ఎంతమందైనా రానీయండి.. లెక్కపెట్టి చెప్తాం!

క్రౌడ్ కౌంటింగ్ కి కేరాఫ్ ఈ ‘ఆశియోతో’

ఎంతమందైనా రానీయండి.. లెక్కపెట్టి చెప్తాం!

Tuesday November 24, 2015,

3 min Read

మక్కా మసీదులో రంజాన్ రోజు ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు? గోదావరి పుష్కరాలకు ఎంతమంది యాత్రికులొచ్చారు? ఇలాంటి లెక్కలు ఠక్కున చెప్పాలంటే కష్టమే. కచ్చితంగా గణాంకాలు చెప్పినా- దాదాపుగా ఇంత అని చెప్పగలం కానీ కరెక్టుగా అయితే చెప్పలేం. కానీ ఇలాంటి నంబర్లను కచ్చితంగా చెబుతామంటోంది ఆశియోతో సంస్థ.

“పాదముద్రాలతో లెక్కిస్తాం.” విరాజ్ రణదే

ఎంటర్ అయింది ఎంత మందో చెప్పాలంటే వారు ఎంటరయ్యే ద్వారం దగ్గరున్న పాద ముద్రలను సేకరిస్తే సరిపోతుందంట.

image


కుంభమేళాతో సక్సస్

కుంభమేళాలో క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నఅధికారులకు విరాజ్ అండ్ టీం అందించిన పరిష్కార మార్గం ఆశియోతో. ఎంతమంది వస్తారనేది లెక్కిస్తే వారికి సరిపడ వసతి కల్పించడం చాలా సింపుల్.

“మా టీం చూపించిన సొల్యూషన్, కుంభమేళా నిర్వహకులకు చాలా బాగా నచ్చింది” విరాజ్

కుంభమేళాకు క్రౌడ్ ఎంతమంది వచ్చారనే విషయాన్ని పొల్లు పోకుండా చెప్పగలిగారు. దీనికి ఉపయోగించిన టెక్నాలజీ కుంభమేళా నిర్వహణకు ఎంతగానో తోడ్పడింది . ఈ ప్రాజెక్ట్ సక్సెస్ తో చాలా ప్రాజెక్టులు వచ్చాయి. ప్రముఖ ఆలయాల్లో టికెట్ల బట్టి క్రౌడ్ ఎంత వచ్చారనేది చెబుతారు. కాని తిరునాళ్లు లాంటి చోట్ల అది సాధ్యపడని పని. కానీ అక్కడ కూడా ఎంతో సౌకర్యవంతంగా మందిని చెప్పగలిగే మార్గల్లో ఇది ఒకటిగా నిలిచింది.

image


‘ఆశియోతో’ పనితీరు

విజిటర్ లేదా జనం వచ్చే మార్గం దగ్గర సాధారణంగా సెక్యూరిటీ చెక్ పోస్టు ఉంటుంది. అక్కడే ఓ మ్యాట్ ఏర్పాటు చేస్తారు. మ్యాట్ కింద కంటికి కనపడకుండా ఓ ప్రత్యేక తివాచీని ఏర్పాటు చేస్తారు. దీనిపై పాదముద్రికలు పడితే వాటి సిగ్నల్స్ రిసీవర్ కు వస్తాయి. అక్కడి నుంచి మొబైల్ అప్లికేషన్ కి స్టాటిస్టిక్స్ అందుతాయి. అక్కడి నుంచి మనం క్లౌడ్ లో నంబర్స్ చెప్పేయొచ్చు. సాధారణంగా మొబైల్ అప్లికేషన్ లోనే సంఖ్య చెప్పేయొచ్చు. అయితే పూర్తి అనలిటికల్ డేటాను సిస్టమ్ కు కనెక్ట్ చేసుకుంటే మరింత సౌలభ్యంగా ఉంటుందని విరాజ్ చెప్పుకొచ్చారు. అయితే కొంత నంబర్ వరకే అంటూ దీనికి పరిమితులు లేవు. ఎంతమంది వచ్చినా లెక్కించడానికి సిద్ధంగా ఉంటుంది. రియల్ టైం డేటా దీని మరో అద్భుత ఫీచర్ గా చెప్పొచ్చు. నంబర్‌ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంది. సాధారణంగా కేమెరా ఉపయోగించి క్రౌడ్ ని లెక్కించే పద్దతి కంటే ఇది మరింత ఎఫిషియెంట్. వర్షాలు , ఇతర వాతావరణ పరిస్థితుల్లో కెమెరాలో డేటా సరిగ్గా లెక్కించకపోవచ్చు. కానీ దీనికి మాత్రం ఇలాంటి లిమిటేషన్స్ లేవు. మెటల్ డిటెక్టర్ ద్వరా జనాన్ని పంపిచాల్సిన అవసరం లేదు. ఎవరెలా వచ్చినా వారి దారి పొడువునా దీన్ని ఏర్పాటుచేయొచ్చు.

