పల్లె ఆవిష్కరణలకు వెలుగు బాటలు పరిచిన రిస్క్-2017  

ఔత్సాహిక రూరల్ ఆంట్రప్రెన్యూర్ల నుంచి అనూహ్య స్పందన

0

గ్రామాలకు వెలుగులు పరిచే మహత్తర కార్యానికి తిరుగులేని బాట పడింది. వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే చాలా భవిష్యత్ మీద మంచి నమ్మకం కలుగుతోంది. స్టార్టప్ అనే మాట పట్టణ ప్రాంతాలకు మాత్రమే చెందిందనీ.. ఇన్నోవేషన్స్ అన్నీ ఇంక్యుబేటర్లలోనే పొదుగుతారనే అపోహలకు తెరపడింది. మారుమూల పల్లెలోనూ కత్తిలాంటి ఐడియాలుంటాయని, పల్లెటూరి రచ్చబండ దగ్గర కూడాద మార్కెట్ ని శాసించే మరమనిషి రూపకల్పన జరుగుతుందని రుజువైంది. ఎన్ఐఆర్ డీపీఆర్ మొదటిసారిగా నిర్వహించి రూరల్ ఇన్నోవేటర్స్ స్టార్టప్ కాంక్లేవ్ 2017 జరిగిన తీరు చూస్తే.. అద్భుతమైన భవిష్యత్ కళ్లముందు కనిపించింది. 

ఈ కాంక్లేవ్ లో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా మొత్తం 200 ఎంట్రీలు వచ్చాయి. అందులో నుంచి 110 షార్ట్ లిస్టు చేశారు. మళ్లీ వాటి నుంచి 12 ఉత్తమమైన వాటిని అవార్డుకి ఎంపిక చేశారు. ఎగ్జిబిషన్ లో 69 ప్రోటోటైప్స్ స్టార్టప్స్ కొలువుదీరాయి. తెలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడు, కర్నాటక, ఉత్తరాఖండ్ నుంచి ఇన్నోవేటర్స్ వచ్చారు. సానిటేషన్, వాటర్, అగ్రికల్చర్ రిలేటెడ్ మీద ఇంట్రస్టింగ్ ప్రోటోటైప్స్ చాలామందిని ఆకర్షించాయి. ఆవిష్కర్తలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 6 అత్యుత్తమ స్టార్టప్‌ లను ఎంపిక చేసి లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకం ఇచ్చారు. 6 ఇన్నోవేట్ ఐడియాలను సెలెక్ట్ చేసి తలా రూ.50వేలు ఇచ్చారు. రిటైర్డ్ ఐఏఎస్ రమేశ్ కుమార్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.

రిస్క్-2017 విజేతలు వీరే

# వ్యవసాయం, దాని అనుబంధం- ఎగ్జాబిట్ సిస్టమ్ (స్టార్టప్ కేటగిరీ), డి. బాబురావు (ఇన్నోవేటర్ కేటగిరీ)

# గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీస్ - దివ్యాంగ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ (స్టార్టప్ కేటగిరీ), అమోల్ కోలీ (ఇన్నోవేటర్ కేటగిరీ)

# తాగునీరు, ఆరోగ్యం, పారిశుధ్యం- సెరెలా న్యూట్రిటెక్ (స్టార్టప్ కేటగిరీ), సౌజన్య (ఇన్నోవేటర్ కేటగిరీ)

# చెత్త నుంచి సంపద - అల్లిక (స్టార్టప్ కేటగిరీ), చంద్ర దాస్ (ఇన్నోవేటర్ కేటగిరి)

# సస్టెయినబుల్ హౌజింగ్ - పీపల్ ట్రీ (స్టార్టప్ కేటగిరీ), మహ్మద్ ఇస్మాయిల్ ఖాన్ (ఇన్నోవేటర్ కేటగిరీ)

# సస్టెయినబుల్ లైవ్లీ హుడ్స్ - అంబిక ఎకో గ్రీన్ బ్యాగ్స్ (స్టార్టప్ కేటగిరీ), తిరుపతిరావు (ఇన్నోవేటర్ కేటగిరీ)

ప్రస్తుతానికి ఎగ్జిబిట్ చేసినవన్నీ ముడి సరుకు ఫార్మాట్ లోనే ఉన్నాయి. వాటికి ఇంకా పూర్తి రూపం రావాల్సి వుంది. డిజైన్ ఇంప్రూవ్ చేయాలి. వేల్యూ అడిషన్ చేయాలి. అవన్నీ చేస్తే తప్పకుండా ప్రాక్టికల్ యూసేజ్ లోకి వస్తాయని ప్రతీ ఒక్కరూ నమ్ముతున్నారు. ఈవెంట్ తర్వాత ప్రొఫెషనల్ ఇన్ స్టిట్యూట్స్ తో ఎన్ఐఆర్ డీపీఆర్ టై-అప్ పెట్టుకుంటుంది. ఆంట్రప్రెన్యూర్లను మళ్లీ పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజీలో ఉన్నవాటిని సెలెక్ట్ చేసి, వాటికి ఫండింగ్ ఏజెన్సీల ముందు పిచింగ్ ఇప్పిస్తారు. కన్విస్వింగ్ ప్రెజెంటేషన్ ఇస్తే ఇన్వెస్టర్లు కచ్చితంగా కమిట్ అవుతారనే ఆశాభావంతో ఉన్నారు .

ఇన్నోవేటర్లు, యంగ్ ఆంట్రప్రెన్యూర్ల ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఏడాది మరిన్ని యాక్టివిటీస్ చేయాలనుందని అన్నారు ఎన్ఐఆర్ డీపీఆర్ డైరెక్టర్ జనరల్ డబ్ల్యూఆర్ రెడ్డి. వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే చాలా భవిష్యత్ మీద మంచి నమ్మకం కలుగుతోందన్నారు. గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగ పడతాయని డీజీ అభిప్రాయ పడ్డారు. 

Related Stories