విశాఖపట్టణంలో పేటీఎం కార్పొరేట్ ఆఫీస్  

తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ చేసిన ఆన్ లైన్ పేమెంట్ ప్లాట్ ఫాం

1

ఆన్ లైన్ పేమెంట్ ప్లాట్ ఫాం పేటీఎం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించింది. విశాఖలో కార్పొరేట్ ఆఫీస్ ఏర్పాటు చేయబోతోంది. ఏపీ, తెలంగాణలోని మేజర్ సిటీలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణాల్లో కార్యకలాపాలు నిర్వహించడానికి లైన్ క్లియర్ చేసింది. ఈ మేరకు ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ అధికారికంగా ప్రకటించారు.

క్యాష్ లెస్ సొల్యూషన్స్ డిమాండ్ మేరకు పేటీఎం ఈ నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి పదివేల ఆఫ్ లైన్ ఏజెంట్లతో గ్రౌండ్ ప్రిపేర్ చేసింది. మొదటగా గ్రౌండ్ సేల్స్ యాక్టివేషన్ 12వేలు అనుకుంటోంది. తర్వాత ఆ సంఖ్యను 20వేలకు చేయాలని భావిస్తోంది. అన్నిరకాలుగా మార్కెట్ పొటెన్షియల్ ఉన్న వైజాగ్ తమకు అడ్వాంటేజ్ అవుతుందని పేటీఎం గట్టి నమ్మకంతో ఉంది.

పనిలో పనిగా 1శాతం ఉన్న బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఫీజుని కూడా మాఫీ చేస్తున్నట్టు ఫౌండర్ విజయ్‌ శేఖర్ శర్మ ప్రకటించారు. ఈ నిర్ణయం కొత్తగా వచ్చే కస్టమర్లను, వ్యాపారులను ఆకర్షిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. క్యాష్ లెస్ ఎకానమీకి మరింత ఊతమిస్తుందని చెప్పారు.

ఇప్పటికైతే పేటీఎం ప్లాట్ ఫాం ద్వారా 1.5 మిలియన్ వ్యాపారులు ఆఫ్ లైన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అందులో 17 శాతం కస్టమర్లు చిన్నచిన్న పట్టణాల నుంచే ఉన్నారు. 43 శాతం మూడవ, నాలుగవ శ్రేణి నగరాల నుంచి కనెక్టయ్యారు. మిగిలిన 40 పర్సెంట్ సబ్ స్క్రైబర్లు మెట్రో నగరాలనుంచి ఉన్నారు. ఈ లెక్కన 2016 చివరినాటికి 2 బిలియన్లు అవుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతానికి పేటీఎం వాలెట్ ద్వారా రోజుకి 5 మిలియన్ల ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. ఆ సంఖ్య మరింత పెరుగుతుందని సంస్థ భరోసా వ్యక్తం చేస్తోంది.

అన్నట్టు ఇటీవలే ఇండియా స్టాక్ సంస్థతో పేటీఎం పార్ట్‌ నర్‌ షిప్ కుదర్చుకుని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో ట్రాన్సాక్షన్లు మరింత సులభతరం కానున్నాయి.

Related Stories