డెస్క్‌టాప్‌పైకే డీల్స్, మొబైల్‌కే కూపన్స్.. 'గ్రాబ్‌ ఆన్' జోరు

డెస్క్‌టాప్‌పైకే డీల్స్, మొబైల్‌కే కూపన్స్.. 'గ్రాబ్‌ ఆన్' జోరు

Friday September 25, 2015,

3 min Read

ఆన్‌లైన్లోకానీ, ఆఫ్‌లైన్లో కానీ ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలనుకుంటున్నారా ? అయితే ఒక్క క్షణం. మీకోసం ఎన్నో ఆఫర్లు, డీల్స్ సిద్ధంగా ఉన్నాయి. కూపన్లు, డీల్స్ కోసం మీరు ఏ సైటూ వెతకాల్సిన పనిలేదు. మీ వర్క్ స్టేషన్ డెస్క్‌టాప్‌‌పైకే, లేదంటే మీ అరచేతిలోని మొబైల్ పైనే ఆఫర్లు, డీల్స్ వివరాలు వచ్చేస్తాయి. ఇందుకు మీరు చేయాల్సిందల్లా గ్రాబ్‌ఆన్ డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది.

గ్రాబ్ ఆన్, ఆన్‌లైన్‌లో కూపన్స్, డీల్స్ నిర్వహించే సంస్థ. కొత్త కొత్త ఆఫర్లు, టెక్నాలజీతో మరింతగా ఆకట్టుకుంటోంది. ఈ సంస్థ తాజాగా బజ్.మీ పేరుతో డెస్క్‌టాప్, మొబైల్ నోటిఫికేషన్ సిస్టంను ప్రారంభించింది. మార్కెట్లోకి వస్తున్న కొత్త కూపన్లు, డీల్స్ గురించి కంప్యూటర్ డెస్క్ టాప్, మొబైల్స్‌లలో పాప్ విండో ద్వారా కస్టమర్లకు నోటిఫికేషన్ ఇస్తుందీ బజ్.మీ.

గ్రాబ్‌ఆన్ టీమ్

గ్రాబ్‌ఆన్ టీమ్


ఈ సంస్థను ప్రారంభించింది అశోక్ రెడ్డి. ‘‘ ఒక్క నెల రోజుల సమయంలోపే లక్షమంది యూజర్లు వచ్చిచేరారు. వారందరికీ గ్రాబ్‌ఆన్ నుంచి వారి వర్క్‌ స్టేషన్లు, మొబైళ్లలోనే కూపన్స్ అందిస్తున్నాం. వాస్తవికమైన కూపన్లు, టెక్నాలజీ ఇన్నేవోషన్లను మాత్రమే మా గ్రాబ్‌ఆన్‌లో కస్టమర్లకు అందజేస్తున్నాం ’’ అని ఆయన వివరించారు.

ఈ రంగంలో అడుగుపెట్టిన తొలి వేదిక గ్రాబ్‌ఆన్. మార్కెట్లో ఉన్న సాధ్యమైనంత తక్కువ ధరకు కొనుగోలుదారుడు వస్తువును కొనుగోలు చేసేందుకు ఈ ప్లాట్‌ఫామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాస్ట్ పర్ సేల్ మోడల్, ఎండ్ సేల్ ఆధారంగా ఈ సంస్థ వ్యాపారం నిర్వహిస్తుంటుంది.

యూజర్లకు వీలైనంత తక్కువ ధరకు వస్తువులను ఇప్పించడంపైనే దృష్టిసారించామని, తద్వారా కస్టమర్లు మంచి లాభాలాను సాధిస్తారని అశోక్‌రెడ్డి చెప్తున్నారు. మరోవైపు వ్యాపారులు రోజుకో కొత్త డీల్, ఆఫర్ పెడుతుండటంతో తమ యూజర్లకు వాటి వివరాలను అందజేస్తామని ఆయన అంటున్నారు.

మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న అన్ని అతిపెద్ద ఆన్‌లైన్ కంపెనీలతో గ్రాబ్‌ఆన్ నేరుగా వ్యూహాత్మక బిజినెస్ మోడల్‌ను రూపొందించుకుంది. రెండువేలకు పైగా కంపెనీలతో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఉబర్, పేటీఎం, ఫ్రీచార్జ్, స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, మొబిక్విక్ వంటి కంపెనీలతో గ్రాబ్‌ఆన్‌కు టై అప్ ఉంది.

అభివృద్ధి బాటన..

