స్మార్ట్‌గా ఎదుగుతున్న టెస్టింగ్ ప్లాట్‌ఫాం 'రోబస్‌టెస్ట్'

డెవలపర్లకు యాప్ టెస్టింగ్‌లో ఎదురవుతున్న సమస్యలుడెవలపర్లకు, టెస్టర్లకు వారధిగా మారుతున్న రోబస్‌టెస్ట్ఔట్ సోర్సింగ్‌తో.. యాప్‌ల టెస్టింగ్తక్కువ సమయంలో ఎక్కువ డివైజ్‌లపై టెస్టింగ్ చేసే ఛాన్స్

0

2016 చివరకు 900వందల కోట్ల స్మార్ట్ ఫోన్లు, 2015 చివరకు 20కోట్ల యాప్ డౌన్ లోడ్స్, పెయిడ్ యాప్స్ ద్వారా ₹1500 కోట్ల ఆదాయం. ఇదీ మన దేశంలో స్మార్ట్ ఎదుగుతున్న తీరుపై ఓ అంచనా. ఈ అంకెలు.. మన దేశంలో యాప్ మార్కెట్‌కు ఎంతటి భవిష్యత్ ఉందో అద్దం పడుతున్నాయి.

ఇంత హెవీ ట్రాఫిక్ ఉన్న మార్కెట్‌లోకి వినూత్నమైన ఆలోచనతో అడుగుపెట్టింది రోబస్‌టెస్ట్. ఓంనారాయణ్, ఐశ్వర్య మిశ్రాలు సహ వ్యవస్థాపకులుగా 2014 డిసెంబర్‌లో దీన్ని ప్రారంభించారు. ప్రమతి టెక్నాలజీస్‌లో సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ డిపార్ట్‌మెంట్‌లో కలిసి పని చేస్తున్నపుడు వీరిద్దరికీ పరిచయం అయింది. టూల్ డెవలప్‌మెంట్ విభాగంలో ఓం పని చేయగా.. బిజినెస్, యూజర్ ఎక్స్‌పీరియెన్స్‌లను ఐశ్వర్య చూసుకునేవారు. తమ ఇద్దరి పరిచయమే కాకుండా.. తాము ఓ వెంచర్‌ని ప్రారంభించగలమనే నమ్మకం కుదిరిందని చెప్పారు ఐశ్వర్య.

రోబస్‌టెస్ట్‌ను ₹10-15 లక్షలు తాను పొదుపుచేసిన మొత్తంతోనే ప్రారంభించారు ఓం. విపరీతమైన ఫ్రస్టేషన్ కారణంగా.. ఈ వెంచర్ మొదలుపెట్టాల్సి వచ్చిందని చెబ్తున్నారు ఐశ్వర్య.

"సాధారణంగా ప్రతీ మొబైల్ అప్లికేషన్‌ను అనేక డివైజ్‌లలో టెస్టింగ్ చేస్తాం. అన్ని రకాల మొబైల్స్‌ను కొనుగోలు చేయడం, లాగ్స్ రిజిస్టర్ ఉపయోగించి వాటిని నిర్వహించడం, యాప్ డెవలప్‌మెంట్ కోసం సిస్టమ్స్‌లోకి వాటిని స్వాప్ చేయడం.. ఇంత తతంగం ఉంటుంది టెస్టింగ్ కోసం. అవసరం ఉన్నా లేకపోయినా.. 40కి పైగా డివైజ్‌లలో యాప్‌లను టెస్టింగ్ చేయక తప్పదు. అయినా సరే... కస్టమర్ ఉపయోగించే మొబైల్‌కు ఈ యాప్ అనుగుణంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పే అవకాశం లేదు."

