రెస్టారెంట్లకు జనాలను మళ్లీ మళ్లీ రప్పించే 'కొంజెం డిస్కౌంట్'

వారాంతంలో ఫ్యామిలీతో కలిసి అలా బయటికెళ్లి మంచి రెస్టారెంట్స్‌లో భోంచెయ్యాలి... కానీ రేటు వాచిపోద్దేమో... ! ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ఏదైనా హోటల్ కెళ్లి పార్టీ చేసుకోవాలి.... ధర దిమ్మతిరిగి పోతుందేమో... ! బర్త్‌డే ఫంక్షన్, వివాహ వార్షికోత్సవం,పండగైనా, పబ్బమైనా ఇలా ఏదైనా మంచి రెస్టారెంట్లో కడుపార భోజనం చెయ్యాలని అందరూ అనుకుంటారు కానీ.... రేట్లు తలచుకుని వెనకడుగేస్తారు. ఇలాంటి వారికోసమే డిస్కౌంట్లతో అదరగొడుతోంది... కొంజెం డిస్కౌంట్. ఎందుకంటే ఎన్నిసార్లు ఆ రెస్టారెంట్‌కు వెళితే.... డిస్కౌంట్ కూడా అలా పెరిగిపోతూనే ఉంటుంది... భోజన ప్రియులకు నోరూరించే ఆ డిస్కౌంట్ వంటకమేంటో తినేద్దాం.. (చదివేద్దాం) పదండి.

రెస్టారెంట్లకు జనాలను మళ్లీ మళ్లీ రప్పించే 'కొంజెం డిస్కౌంట్'

Wednesday May 06, 2015,

4 min Read

image


సంతోషంగా గడపాలనుకోవడమే కాదు డిస్కౌంట్లు కూడా రెస్టారెంట్లలో అమ్మకాలను అమాంతం పెంచేస్తాయి. కానీ ఫ్లాట్ డిస్కౌంట్లు కస్టమర్లను మళ్లీమళ్లీ రప్పించలేవు. బిజినెస్ డిస్కౌంట్లు కొత్త కస్టమర్లను ఆకర్షించగలవు.. కానీ వారిని రెగ్యులర్ కస్టమర్లుగా మార్చడమెలాగన్నది ప్రశ్న. కొంజెం డిస్కౌంట్స్ ఇదే ప్రశ్నలోంచే ఆవిర్బవించింది.

image


అరుణ్ వెంకటేష్, వికాష్ కౌషిక్,అన్భరసాన్ అనే ముగ్గురు స్నేహితులు కొంజెం డిస్కౌంట్స్ ను స్టార్ట్ చేశారు. అరుణ్, వికాష్ ఇద్దరూ సిక్త్స్ గ్రేడ్ నుంచి క్లాస్ మేట్స్. 11th గ్రేడ్ లో సిద్దార్త్ వీరితో జతకలిశాడు. ఈ ముగ్గురు స్నేహితుల బంధం పదేళ్ల నుంచి సాగుతోంది. ఇంజనీరింగ్ ముగ్గురు వివిధ కాలేజీల్లో చదివినా.. ఖాళీ దొరికినప్పుడల్లా వారు తప్పకుండా కలుసుకునేది మాత్రం రెస్టారెంట్ లోనే. కొంజెం డిస్కౌంట్ ఐడియా కూడా రెస్టారెంట్ లోనే పుట్టింది.


భోజన ప్రియులు తమకు నచ్చిన రెస్టారెంట్లలో డిస్కౌంట్లు పొందుతూనే ఉంటారు. వారు ఎన్నిసార్లు ఆ రెస్టారెంట్‌కు వెళితే తగ్గింపు కూడా పెరిగిపోతూనే ఉంటుంది. భారీ డిస్కౌంట్లు ఎక్కడున్నాయని ప్రశ్నించే వారికి ఇలాంటి ఆఫర్లు ఆశ్చర్యం, అమితానందం కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు ఇలాంటి తగ్గింపులతో రెస్టారెంట్లకు రిపీటెడ్ కస్టమర్లు పెరుగుతారు.

