చిక్మంగళూరు చిన్నారి కాఫీ తోట ఇదే హళ్లీ బెర్రీ తేజిని కరియప్ప కథ

చిన్నగా ఎదగడమే విజయరహస్యమంటున్న తేజి27 ఏళ్లకే పిఆర్ కంపెనీఅమ్మతో కలసి కమ్మనైన కాఫీ వ్యాపారంసవాళ్లను అదిగమించిన హళ్లీ బెర్రీ

చిక్మంగళూరు
చిన్నారి కాఫీ తోట
ఇదే హళ్లీ బెర్రీ తేజిని కరియప్ప కథ

Thursday May 07, 2015,

4 min Read

హళ్లీ బెర్రీది మంచి కాఫీలాంటి కథ. కర్నాటక కు చెందిన ఈ కాఫీ బ్రాండ్ వెనకున్న అమ్మాయే తేజిని. నాటకరంగంతో కెరియర్ ప్రారంభించిన ఆమె ఇప్పుడు ఇంటర్నేషన్ కాఫీ బ్రాండ్ ఓనర్. తేజిని ఆరు పెద్ద థియేటర్ ప్రొడక్షన్ కంపెనీలతో కలిసి పనిచేశారు . నాన్న చనిపోయిన తర్వాత ఇండియాకి వచ్చి అమ్మకు తోడుగా వున్నారామె. 27 ఏళ్ళకే ఎస్ట్రాడా అనే స్పోర్ట్స్ అండ్ లైఫ్ స్టైల్ పి.ఆర్. ఏజెన్సీని స్థాపించి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ సబ్జెక్టులో తేజిని కరియప్ప డబుల్ డిగ్రీ చేశారు. ఆమె సొంతురు బెంగళూరు. విద్యాభ్యాసం సోఫియా హైస్కూల్లో సాగింది. తర్వాత ఆస్ట్రేలియా పయనం. ఇండియాకు తిరిగివచ్చిన తర్వాత తన స్నేహితునితో కలిసి పనిచేశారు తేజిని. కొన్నేళ్లుగా ఆమె గమనించిన మార్పు ఏంటంటే పనిచేసిన చోట మంచి నెట్వర్క్‌తో కూడిన కాంటాక్ట్స్ ఏర్పరుచుకోవడం. తను చేస్తున్న ఉద్యోగంతో సంతృప్తి చెందక ఏం చేస్తున్నానో ఆలోచించడం మొదలు పెట్టారు. 2013లో జాబ్ వదిలేయడానికే సిద్దపడ్డారు. అప్పుడే ఎస్ట్రాడా, హళ్లి బెర్రీని స్థాపించారు. ఆమె మొదటి క్లైంట్ “మాసాబ” ఒక ఫ్యాషన్ డిజైనర్. మార్కెటింగ్ చూసుకోవడానికి ఎవర్నైనా నియమించాలనుకొంది . ఐడియా వినడానికి బాగానే వుంది. దీంతో మార్కెటింగ్ స్టార్ట్ చేశానని చెప్పుకొచ్చారు . ఎస్ట్రాడా డిసెంబర్ 2013 లో రూపొందించారు. నేను తక్కువగా ఉన్న కంపెనీని దాన్నే ఎక్కువగా ఫీల్ అవ్వడం నేర్చుకొన్నాను . ఎలా అంటే అది నా బట్టలు విషయ౦లోనైనా,జీవితంలోనైనా, నా ఏజెన్సీలో పనిచేసే వాళ్లతోనైనా అలాగే వున్నాను. నీకు ఇద్దరు క్లైంట్స్ వున్నా పర్లేదు నువ్వు వాళ్ళతోనే ముందుకు వెళ్ళగలగాలి .మేము ఎప్పుడూ ఇదే USPని నమ్ముతాం .