ఈ సమస్యకు పరిష్కారమే రోబస్‌టెస్ట్. యాప్‌లు రూపొందించేవారికి... వారి యాప్‌లను టెస్టింగ్ చేసేందుకు ఇది వన్ స్టాప్ ప్లాట్‌ఫాం. కేవలం బ్రౌజర్‌ను ఉగయోగించి.. యాప్‌లను మాన్యువల్‌గా పరీక్షించే అవకాశం కల్పిస్తుంది. ఎలాంటి కోడ్స్ రాయకుండా.. ఆటోమేటెడ్ టెస్ట్‌లను ఒకేసారి నిర్వహించడం ద్వారా.. యాప్ పనితీరుపై పూర్తి స్థాయి రివ్యూ ఇవ్వగలదు. మొబైల్ ఇంటర్‌ఫేజ్‌లో యాప్ ఎలా పని చేస్తుందో చెప్పేస్తుంది రోబస్‌టెస్ట్.

దీనివల్ల కలిగే ప్రధాన ఉపయోగం ఏంటంటే... యాప్ పబ్లిషర్లు అనేక డివైజ్‌లను నిర్వహించాల్సిన అవసరం ఉండదు. వారు ఎప్పుడు కావాలన్నా.. ఎక్కడ కావాలన్నా.. డివైజ్‌లను మోసుకెళ్లకుండానే.. యాక్సెస్ చేసే అవకాశం కల్పిస్తుంది. ఆయా ఇంటర్‌ఫేజ్ సెషన్స్‌ను సొంత మొబైల్ డివైజ్‌లకు షేర్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. దీంతో ఆయా మొబైల్స్‌లో యాప్స్‌ను రియల్ టైంలో ఉపయోగిస్తున్న అనుభూతి లభిస్తుంది.

ఈ స్టార్టప్ రూపొందించిన మూడో ప్రొడక్ట్ ఇది. దీనికి ముందు బగ్ మేనేజ్మెంట్‌కు క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్, వెబ్ అప్లికేషన్ టెస్టింగ్‌లను లాంఛ్ చేశారు. 2015మే నెలలో ప్రారంభమైన ఈ వెంచర్... ప్రస్తుతం 15 రకాల విభిన్న ఇంటర్‌ఫేజ్‌లకు వీలుగా ఉంది. ప్రతీ మోడల్‌కు విభిన్నమైన ఆదాయ మార్గాలు ఉండడం మరో విశేషం.

రెవెన్యూ మోడల్

రోబస్‌టెస్ట్ వెబ్‌సైట్‌లో సైనప్ అవడం ద్వారా.. యూజర్లకు 60 నిమిషాల ఉచిత డివైజ్ గంటలు లభిస్తాయి. ఈ సమయాన్ని రోబస్‌టెస్ట్ అందించే పలు రకాల టెస్టింగ్‌లకు ఉపయోగించుకోవచ్చు. మొదటి 60 నిమిషాలు పూర్తయ్యాక.. గంటకు ఇంత చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం యూజర్ల నుంచి గంటకు 5 అమెరికన్ డాలర్ల చొప్పున ఛార్జ్ చేస్తున్నారు. తమ బ్రాండ్‌ను అభివృద్ధి చేసుకునేందుకు ఇప్పటికి ఎంటర్‌ప్రైజ్ మోడల్(బీ2బీ)నే అవలంబిస్తోంది రోబస్‌టెస్ట్. తమ వ్యాపారం బీ2సీ స్థాయికి చేరేందుకు చాలా పబ్లిక్ క్లౌడ్ అవసరమని.. ఇందుకోసం చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరమని చెబ్తున్నారు ఐశ్వర్య. ఎంటర్‌ప్రైజ్ మోడల్ ద్వారా రెండు రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో మొదటి ఆప్షన్ 'హోస్టెడ్'... దీని ద్వారా ఏ సంస్థయినా ₹3 లక్షలు చెల్లించడం ద్వారా.. ప్రతీ నెలా 10డివైజ్‌లను పబ్లిక్ క్లౌడ్ ద్వారా పరీక్షించుకోవచ్చు. ఒకవేళ ఈ సంఖ్య 10 డివైజ్‌లకు మించితే.. ప్రతీ అదనపు డివైజ్‌కు ₹30వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

