ఈ 'కృషి'తో నాస్తి దుర్భిక్షం

- పొలం నుంచి నేరుగా వినియోగదారునికి- సేంద్రీయ వ్యవసాయంలో రైతు నేస్తం క్రిషి నేచురల్స్ - రసాయన ఎరువుల నష్టానికి విరుగుడు- భూసార రక్షణకు తోడ్పాటు- రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు- వినియోగదారులకు తక్కువ ఖర్చులోనే తాజా కూరగాయలుThis story is a part of Portraits of Purpose series sponsored by DBS Bank. ... read more on social.yourstory.com

0

కేతన్ పర్మర్‌కు చిన్ననాటినుంచే వ్యవసాయంపై మక్కువ ఏర్పడింది. ఇంట్లో తరచూ వినబడే సాగు పద్ధతులు, మేలు రకం విత్తనాలు, భూసారం లాంటి విషయాలు చిన్నవాడైన కేతన్ పర్మర్‌ను ఆకట్టుకునేవి. అలాగే పంటల్లో వాడే క్రిమిసంహరకాలు అటు పంటలనే కాకుండా, రైతుల ఆరోగ్యాలను ఎలా దెబ్బతీస్తున్నాయో అతనికి అపుడే తెలిసింది.

కేతన్ పర్మర్, కృషి నేచురల్స్
కేతన్ పర్మర్, కృషి నేచురల్స్
''రైతులు పదే పదే రోగాల బారిన పడుతూ ఉండేవారు. కేన్సర్‌తో పాటు అనేకానేక రోగాలకు చికిత్స కోసం రైతులు పంజాబ్ నుండి అహమ్మదాబాద్ వెళ్లాల్సి వచ్చేది. మారుమూల ప్రాంత రైతులు కూడా రసాయన తరహా వ్యవసాయానికి అలవాటు పడడం నేను గుర్తించాను''.  

డ్రీమ్ ప్రాజెక్టుకు ఈ ఆవేదనే మూలం

ఇలాంటివి చూసి తన కుటుంబసభ్యులు ఆవేదన చెందడం కేతన్‌కి బాగా గుర్తుంది. చిన్నతనంలో చూసిన సంఘటనలు విన్న సంభాషణల కేతన్‌లో కొత్త ఆలోచనను రేకెత్తించాయి. గుజరాత్‌లో దహద్ అనే చిన్న గ్రామం నుంచి వచ్చిన కేతన్ భూమిని, రసాయనాలు వాడడం వల్ల జరుగుతున్న నష్టాన్ని అర్ధం చేసుకున్నాడు. ఎందుకంటే అప్పట్లోనే కేతన్ తాతగారు సేంద్రీయ వ్వవసాయం చేసేవారు. అధిక దిగుబడి ఆశతోనే రైతులు క్రిమిసంహరకాలు వాడుతున్నారని అతనికి తెలుసు. దిగుబడి కోసం క్రిమిసంహారకాలు వాడడం అనేది వేలం వెర్రిగా మారి గ్రామీణ ప్రాంతాల్లో సైతం మూలమూలల్లోకి చొచ్చుకుపోయిందని అర్థమైంది. మెత్తం వ్యవసాయ విధానమే మారిపొయిందని కేతన్ అర్థంచేసుకున్నారు. ఇవన్నీ చూసిన కేతన్ పరిష్కారమార్గంగా 2011 లో క్రిషి నేచురల్స్ అనే సంస్ధ ప్రారంభించాడు. సేంద్రీయ వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన కల్పించడంతోపాటు, ఆ వినియోగదారులను అందించడం ఈ సంస్ధ ప్రధానలక్ష్యం. ఇపుడది కేతన్ జీవితాశయం కూడా.

కృషి నేచురల్స్, ఇదే అతని డ్రీమ్ ప్రాజెక్ట్
కృషి నేచురల్స్, ఇదే అతని డ్రీమ్ ప్రాజెక్ట్

హెచ్.ఆర్. మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ అయిన కేతన్‌కి గ్రామీణ ఉపాధికల్పన పట్ల చాలా ఆసక్తి. తక్కువ వేతనం అయినప్పటికి గిరిజన మహిళల స్ధితిగతుల పై పనిచేసే ఓ స్వచ్చంధ సంస్ధలో కొంత కాలం పనిచేసాడు. తర్వాత టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(TISS)లో సోషల్ ఆంట్రప్రెన్యూర్ కోర్సులో చేరాడు. అది కేతన్ జీవితంలో కీలక మలుపునకు కారణమైంది. టిస్ అతని ఆలోచనలు కొత్త పుంతలు తొక్కించింది. సేంద్రియ వ్యవసాయ విధానంతో పాటు, దేశవాళి గో సంపదను కూడా పరిరక్షించాలని కేతన్ భావించాడు. కోర్సులో భాగంగా ఆచరణలో చూపించే ప్రాజెక్ట్ ఒకటి చేయాలి,అది కూడా తన స్వంత రాష్ట్రంలో చేయాలని నిర్ణయించుకున్నారు. సేంద్రియవ్యవసాయం గురించి అవగాహన కలిగించడానికి రైతుల బృందాలు ఏర్పాటు చేసారు. 3 నెలల్లో వారి సంఖ్య 50కి చేరింది. కేతన్ మరింత ముందుకు వెళ్లడానికి తోడ్పడింది. సేంద్రియవ్యవసాయం పట్ల జీవితాంతం తన తాత చూపిన నిబద్ధతే తనకు స్పూర్తి అని చెపుతారు కేతన్.