మేము చిన్న వారిమే చిన్నగానే మందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం అంటారామె. ఇక్కడ అక్కడ అని తేడాలేకుండా ఎవరికైనా ఉపయోగం వుందంటే మేము కమీషన్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తాం. ఇంకా చెప్పాలంటే ఆమెకు క్రీడలన్నా ,జీవిత౦లో ఫ్యాషన్‌గా ఉండట౦ అన్నా మక్కువ. ఎస్ట్రాడా బయట ఆమె తల్లితో కలిసి నెస్ట్లేడ్ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు.అది చిక్మగలూరు కొండల్లో వుంది. పశ్చిమ కనుమలలో దట్టమైన గ్రీనరీ మధ్య కురింజి పూల వాసనలతో బాబా బుదంగిరి కొండల్లో హళ్లి బెర్రీ అనే ఒక కాఫీ ఎస్టేట్ వాళ్ల నివాసగృహం వుంది. చాలా మందికి ఇది నాదని తెలియదు. హళ్లీ బెర్రీని తల్లి,సోదరీమణులు కోసం ఒక రాబడిగా ప్రారంభించారామె .రెండు మూడు సంవత్సరాల ముందు కాఫీ తోట పూర్తిగా ఎండిపోయింది .అదే సమయంలో తేజిని తండ్రి మరణించాడు .అప్పటినుండి తేజిని తల్లితో కలిసి కాఫీ ఎస్టేట్లోనే ఉండేది. అది వాళ్ళకి 1900ఏడాది నుంచి వారసత్వంగా వస్తోంది. తేజిని యువరక్తంతో దేనికీ జంకకుండా సామాజిక స్పృహతో ఏదైనా మొదలు పెట్టాలనుకొన్నారు. హళ్లి బెర్రీని తన తల్లి రూపకల్పనగా నెలకొల్పారు. మేము ఎస్టేట్ కాఫీని కాఫీ షాప్స్ కు అమ్మడం మొదలుపెట్టాం. వాళ్ళు ఇష్టపడి చిన్న ప్యాక్స్ రూప౦లో కావాలని అడిగారు. మాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది.. మేము దీన్ని రిటైల్‌గా ఎందుకు మార్చకూడదు అని. ఆలోచన నుండి దాన్ని మామ్ –పాప్ గా చేశాం. అది తొందరలోనే ఒక స్థాయికి చేరుకొంది. ఇది ఒక లగ్జరీ కాఫీ బ్రాండ్‌గానే కాకుండా మంచి టేస్ట్ కోరుకొనే వినియోగదారులకు మార్కెట్లో దొరికే ఏకైక బ్రాండ్‌గా రూపొందించాను. రెయిన్‌ ఫారెస్ట్ అలయన్స్ ధ్రువీకరణ పొందిన బ్రాండ్లలో హళ్లి బెర్రీ కూడా ఒకటి. బ్రాండ్ పైన ఒక ఆకుపచ్చ కప్ప బొమ్మ వుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తించబడిన అతి తక్కువ బ్రాండ్లలో హల్లి బెర్రీ వుంది . పురుషాధిక్య౦ కలిగిన ఈ వ్యాపారంలో వారికి ధీటుగా మహిళల౦దరి సహాయంతో ఎదురునిలిచి తమ సత్తా చాటింది .ఇండస్ట్రీలో ఎదగాలనుకొనేవారు ప్యాషన్‌ కలిగి చాలెంజింగ్ ముందుకెళ్ళాలంటారామే.