అయితే.. ఇప్పటికీ అనేక సంస్థలు పబ్లిక్ క్లౌడ్ ద్వారా టెస్టింగ్ చేసేందుకు అంతగా ముందుకు రావు. ఇలాంటివారికోసం రెండో ఆప్షన్ అందిస్తోంది రోబస్‌టెస్ట్. ఈ ఆన్ ప్రెమిసిస్ మోడల్ ద్వారా.. హార్డ్‌వేర్ సహా మొత్తం ప్లాట్‌ఫాంను క్లయింట్ ఆఫీసులోనే అమరుస్తారు. సాధారణంగా దీనికి వార్షిక లైసెన్సు ఫీజ్ వసూలు చేస్తారు. ప్రస్తుతం ఒకో క్లయింట్‌ ₹ 60 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. క్లయింట్లతో ఉన్న అనుబంధం ఆధారంగా... కొంత డిస్కౌంట్ ఇచ్చేందుకు కూడా వెనకాడబోరు ఈ టీం.

అంచనాలు, గణంకాల్లో.. ప్రతీ అంశానికీ దేని ప్రత్యేకత దానికి ఉంటుందంటున్న రోబస్‌టెస్ట్... తమ కంపెనీ అభివృద్ధిని మాత్రం ఇంకా లెక్క కట్టలేదు. అయితే... 2015 ఆగస్ట్ చివర్లో బ్లాగ్‌ను ప్రారంభించి... కస్టమర్, ప్రొఫెషనల్స్ నుంచి ఫీడ్‌బ్యాక్, సజెషన్స్ తీసుకుంటున్నారు. అంతే కాదు.. ఈ బ్లాగ్ ద్వారా డెవలపర్లు.. ప్రాజెక్ట్ బేసిస్‌గా టెస్టర్స్‌ను రిక్రూట్ చేసుకునే అవకాశం కల్పిస్తుండడం విశేషం.


రోబస్‌టెస్ట్ యూజర్ ఇంటర్‌ఫేజ్ స్నాప్‌షాట్
రోబస్‌టెస్ట్ యూజర్ ఇంటర్‌ఫేజ్ స్నాప్‌షాట్

విధాన ప్రణాళికలు

మరి కొన్ని నెలల్లో క్రౌడ్ సోర్సింగ్ ఆధారిత టెస్టింగ్ మోడల్‌ను లాంఛ్ చేసేందుకు రెడీ అవుతోంది రోబస్‌టెస్ట్. టెస్టర్లకు, డెవలపర్లకు మధ్య ఔట్‌సోర్సింగ్ ప్లాట్‌ఫాంగా ఎదిగేందుకు, నిలిచేందుకు ఈ స్టార్టప్ ప్రయత్నిస్తోంది. ఆదాయాన్ని అప్లికేషన్ టెస్టర్స్‌తో కలిసి పంచుకుంటామని చెబ్తున్నారు.

గార్ట్‌నర్ నివేదిక ప్రకారం వినియోగ వస్తువుల తయారీదారులకు 75శాతం ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన ఐడియాలు.. క్రౌడ్ సోర్సింగ్ ద్వారా వస్తున్నాయి. అందుకే ఈ విధానాన్నే అవలంబించేందుకు సిద్ధమైంది రోబస్‌టెస్ట్.

