మీడియా, వినోద రంగాల భవిష్యత్ బంగారమే..!!

మీడియా, వినోద రంగాల భవిష్యత్ బంగారమే..!!

Friday June 09, 2017,

1 min Read

మీడియా, ఎంటర్టయిన్మెంట్ సెక్టారుకు తిరుగులేదు. భవిష్యత్ బ్రహ్మండంగా కనిపిస్తోంది. 2017 నుంచి 2021 నాటికి 10.5 శాతం వృద్ధిరేటుతో, 2.91 లక్షల కోట్లకు మించి దూసుకుపోతుందని ప్రైస్ వాటర్ హౌజ్ కూపర్ (పీడబ్ల్యూసీ) అంచనా వేసింది. అయితే అంతర్జాతీయంగా మాత్రం అంత దూకుడు లేదని, వాటా శాతం తగ్గుతుందని తెలుస్తోంది.

image


టీవీ సబ్ స్క్రిప్షన్ రెవెన్యూ విషయానికొస్తే.. వచ్చే ఐదేళ్లనాటికి 11.6శాతం వృద్ధిరేటుతో రూ.90,713 కోట్లకు చేరుతుందని అంచనా. 2016లో రూ. 52,755 కోట్ల ఆదాయాన్ని టీవీ రంగం గడించింది.

భారతీయ సినిమా రంగం కూడా బ్రహ్మాండంగా కనిపిస్తోంది. గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర రూ. 10,957 కోట్లు వసూలైతే, 2021 నాటికి 10.4శాతం గ్రోథ్ రేటుతో రూ. 18,047 కోట్లకు రీచ్ అవుతుంది. దాంతోపాటు టికెట్ల రేటు కూడా సీఏజీఆర్ నివేదిక ప్రకారం 7.9శాతం పెరిగే అవకాశం ఉంది.

ఇక పత్రికా రంగానికి కూడా తిరుగులేదని తెలుస్తోంది. గత ఏడాది రూ.23,161 కోట్లుగా ఉన్న ఈ మార్కెట్ ఏరియా 2021 నాటికి రూ.24,447 కోట్లకు చేరుకుంటుందని అంచనా. పబ్లిషింగ్ సెక్టారు కూడా ఢోకాలేదు. 2016లో రూ.38,601 కోట్లుగా ఉన్న ఈ విభాగం 2021 నాటికి రూ.44,391 కోట్లకు విస్తరించే ఛాన్స్ వుంది.

ఇక ఇంటర్నెట్‌, వీడియో విభాగం గత ఏడాది రూ.560 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటే.. వచ్చే అయిదేళ్లలో ఏడాదికి 22.4 శాతం చొప్పున దాని ఆదాయం రూ.1,540 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. వీడియో ఆన్‌ డిమాండ్‌ సేవల సెక్టారు కూడా 2021 నాటికి 61 శాతానికి చేరుకుంటుందని అంచనా.