వీరే కొంజెం డిస్కౌంట్ త్రయం. అరుణ్ వెంకటేష్, వికాశ్ కౌషిక్, సిద్ధార్థ్ అన్వరసన్

వీరే కొంజెం డిస్కౌంట్ త్రయం. అరుణ్ వెంకటేష్, వికాశ్ కౌషిక్, సిద్ధార్థ్ అన్వరసన్


వఫ్లీ సహవ్యవస్థాపకుడు,సీఈవో వికాష్ కౌషిక్ (కొంజెం డిస్కౌంట్‌ కూడా వీళ్లు స్థాపించిందే) ... ఈ కొత్త డిస్కౌంట్ గురించి ఇలా వివరిస్తున్నాడు... “మీరు డొమినోస్ పిజ్జాకు వెళ్లారనుకుందాం. వారు మాతో టై అప్ అయ్యారు. మీరు కనుక మా వెబ్ సైట్లో భోజనం తాలుకు డీల్ కొంటే.... రెస్టారెంట్ లో మీకు డిస్కౌంట్ లభిస్తుంది. ఉదాహరణకు మీరు 500 బిల్లు చేశారనుకుంటే.... దాంట్లో 20 శాతం మొదటి డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మా వెబ్ సైట్లో మీరు చెల్లించాల్సింది కేవలం 400 మాత్రమే. బిల్లు కట్టినట్టు మీ ఫోన్‌కు వచ్చే నిర్ధారిత SMS లేదా ఈమెయిల్ రెస్టారెంట్ యాజమాన్యానికి చూపిస్తే సరిపోతుంది. మీరు కోరుకున్న భోజనం లాగించేయొచ్చు. మరోవారం మళ్లీ అదే డొమినోస్ పిజ్జాకు వెళ్లాలనుకుంటే మరో డీల్ కొనాల్సిందే. అలాగే మా సైట్ కూడా మీరు మళ్లీ డొమినోస్ పిజ్జాకు వెళుతున్నారని అర్థం చేసుకుంటుంది. మీరు లాస్ట్ టైమ్ 20 శాతం డిస్కౌంట్ పొందితే ఈసారి 25 శాతం పొందుతారు. మళ్లీ వెళితే 30 శాతం, మరోసారి అక్కడికెళితే 35 శాతం...ఆఖరికి క్రెడిట్ పాయింట్లు పొందుతారు. అలా ప్రతిసారి పొందే పాయింట్లతో సోషల్ మీడియాలో మీ కొనుగోలును ఇతరులకు షేర్ చేసుకునే అవకాశం పొందుతారు. అలా మీరు క్రెడిట్ పాయింట్స్ పెంచుకుని డబ్బు పొదుపు చేసుకుంటారు”అని వివరించాడు... వికాష్ కౌషిక్.


కొంజెం డిస్కౌంట్ కు స్ఫూర్తి ఏంటి.?

ఘుమఘుమలాడే ఆహారం, రెస్టారెంట్ల కోసం వెతికేవారు..... వికాష్ తో పాటు భోజన ప్రియులైన అతని స్నేహితులు. “ మా ఫుడ్ కల్చర్ తో రెస్టారెంట్ వెండర్స్ తో రిలేషన్స్ పెరిగేవి. వారు తమ సమస్యలను కూడా మాతో పంచుకునేవారు. కస్టమర్లను తిరిగి రప్పించుకోవడమే.... 85 శాతం రెస్టారెంట్లది సమస్య. రిపీటెడ్ కస్టమర్లు వస్తే రెస్టారెంట్లకు లాభాలు పెరుగుతాయి. మా సంస్థ పుట్టుకకు అదే కారణం”


“ భోజన ప్రియులెవరికైనా వారి దారి వారికుంటుంది. ఎవరి అభిరుచులే వారివే. ఆహారం మానవజీవితంలో ఓ కీలక భాగం. మార్కెట్లో ఫుడ్ బిజినెస్ కు తిరుగులేదు. జీవితంలో ఎదుగుదలకు, ఆడుతూపాడుతూ పని చేసుకోవడానికి దీనికి మించిన రంగం లేదు. సాదాసీదాగా మొదలైన మా స్టార్టప్ ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసింది. ఈ స్థాయిలో సంతృప్తి పొందుతామని అసలు ఊహించలేదు. ప్రతిరోజు నిద్రలేచిన తర్వాత మాకొచ్చే ఆలోచన ఒక్కటే...అందరి జీవితాలు మెరుగవ్వాలని’’వివరించాడు...కౌషిక్.


వ్యాపార పద్దతి ఎలా ఉంటుంది.?

వీరు రెస్టారెంట్లతో ఒప్పందాలు చేసుకుంటారు. కొంజెం డిస్కౌంట్ వెబ్ సైట్లో అమ్మకాలు జరుగుతాయి. జనం ఎవరైనా వెబ్ సైట్లో ఆఫర్ కొంటే... మొత్తం అమౌంట్ వెబ్ సైట్లోనే చెల్లించాలి. డిస్కౌంట్ పోను మిగిలిన దాంట్లో కొంత మొత్తాన్ని తీసుకుని... మిగిలిన డబ్బులను రెస్టారెంట్ పార్ట్‌నర్స్ కు ట్రాన్స్‌ఫర్ చేస్తారు.


రెస్టారెంట్లకు కలిగే లాభం ఏంటంటే...

  • 1. కొత్త కస్టమర్లను ఆకర్షించవచ్చు.
  • 2. బ్రాండింగ్
  • 3. అన్నింటికంటే ముఖ్యమైనది ఒకసారి వచ్చిన కస్టమర్లు మళ్లీమళ్లీ రావడానికి ఆసక్తి చూపుతారు.