ఎస్ట్రాడ, హళ్లిబెర్రీ ఫౌండర్ తేజిని

ఎస్ట్రాడ, హళ్లిబెర్రీ ఫౌండర్ తేజిని


అందరూ ఏదో విధంగా డబ్బు సంపాదిస్తారు కానీ మనలో ప్రత్యేకత లేకపోతే సరైన గుర్తింపు ఉండదు. ప్రత్యేకత ఉండబట్టే విశాలమైన CSR లో హల్లి బెర్రీ బాగం అయింది .ఎస్టేట్లో పనిచేసే కార్మికులకు, వారి పిల్లలకు విద్య ,ఆరోగ్యంతో పాటు న్యూట్రిషన్ ఫుడ్ అందుబాటులోకి తెచ్చింది తేజిని కరియప్ప . కార్మికులకు ఉపాధి కల్పించడం మాత్రమే కాదు సమాజంలో వారికి అన్నిరకాలుగా గుర్తింపబడాలి. ఇందులో బాగంగానే కార్మికుల పిల్లలకు 13 సంవత్సరాల వరకు ఉచిత విద్యనందిస్తోంది. మాది ఇంకా యంగ్ బ్రాండ్ ,మాకు చాలా గొప్ప డ్రీమ్స్ వున్నాయి. మేము ప్రజలకోసం, వారి ఉన్నతికోసం మరిన్ని కార్యక్రమాలు చేయాలంటారామె. మా పంట సామర్థ్యం రుతుపవనాలు మీద ఆధారపడి ఉంది. వాతావరణ౦ బాగాలేక పోతే మొత్తం పంట నష్టపోతాం . చిక్మంగళూరులో మేము 100 శాతం అరబిక మొక్కలను ఉత్పత్తి చేస్తాం . ఇవి రోబస్టా మొక్కల కంటే బలహీనమైనవి .హల్లి బెర్రీ ఎస్టేట్ ఇటువంటి మొక్కలను సమతుల్యంగా కాపాడగలదు.తోటలను కాపాడుకొని వృద్ది చేయాలంటే పంట రుణాలు అవసరం .ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వారు ఇంత పెట్టుబడి పెట్టి నేట్టుకరావడం కష్టం.అందుకే ప్రత్యామ్నంగా రాబడి కోసం హల్లి బెర్రీ తోటలో కాటేజెస్ నిర్మించాం .కరియప్ప మహిళలు గృహనిర్మాణంలో సిద్దహస్తులు .కుటీరాలు బ్యాంగ్లోరియన్ లోని పాఠశాలల మాదిరిగా వుండటం వారికి ఇష్టం .చూస్తానే ఆకర్షించగల విక్టోరియా డిజైన్లాంటిది . తక్కువలో ఎక్కువగా మాదగ్గర వున్న పెట్టుబడితో రెండు కుటీరాలను నిర్మించాం .అయితే వాటికి డిమాండ్ బాగా పెరిగిందని నవ్వుతూ చెప్తారామే .

అమ్మతో తేజిని కరియప్ప

అమ్మతో తేజిని కరియప్ప


చివరకు మొక్కలు పెంచే భూమిలో మరో రెండు కాటేజీలు నిర్మించారు . ఇంతవరకే చేయగలం .వాణిజ్యంగా చూడటం కంటే మొక్కలను పెంచడంలోనే ఆకర్షణ ఉందంటారు.తోటలను పెంచడం మా కుటంబంలో ఆనవాయితీగా వస్తోన్న కళ అంటారామె. మా తల్లి తండ్రులు ,తాత ముత్తాతలు కూడా పిల్లలకు చదువు చెప్పించడానికి శ్రద్ద చూపించారు .అయినా మేము కాఫీ తోటలు ఎలా పెంచుతారో చూస్తూ పెరిగాం . మేము చిన్న వయసులో చిక్మంగళూరు కొండల్లో మట్టితో ఆడుకొంటూ అక్కడ వాతావరణ పరిస్తితులలో కాఫీ పూలు సువాసనలు వెదజల్లుతూ పెరగడం చూశా౦.తోటలను పెంచడంలో ఎటాంటి అశ్రద్ద చూపకూడదు . ఈ అరణ్యంలో కొన్ని తీగలు ,చెట్లు ద్వారా తోటలుకు ముప్పు పొంచిఉంటు౦దంటారామే .కాఫీ అనేదే స్వతహాగా ఆత్మహత్య మొక్క. అలాంటప్పుడు మొక్కలకు అన్ని విధాల రక్షణ కల్పించి కాపాడాలి .మీకు తెలియదనుకొంటాను నేను కొంచెం అల్లరిపిల్లను .నేను ఒక పద్దతిలో డ్రెస్సులు వేసుకోను .నేను చూడటానికి ఒక కాలేజీ అమ్మాయిలా వుంటాను .చాలా మంది నన్ను అడుగుతుంటారు .మీరు నిజంగా ఈ వ్యాపారాన్ని నడుపుతున్నారా అని . నేను ఏ దారిలో వెళ్తున్నానో ,ఏం మాట్లాడుతున్నానో నాకు తెలుసు.చిన్నగా ఉన్నప్పుడే సవాళ్ళను అధిగమించాలి .నేను జెండర్ మూలంగా వయసు కారణంగా చాలా సమస్యలను ఎదుర్కొన్నాను .వాటిని దాటుకొని గమ్యం చేరినప్పుడే హ్యాపీ గా ఉండగలమని నవ్వుతూ ముగించారు.

హళ్లీ బెర్రి లోని ఎస్టేటు,చెక్మంగళూరు

హళ్లీ బెర్రి లోని ఎస్టేటు,చెక్మంగళూరు