image


ఆశియోతో టీం

ఆశియోతో టీం విషయానికొస్తే విరాజ్ రణదే కోఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. నాసిక్ లో గ్రాడ్యూషన్ పూర్తి చేసిన ఆయన కంప్యూటర్ యాప్స్, వెబ్ సైట్స్ పై రీసెర్చ్‌ చేస్తుండగా తట్టిన ఆలోచన ఇది. ఆయనతో పాటు పరిక్షిత్ జాదవ్, హిరెన్ పంజ్వాణి, నిలయ్ కులకర్ని కో ఫౌండర్లుగా ఉన్నారు. వీరితో పాటు చాలా మంది ఫ్రీలాన్సర్స్ గా ఈ సంస్థలో పనిచేస్తున్నారు. షాపింగ్ మాల్స్ , ఇతర క్రౌడ్ ఏరియాలతో పనిచేస్తున్నప్పుడు అక్కడి సిబ్బందిని కూడా వీరి సర్వేలో ఉపయోగిస్తారు.

పోటీ దారులు

క్రౌడ్ కౌంటింగ్ లో ఆక్యూరేట్ రిజల్ట్స్ ఇచ్చే సంస్థలు చాలా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ప్రార్థనా సంస్థలు, మాల్స్ లలో వీటినే ఉపయోగిస్తున్నారు. వెల్ ఎస్టాబ్లిష్డ్ సంస్థలతో పోటీ ఎక్కువగానే ఉంది. అయితే అత్యంత తక్కువ ధరలో క్రౌడ్ కౌంటింగ్ అందించే మా సంస్థ మార్కెట్ పోటీని తట్టుకోగలదనే దీమా తమకుందంటున్నారు విరాజ్. యాప్ యూసేజీలో కొన్ని టెక్నికల్ విషయాలు అధిగమించాల్సి ఉంది. వచ్చేవారి సంఖ్యను చెబుతున్నారు అందులో చిన్నారులు ఇతర వ్యక్తుల సంఖ్యను కచ్చితంగా చెప్పే గణన కావాలి. అయితే దానిపై పనిచేస్తున్నామని విరాజ్ అంటున్నారు.

image


భవిష్యత్ ప్రణాళికలు

ఫండింగ్ కోసం ఎదురు చూస్తోన్న ఈ స్టార్టప్ , ఫండింగ్ వస్తే దేశ వ్యాప్తంగా సేవలను విస్తరించాలని చూస్తోంది. మహారాష్ట్ర అంతటా ఫ్రీలాన్సింగ్ టీంతో మేనేజ్ చేస్తోన్న సంస్థ మరింత మంది ఉద్యోగులను తీసుకొని టీం ని విస్తరించాలని చూస్తోంది. క్రౌడ్ మేనేజ్మెంట్ లో మరిన్ని మార్పులు తీసుకురావాలని చూస్తోంది. క్రౌడ్ లో పిల్లలు , ఇతర వ్యక్తులను గుర్తించ డానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడంపై పనిచేస్తున్నట్లు చెప్పారు విరాజ్