పైలట్ ప్రాజెక్టుల్లో కలిసి పని చేస్తామంటూ.. ప్రస్తుతం టెలికాం, ఆర్ధిక సర్వీసులు నిర్వహించే కంపెనీలతో చర్చలు నిర్వహిస్తున్నారు ఈ టీం. మెసేజింగ్ రంగంలో విక్రేతలుగా ఉన్న కంపెనీలతో కూడా కలిసి పనిచేస్తున్నారు. ప్రధానంగా ఈ కంపెనీ క్లయింట్లు రెండు రకాలు ఉండనున్నారు. కస్టమర్లకు మొబైల్ యాప్ ద్వారా సర్వీసులు అందించేవారు మొదటి విభాగం కాగా... అవసరాలకు తగినట్లుగా యాప్స్‌ను ఉపయోగించుకునేవారు రెండో వర్గం.

ఏం తెలిసింది ? ఏం నేర్చుకున్నారు ?

మొదటి కస్టమర్‌ను సాధించడం కోసం కష్టపడాల్సి వచ్చింది రోబస్‌టెస్ట్ టీం. అయితే... ఈ ప్రయాణంలో మూలధనం సమీకరించుకోవడం వీరు ఎదుర్కున్న రెండో సవాల్. త్వరలో నిధులు సమీకరించేందుకు చర్చలు నిర్వహించబోతున్నారు.

"ఎప్పుడైనా సరే అంతిమమైన ప్రొడక్ట్ తయారు చేయడం పెద్ద సవాల్. అత్యంత వినూత్నంగా ఉంటూనే.. పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు.. కస్టమర్లకు కస్టమైజ్డ్ సర్వీసులు అందిస్తున్నాం. వారి అంచనాలకు తగినట్లుగా ఉండేందుకు అనునిత్యం కృషి చేస్తున్నా"మన్నారు ఐశ్వర్య.

రోబస్‌టెస్ట్ అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు ఇక్కడితో అయిపోలేదు. తమ జర్నీలో ప్రతీ రోజు మంచిచెడులను చవి చూశామని చెబ్తున్నారు. విసుగు చెందిన సందర్భాలు, సంతృప్తి చెందిన క్షణాలను ప్రతీ రోజు అనుభవించామంటున్నారు. ఒక ప్రొడక్ట్ అంటే కొన్ని ఫీచర్స్, కొంత టెక్నాలజీని అందించడం మాత్రమే కాదని.. సమస్యని పరిష్కరించేది మాత్రమే అసలైన ప్రొడక్ట్ అని విశ్వసిస్తామని చెబ్తున్నారు రోబస్‌టెస్ట్ టీం.

ఔత్సాహికులకు సూచనలు

ఎవరైనా ఒక ప్రొడక్ట్ అభివృద్ధి చేయాలనుకునేవారికి కొన్ని సూచనలు చేస్తున్నారు వీరు. ముందు తమని తాము కొన్ని ప్రశ్నలు వేసుకోవాలంటున్నారు. "ఎవరి కోసం ఈ ప్రొడక్ట్, వారు ఎదుర్కొనే ఏ సమస్యలను పరిష్కరించబోతున్నామో అంచనా వేసుకోవాలి. నిజానికి వీటికి ఆన్సర్ చేయడం అంత సులభం కాదు. అప్పటికే ఆ ఫీచర్ ఉందా, ఎవరైనా అవే ఫీచర్స్ అందిస్తున్నారా అనే అంశాలపై పరిశోధన చేయాలి. ఇలాంటి విషయాలు చాలా ఎక్కువ ప్రభావం చూపుతాయి. సొంత నిధులతో ఏర్పాటు చేసే స్టార్టప్‌లు... ప్రభావం చూపగలిగేవిగా ఉన్నపుడే నిలదొక్కుకునేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది.

2015 తొలి అర్ధ భాగంలో మొబైల్ స్టార్టప్ ఇండస్ట్రీకి.. 39 డీల్స్ ద్వారా 519 మిలియన్ డాలర్లు పెట్టుబడుల రూపంలో అందాయి. ఈ రంగంలో మరింత విస్తృతంగా అభివృద్ధికి ఆస్కారముందని చెప్పడానికి ఇదే నిదర్శనం.

వెబ్‌సైట్