ఈ సంస్థకు ల్యాండ్‌మార్క్ ఐటీ సొల్యూషన్స్ వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ సంస్థకు 25,00,000 అమెరికన్ డాలర్ల పెట్టుబడి వచ్చింది. గ్రాబ్‌ఆన్ టీమ్ ఏర్పాటు, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ ఎక్స్‌పాన్షన్, అడ్వర్టయిజింగ్ వంటివాటి కోసం ఈ పెట్టుబడులను ఉపయోగించుకుంటున్నారు. గత ఏడాదిన్నరగా సంస్థ అభివృద్ధిలో దూసుకుపోతోంది.

‘‘ ఒక్క నెలలోనే మా సైట్‌ను నాలుగు లక్షల మంది సందర్శించారు. ప్రతి నెల 55 లక్షల కూపన్లు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. వచ్చే ఏడాది జూన్ కల్లా రూ. 12 కోట్లు ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నాం. డిసెంబర్ నుంచి ప్రతి నెలా రూ. కోటిన్నరను ఆర్జిస్తాం ’’ అని అశోక్ వివరించారు. మరోవైపు సిరీస్-ఏ కోసం 15 మిలియన్ డాలర్ల నిధులను రెండు నెలల్లో సమీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నిధులను సంస్థ ఆఫ్‌లైన్ విస్తరణ, టెక్నాలజీ రోడ్ మ్యాప్ కోసం వినియోగిస్తామని చెప్పారు.

కాంపిటీషన్..

గూగుల్ ఆన్‌లైన్ షాపింగ్ గ్రోత్ ట్రెండ్స్ రిపోర్ట్, ఫోరెస్టర్ రీసెర్చ్ ప్రకారం మొత్తం ఇండియా ఈ-కామర్స్ షాపర్స్‌లో కూపన్ బిజినెస్ 13.5 శాతం ఉంటుందని అంచనా. అలాగే వృద్ధి రేటు 62.9గా ఉంది. ప్రతి నెలా 7.6 మిలియన్ల మంది కొత్త యూజర్లు వస్తున్నారని సమాచారం. అయితే ఈ రంగంలో మార్కెటింగ్ స్పేస్ చాలా పెద్దది. కంపెనీలతోపాటు ఫ్రీలాన్సర్లు సైతం కూపన్లను విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రస్తుతానికైతే గ్రాబ్‌ఆన్ తోపాటు కూపన్ దునియా, 27 కూపన్స్, కూపన్ నేషన్, పెన్నీఫుల్, క్యాష్‌కరోలాంటి సంస్థలు ఈ మార్కెట్లో హడావుడి చేస్తున్నాయి. 

ఈ సెగ్మెంట్లో గట్టిపోటీదారు కూపన్ దునియాను టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ గత ఏడాది సొంతం చేసుకుంది. ఈ సంస్థ అభివృద్ధి అద్భుతంగా ఉంది. ఇటీవలే బ్రిక్ అండ్ మోర్టర్ రిటైల్ లోకి కూడా ప్రవేశించింది. మొబైల్, వెబ్ యాప్‌ల ద్వారా ప్రతి నెలా పదిలక్షల సెషన్స్‌ను ఈ కంపెనీ నిర్వహిస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌పై రెండు వేలకు పైగా ఆన్‌లైన్ స్టోర్స్, 5 వేలకు పైగా రెస్టారెంట్స్ ఉన్నాయి.

ఇక ఈ రంగంలో మిగతా కంపెనీలకు గట్టి పోటీనిస్తున్న కూపన్ నేషన్‌ను రాకెట్ ఇంటర్నెట్ నిర్వహిస్తోంది. క్యాష్‌కరో కూడా మంచి డీల్స్,ఆఫర్లతో గట్టిపోటీనిస్తోంది. ఈ సెగ్మంట్లో గట్టి పోటీ ఉన్నప్పటికీ తాము మాత్రం మంచి ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నామని అశోక్ చెప్పారు.

‘‘ మార్కెట్ పరిస్థితిని మార్చేందుకు మేం తీవ్రంగా కష్టపడుతున్నాం. సంస్థ ఏర్పాటై రెండు సంవత్సరాలు కూడా కాకపోయినప్పటికీ ప్రతి నెలా కోటికి పైగా మా వెబ్‌సైట్‌ను సందర్శిస్తున్నారు. రానున్న రోజుల్లో భారత్‌లో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో మంచి సేవింగ్స్ ప్లాట్‌ఫాంగా నిలుస్తామన్న నమ్మకముంది ’’ అని అశోక్ వివరించారు.

వెబ్ సైట్: Website