చివరికి తన పైలట్ ప్రాజెక్టే కేతన్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా మారింది. ఇవాళ క్రిషి నేచురల్స్‌లో 12 మంది సభ్యులు వున్నారు. రైతులకు తమ ఉత్పత్తుల పట్ల అవగాహన కలిగించడంలో, వినియోగదారులకు చేర్చడంలో ఈ బృంద సభ్యులు నిరంతరం కృషి చేస్తుంటారు.

ఇందలో రెండు విభాగాలు వున్నాయి.---

  • మొదటిది -హర్యాలి టోప్లీ---సేంద్రియ వ్యవసాయం.
  • రెండోది-గిరిజ్--దేశవాళి గో పెంపకం, అభివృధ్ధి.

రైతుల పొలం నుంచి వినియోగదారుడి కంచంలోకి నేరుగా సరుకులు
రైతుల పొలం నుంచి వినియోగదారుడి కంచంలోకి నేరుగా సరుకులు

దాదాపు 70,80 మంది రైతులు హర్యాలి టోప్లి కింద సేంద్రియవ్యవసాయం చేస్తుండగా సుమారు 400 కుటుంబాలు ఆ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నాయి. క్రిషి నేచురల్స్ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి రైతుకు నిరంతరం సలహాలిస్తూ సాంకేతిక సహయం కూడా ఉచితంగా అందిస్తోంది. ఆసక్తి ఉన్న రైతులు సహకార బృందగా ఏర్పడి సేంద్రియ వ్యవసాయ విధానం గురించి సుశిక్షితులైన నాలెడ్జ్ పార్ట్‌నర్స్ ద్వారా అవగాహన పెంచుకుంటారు. ఇదంతా ఉచితమే. క్రిషి నేచురల్స్ సంస్థ ద్వారా ఉచితంగా శిక్షణ పొందిన సేంద్రియ సాగు రైతులే నాలెడ్జ్ పార్ట్‌నర్స్‌గా మారి తోటి రైతులకు సహకార పద్ధతిలో తిరిగి ఉచితంగా తమ జ్ఞానాన్ని పంచుతారన్నమాట.

అంతే కాదు.ఇందులో నమోదయియిన రైతుల ఉత్పత్తులకు క్రిషి నేచురల్స్ నమ్మకమైన మార్కెట్ కలుగజేయడంతో పాటు వినియోగదారులకు అత్యంత తాజా కూరగాయలను అందజేయగలుగుతోంది.నేరుగా పొలంనుంచి వినియోగదారునికి చేర్చడం వల్ల రైతులకు ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 30 శాతంనుంచి 60 శాతం దక్కుతుంది.అంటే కిలోకు ఎంత లేదన్నా రూ.6 వరకూ ఎక్కువగా లభిస్తుంది. దాంతో పాటే రైతులకు ప్లాస్టిక్ క్రేట్స్, ఆధునిక త్రాసులు వంటివి కూడా కృషి అందజేస్తున్నది. కూరగాయలను పక్కాగా తూచి పద్ధతిగా ప్యాక్ చేసి వినియోగదారునికి చేర్చడంలో కూడా సాయపడుతోంది.

ఇక గిరిజ్ విభాగం కింద దేశవాలీ గోవులను,ఎద్దులను పరిరక్షిస్తారు. వినియోగదారులకు ఎ2 వైరైటీ పాలు సరఫరా చేస్తారు. దేశవాలీ ఆవు పాలనే ఎ2గా వ్యవహరిస్తారు. ఇలాంటి ఎ2 పాలను సరఫరా చేస్తున్నది కేతన్ పర్మర్ ఒక్కరే. ప్రతి 12 దేశీ ఆవులకు గాను రైతుకు అధిక మొత్తం చెల్లిస్తారు. డిబిఎస్ బ్యాంక్ సహకారంతో సాగుతున్న ఈ ప్రాజెక్టు పాపులారిటీ కోసం ఎలాంటి ప్రచార సాధనాలను ఆశ్రయించలేదు. కేవలం ఆ నోటా ఈ నోటా పాకిపోవడం ద్వారానే కేతన్ ఈ ఘనత సాధించారు. సూరత్, అహ్మదాబాద్, రాజ్‌కోట్ లాంటి పెద్ద మార్కెట్లకు విస్తరించాలని కేతన్ ఆశిస్తున్నారు. ఆరోగ్యకరమైన వ్యవసాయపద్ధతులను ప్రమోట్ చేయడమే కాకుండా రైతుల జీవనశైలిని కూడా మెరుగుపర్చాలని కేతన్ ఆశిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో పదివేల రైతు కుటుంబాలకు తన సేవలు అందించాలని, రెండు, మూడు లక్షల దేశీ ఆవులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

సేంద్రీయ వ్యవసాయమే సుస్థిరమైన వ్యవసాయానికి దారిచూపుతుందని, వచ్చే పదేళ్లలో చాలామంది రైతులు, వినియోగదారులు ఈ విషయంలో చైతన్యవంతులవుతారని కేతన్ నమ్ముతున్నారు.