 'నెంబర్ మాల్'

రిటైలర్ల వ్యాపారం పెంచుతున్న 'నెంబర్ మాల్'

Thursday June 18, 2015,

2 min Read


లోకల్ రిటైలర్స్ మార్కెట్‌ను పెంచడంలో సక్సెస్ అయ్యారు నెంబర్ మాల్ ఫౌండర్ గాలి కిరణ్ కుమార్. ఆన్ లైన్ మార్కెట్ ద్వారా వస్తువులు, సేవల అమ్మకాలలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. ఆన్‌లైన్ అమ్మకాలతో.. స్థానికంగా ఉండే చిల్లర వర్తకులకూ బిజినెస్ ఇస్తూ నయా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు.

రెండేళ్లలో మూడొందల శాతం వృద్ధి

2012 నుంచి నెంబర్ మాల్స్ వేగంగా విస్తరిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు వందల శాతం వృద్ధితో 12,500 రిటైల్ నెట్ వర్క్స్ ఏర్పడ్డాయి. సంస్థకు వస్తున్న ఆదరణతో అటు వ్యాపారం పెరుగుతోంది. " మేము భారతదేశంలో కొత్త మార్కెట్లలోకి విస్తరించడానికి నిధులు సేకరించాలని నిర్ణయించుకున్నాం. 2012-13లో రూ. 37 కోట్లు, 2013-14లో రూ. 117 కోట్ల టర్నోవర్ చేశాం. 2014-15 నాటికి 250 కోట్ల టర్నోవర్‌కు చేరడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం'' అంటారు కిరణ్. 

మొదట్లో నలుగురితో ప్రారంభమైన ప్రయాణం...ఇప్పటికి 30 మంది ఉద్యోగులకు చేరుకుంది. రెండు రాష్ట్రాల్లో 200 పైగా పంపిణీదారులు, దాదాపు లక్షా ఇరవై వేల మందికిపైగా చిల్లర వర్తకుల భాగస్వామ్యం ఉంది. సాధారణంగా ఒక్కో లావాదేవీకి కమిషన్ ఉంటుంది. అయితే ఖచ్చితమైన లాభం, మార్జిన్‌పై స్పష్టమైన వివరణ మాత్రం ఇవ్వడానికి నిరాకరించారు. కానీ టర్నోవర్‌లో ఒక శాతం వరకు నెంబర్ మాల్ ఫౌండర్స్ చేతికి అందుతుందని మాత్రం వివరించారు.

image


నెంబర్ మాల్ ద్వారా బిటుబి , బిటుసి వ్యాపారం ఉంటుంది. ప్రారంభంలో మొబైల్ రీఛార్జి, DTH రిఛార్జి, డేటా కార్డు రిఛార్జి, పోస్ట్ పెయిడ్ బిల్స్, ఆన్ లైన్ బస్సు టిక్కెట్లు.. ఇలా అన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. వీటితోపాటు మొబైల్ ఫోన్ ఆధారిత సేవల ద్వారా వ్యాపారం పెంచుకుంటున్నారు. రీఛార్జి, చెల్లింపులు, టిక్కెట్లు కొనుగోళ్లపై కస్టమర్లకు డిస్కౌంట్ ఆఫర్లను ఇస్తూ వాళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

కస్టమర్లకు క్యాష్ బ్యాక్

" ఒక కస్టమర్ నెంబర్‌ మాల్‌లో మొబైల్ రీఛార్జ్ కోసం రూ .100 ఖర్చుపెడితే, అతనికి తిరిగి వంద రూపాయిల డిస్కౌంట్ కూపన్లు ఇస్తాము. దీని ద్వారా అతనికి 100 రూపాయిల విలువ గల వస్తువులు పొందే అవకాశం కూడా ఉంటుంది. దీని వల్ల వినియోగదారులు రోజువారీ అవసరాలు కోసం మేం అందించే వివిధ సేవలను ఉపయోగించడానికి వస్తున్నారు. మేము ఇచ్చే కూపన్లను స్థానిక వ్యాపారుల దగ్గర క్లెయిమ్ చేసుకోవచ్చు. దీంతో వివిధ సేవల కోసం లక్షలాది మంది వినియోగదారులు మా దగ్గర ఖాతాదరులుగా మారుతున్నారు. ఫలితంగా మా బిజినెస్‌తో పాటు స్థానికి వ్యాపారులకు కూడా మేలు చేకూరుతుంది '' అంటారు కిరణ్.

image


రిటైలర్స్ ఎదుగుదలకూ నెంబర్ మాల్ కారణమవుతోంది. వినియోగదారులకు కూపన్లు సరఫరా చేయడం, వాళ్లు దాన్ని చిన్న వ్యాపారుల దగ్గర ఎన్‌క్యాష్ చేసుకోవడం వల్ల లావాదేవీలు పెరుగుతున్నాయి. నెంబర్ ఒక ఏకీకృత ERP (ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్)కి వేదిక. వివిధ రకాల సేవలు అందించే ఒక కామన్ ప్లాట్ ఫాం. ప్రైవేట్ టెలికాం, వినోదం, ప్రయాణం, బీమా, ఆర్థిక సేవలు వంటి రంగాల నుంచి వీళ్లకు కూపన్లు అందుతున్నాయి.

'' పెద్ద సమస్యలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతే తప్ప వాటి నుంచి దూరంగా పారిపోవడం సమస్యకు పరిష్కారం కాదు. ఉన్నత స్థాయిలో ఉండాలంటే... గొప్పగా ఆలోచించాలి '' అని సూచిస్తారు కిరణ్ కుమార్.