వెల్ఫీలు వచ్చాయి, మీరింకా సెల్ఫీల దగ్గరే ఆగిపోయారా ?

వీడియో సెల్ఫీలే ఈ వెల్ఫీలుయాప్‌లో దుమ్మురేపుతున్న వీడియోలుస్మార్ట్ ఫోన్‌లో వెల్ఫీల హల్చల్ఫేస్ బుక్ వాల్ పై నిండిపోతున్న వెల్ఫీ చిత్రాలు

వెల్ఫీలు వచ్చాయి, మీరింకా సెల్ఫీల దగ్గరే ఆగిపోయారా ?

Tuesday May 19, 2015,

4 min Read

2013 కు ఆ ఏడాది ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ విశిష్ట పదంగా ఎంపికైంది సెల్ఫీ. ఆటోగ్రాఫ్‌ను దాదాపు మరిపించగలగటంతో సెల్ఫీల పేరుప్రతిష్ఠలు 2014 లోనూ కొనసాగాయి. అయితే సోషల్ మీడియాలో ఇకముందు హడావిడి మొత్తం వీడియో సెల్ఫీలదేనంటారు అంకుర్ జోహార్, రామ్మోహన్ సుందరం. అందుకే వాళ్ళిద్దరూ ఉమ్మడిగా '' వెల్ఫీ '' స్థాపించారు.

వెల్ఫీ ఒక మొబైల్ యాప్. పేరుమోసిన డైలాగ్స్ వాడుకుంటూ వ్యక్తిగతమైన వీడియో సెల్ఫీలు తయారు చేసుకోవటానికి, వాటిని మెసేజ్‌లా పంపుకోవటానికి, సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మెసేజింగ్ అనుభూతిలోకి ఈ యాప్‌ని సమీకృతం చేస్తున్నారు. యాండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్ మీద ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీన్ని విండోస్‌పై కూడా పనిచేసేలా డిజైనింగ్ మీద దృష్టిపెట్టినట్టు చెబ్తున్నారు వ్యవస్థాపకులు.

image


మొబైల్ వాడకంలో రెండు అతిపెద్ద విప్లవాలుగా చెప్పుకునే సోషల్ మీడియా, మెసేజింగ్ అనే అంశాల జంక్షన్ లో స్థిరపడాలనుకుంటున్నది వెల్ఫీ. వినియోగదారులు ఎలాంటి సమస్యలూ తలెత్తని విధంగా వాళ్ళకిష్టమైన పాటలకూ, డైలాగులకూ తగినట్టు అభినయించటానికి ఈ ప్లాట్‌ఫామ్ సాయపడేలా చేయాలన్నదే దీని వ్యవస్థాపకుల లక్ష్యం. “ మా కంటెంట్ అంతా 10 సెకెన్ల లోపే ఉంటుంది. వ్యాపార చట్టాన్ని పూర్తిగా గౌరవిస్తుంది ” అంటారు రామ్. సంఖ్యాపరంగా యాప్ బాగా ఎదుగుతోంది. ప్రారంభించిన 15 రోజుల్లోనే సగటున రోజుకు 10,000 కు పైగా డౌన్‌లోడ్స్ నమోదు కావటం సామాన్యమైన విషయం కాదు. పైగా యాండ్రాయిడ్ లో మొదటి మూడు యాప్స్ లో ఇది కూడ ఒకటిగా నమోదవుతూ వస్తోంది. వాడకందార్లు వాళ్ల సొంత ఆడియో జతచేసి అప్ లోడ్ చేసి వాట్సాప్, ఫేస్ బుక్ మెసెంజర్, హైక్, లైన్, వియ్ చాట్, జియోచాట్ లాంటి ప్లాట్ ఫామ్స్ ద్వారా షేర్ చేయడం వల్ల ఇది సాధ్యమవుతోంది. భారత్, బ్రెజిల్, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్, మలేసియా, వియత్నాం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, లెబనాన్, టర్కీ సహా దాదాపు 150 దేశాల్లో వెల్ఫీకి ఆదరణ లభిస్తోంది. ఆయా దేశాల్లో అక్కడి భాషలకు అనుగుణంగా కంటెంట్ ను ఈ యాప్ వర్గీకరించింది.