సాధారణ జనానికి చాలా లాభాలున్నాయి...

  • 1. భారీ డిస్కౌంట్లతో వారికి నచ్చిన రెస్టారెంట్ లో భోజనం చెయ్యడానికి ఒకే ఒక వేదిక...కొంజెం డిస్కౌంట్ వెబ్ సైట్.
  • 2. వివిధ రకాల ఆహార పదార్థాలు, రెస్టారెంట్లను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

రీఇమాజిన్ ఫుడ్ అనుభవం

రీఇమాజిన్ స్టార్టప్స్ సృజనాత్మక టెక్నాలజీతో దూసుకుపోతోంది. ఆహారం తయారీ, అమ్మకం, వాడకంలో మార్పులను గమనిస్తోంది. కేవలం మూడున్నర నెలల కాలంలోనే బార్సిలోనాలో ఇంక్యుబేషన్ స్థాపించారు. అంతేకాదు ప్రతి ఏడాది 20 స్టార్టప్ లను ప్రారంభించాలని భావిస్తున్నారు. కొంజెం డిస్కౌంట్ కూడా రీఇమాజిన్ ఫుడ్ స్టార్టపే.


యువర్ స్టోరీతో వికాష్ మాట్లాడుతూ “ ఏ కొత్త పారిశ్రామికవేత్త అయినా కంపెనీ నిర్మించాలంటే... నిపుణులు అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటాడు. ఇండస్ట్రీలో సంస్థకు పేరు, ఫీడ్ బ్యాక్ వస్తే గొప్ప విషయమే. కొంజెం డిస్కౌంట్ కూడా రీఇమాజిన్ ఫుడ్ తరహాలోనే దూసుకుపోతోంది. మేము ఈ స్టార్టప్ లో ముందుకు తీసుకెళుతున్న సమయంలోనే.... అనుభజ్ణులైన ఎంతోమంది మెంటార్ల నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాం. స్టార్టప్‌ను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి వ్యవస్థాపకులు, సలహాదారులు, వంటవారు, ఇంకా పెప్సీకో, డొమినోస్ పిజ్జా, డనోన్,గలియన్ బ్లాకా ఉద్యోగులతో పాటు టాప్ ఇండస్ట్రీ వాటాదారులతో మాట్లాడాం. వీరితో పాటు వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కైక్సా క్యాపిటల్ రిస్క్, డెలాయిట్ ఒజిల్‌వి వన్ కూడా ఎక్సలేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు.”


చెన్నైలోనే మా సంస్థ ఉందన్న విషయాన్ని వారు నమ్మలేదు. “ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ది సాధిస్తాం. కస్టమర్లకు మరింత చేరువవుతాం. అంతేకాదు దేశంలోని ఇతర నగరాల్లోని రెస్టారెంట్లకూ సహకరిస్తాం...రెగ్యులర్ కస్టమర్లను ఆకట్టుకోవడానికి” అన్నారు....వికాష్.


ప్రస్తుతం ఎలా ఉంది..?

దీని గురించి యువర్ స్టోరితో వికాష్ మాట్లాడుతూ “ నాలుగు రెస్టారెంట్లతో ఒప్పందాలు, 20 మంది కస్టమర్లతో మొదలుపెట్టాం. విశేషమేమిటంటే ఇందులో ఒక రెస్టారెంట్ మాతో ఎక్స్ క్లూజివ్ గా లావాదేవీల నడపాలనుకుంటోంది. గ్రూపన్ ఇద్దామంటోంది. కస్టమర్లను తిరిగి రప్పించడానికి చాలా రెస్టారెంట్లు మాతో చేయి కలపడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. గతేడాది కాలేజీలో ఫైనలియర్ చదువుతుండగానే మేము బేటా ప్రాజెక్ట్ కొనసాగించాం. రెస్టారెంట్లతో ఒఫ్పందాలు చేసుకుని 3613 లావాదేవీలు నడిపాం. వీటిలో 76 శాతం రిపీటెడ్ కస్టమర్లకు సంబంధించినవే.

ప్రస్తుతానికైతే కొంజెం డిస్కౌంట్ వెబ్ ఆధారిత వేదిక. దీనితో పాటు క్లోజర్ అనే చెన్నై బేస్డ్ స్టార్టప్ ను కూడా కవర్ చేస్తున్నాం. ఇది కూడా డిస్కౌంట్ స్పేస్ లోనే పని చేస్తుంది. ఒకటి వెబ్ సైట్లో పని చేస్తుంటే...కొత్తది మొబైల్ లో లావాదేవీలు చేస్తుంది...అంతే తేడా.

Visit the webiste: KonjamDiscount