అంకుష్ జోహార్ ,రామ్ మోహన్  సుందరం

అంకుష్ జోహార్ ,రామ్ మోహన్ సుందరం


వెల్ఫీ వెనుక ఆ ఇద్దరూ

అంకుశ్ జోహార్, రామ్మోహన్ సుందరం ఇద్దరూ వెల్ఫీ వ్యవస్థాపకులు. వాళ్ళ బృందంలో ఆరుగురున్నారిప్పుడు. అంకుశ్ బ్రిటిష్ పౌరుడు. అక్కడి జె లాయిడ్స్ గ్రూప్ నడుపుతున్నారు. మొబైల్ రీసెర్చ్ అండ్ అనలిటిక్స్‌తో బాటు అనేక వినియోగదారుల సాఫ్ట్‌వేర్స్ రూపొందించిన విజేత అంకుశ్. ఇప్పుడు ఆ సంస్థని టైమ్స్ గ్రూప్ కొనుగోలు చేసింది. రామ్ అంతకుముందు ప్లాట్‌ఫామ్ ప్లే, నెట్వర్క్ ప్లే అనే రెండు సంస్థలు ప్రారంభించి విజయవంతమయ్యాక బయటికొచ్చి ఇబిబో యాడ్స్ సీఈవోగా పనిచేశారు.ఇప్పుడీ ఆరుగురు సభ్యుల బృందం వెల్ఫీ పనితీరుమీద, వాడకం దారుల అనుభూతి మీద, వాళ్ళను కాపాడుకుంటూ మరింతగా ఆకట్టుకునే విషయం మీద విస్తృతంగా పనిచేస్తోంది. మొత్తంగా వెల్ఫీని మరింతగా మెరుగుపరచటం మీద దృష్టి సారించింది. పదే పదే కొత్త సంస్థలు పెడుతూ విజయానందాన్ని పొందుతున్న ఈ ఇద్దరు వ్యవస్థాపకులూ తాము తీసుకున్న నిర్ణయం ఆషామాషీది కాదని, చేపట్టిన పని చాలా పెద్దదని నమ్మారు. అందుకే దీన్ని అతిపెద్ద సోషల్, మెసేజింగ్, ఆడియెన్స్ ప్లాట్ ఫామ్ గా తీర్చిదిద్దటానికి కంకణం కట్టుకున్నారు.

ఆదాయం సంగతేంటి ?

ఈ యాప్‌ని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ప్రకటనలు, ప్రచారాలు, వ్యాపార భాగస్వామ్యాల ద్వారా ఆదాయం సంపాదించుకోవటం స్థాపకుల లక్ష్యం. అదే సమయంలో వివిధ సంస్థలతో భాగస్వామ్యాలకు, అవగాహనలకు సిద్ధమవుతున్నారు. 

ఇవీ వాటిలో ప్రధానమైనవి:

-పెట్టుబడి మీద ఆదాయం పెంచుకోవటానికి సోషల్ మీడియా మీద ఖర్చుపెట్టే వినియోగ వస్తువుల బ్రాండ్లు.

-విడుదలకు ముందూ, తరువాతా దాని సమాచారాన్ని ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు అందేలా చేయటంలో చురుకైన పాత్ర పోషించ గల పాత్ర ద్వారా సినిమాను ఆదాయ వనరుగా మార్చుకోవటం.

-మొబైల్ హాండ్ సెట్ తయారీదారులను ఆకర్షించి ఈ యాప్ ను నేరుగా మొబైల్ తయారీ సమయంలోనే అందులో ఎంబెడ్ చేయటం.

-మెసేజింగ్ కీ బోర్డ్ లో ఆయా ప్రాంతాలకు తగినట్టుగా ఎంబెడ్ చేస్తూ ఆడియో, వీడియో ఎమోషన్ ఐకాన్స్ జోడించటం ద్వారా మెసేజింగ్ ప్లాట్ ఫామ్స్ ను చేరుకోవటం

-కార్యక్రమాలను ప్రచారం చేయటానికి, ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి సిద్ధంగా ఉండే టీవీ చానల్స్ కోసం ఈ యాప్ ని వాడటం


వెల్ఫీ ని డబ్ స్మాష్ తో పోల్చటానికి వీలున్నప్పటికీ వెల్ఫీ నిర్వాహకులు వాడకందారులకు అదనపు ఫీచర్లు అందించటం ద్వారా తమ ప్రత్యేకత చాటుకోవాలనుకుంటున్నారు. ఒక వీడియోను చూడటం కాసేపు ఆపి మళ్ళీ చూడాలనుకున్నప్పుడు అంతకుముందు ఆపిన చోటు నుంచే చూడగలిగే అవకాశం వెల్ఫీలో ఉంది. మరింత మెరుగైన సేవలందించటానికి స్థానిక మార్కెట్ పట్ల అవగాహన పెంచుకొని అందుకు అనుగుణంగా నడుచుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి కంటెంట్ మొత్తం వాడకందారులు తయారు చేసేదే కాబట్టి వాళ్ళు వేరువేరు ప్రజలు అప్ లోడ్ చేసిన భిన్నమైన ట్రాక్స్ చూసే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కంటెంట్ ను భద్రపరచి వాడకందారులకు మెరుగైన అనుభూతినివ్వటం వెల్ఫీ లక్ష్యంగా పెట్టుకుంది. వీడియో సెల్ఫీల రంగంలో ఉన్న ఇతర స్టార్టప్స్ లో ఫ్రాంక్లీ మి కూడా ఉంది, అది ప్రజలను సెలెబ్రిటీలతో వీడియోలద్వారా కలుపుతుంది. 

image


రెండు వారాల్లో వెల్ఫీ, అక్షయ్ కుమార్ నటించిన గబ్బర్ ఈజ్ బాక్ కలసి కట్టుగా గబ్బర్ వెల్ఫీ పోటీ నిర్వహించాయి. ఈ సినిమా డైలాగ్స్ కి సొంత వీడియోలు జోడించి వినియోగదారులు పోటీకి పంపారు. దీంతో సినిమా ప్రచారం జోరుగా సాగింది. విజేతలు అక్షయ్ కుమార్ ను కలుసుకోవటం, కొంతమంది టికెట్లు గెలుచుకోవటం, మరికొందరు సినిమాలో వాడిన కొన్ని వస్తువులు గెలుచుకోవటం చూశాం.ఈ స్టార్టప్ ఎదుగుదలకు దోహదం చేసేలా మరో 12 సినిమాలు కూడా ఇదే తరహ భాగస్వామ్యం కోసం బారులు తీరాయి. బాలీవుడ్ నటీనటులు ఈ యాప్ ను సొంతం చేసుకుంటున్నారు. తద్వారా ఈ వేదిక అభివృద్ధికి దోహదం చేస్తున్నారు. ఫేస్ బుక్ లో కోటీ 40 లక్షలమంది, ట్విట్టర్ లో 80 లక్షలమంది అభిమానులున్న అక్షయ్ కుమార్ గబ్బర్ వెల్ఫీ పోటీ గురించి రెండు సార్లు పోస్ట్ చేశారు.

భవిష్యత్ ప్రణాళికలు

మోబి ఫస్ట్ మీడియా సహ వ్యవస్థాపకుడు అంకుశ్ జోహార్ ఇలా అంటున్నారు :

“ దీర్ఘకాలంలో దీన్ని మరింతగా మెరుగుపరచే కొద్దీ ఒక సోషల్క్ మీడియా నెట్ వర్క్ ను అభివృద్ధి చేయాలన్నది మా లక్ష్యం. అది కదులుతున్న దిశ, వేగం చూస్తుంటే కచ్చితంగా మా అంచనాలకు అనుగుణంగానే ముందడుగు వేస్తోంది. మా వరకు మేం ఆలోచించేదేమంటే వినియోగదారులే వీడియో తయారీలో శక్తిమంతులు కావాలి. ఒక వేదికగా మేం నాణేనికి రెండు వైపులా ఆలోచిస్తాం.“ మొదటిసారిగా నేరుగా వినియోగదారుణ్ణి ముఖాముఖి ఎదుర్కునే వ్యాపారంలో దిగిన రామ్ తనకిది కళ్ళు తెరపించినట్టయిందంటారు. ఇంతకుముందు దాదాపు ఏడేళ్లపాటు అడ్వర్టయిజింగ్ రంగంలో పనిచేసి అనుభవం ఆయనది.

“ మొదట మేం ఈ అవకాశాన్ని పరిశీలించినప్పుడు చేతిలోనే విజయం సిద్ధంగా ఉన్నదని మాకు తెలుసు. అయినప్పటికీ మా ఉత్పత్తిని మరింతగా మెరుగుపరచటం మీద దృష్టిపెట్టాం. మా యాప్ వాడుతూ ఉంటే మీరది చూడగలరు. పాజ్, రికార్డ్, సౌండ్ షేర్ లాంటి ఫీచర్లు జోడించాం. భవిష్యత్ లో మరింత మెరుగైన ఫీచర్లను మీరు గమనిస్తారు.” ఈ స్టార్టప్ ప్రస్తుతానికి వ్యవస్థాపకుల సొంత నిధులతో మొదలైనప్పటికీ, వచ్చే ఆరు నెలలకాలంలో నిధులు సమకూర్చుకునే ఆలోచనలో ఉన్నారు.