బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా ఆసరా పింఛన్లు

డిజిటల్ లిటరసీపై తెలంగాణ ప్రభుత్వం క్యాంపెయిన్

బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా ఆసరా పింఛన్లు

Sunday December 04, 2016,

2 min Read

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన అనంతరం కరెన్సీ కొరత ఏర్పడిన నేపధ్యంలో ప్రజలందరిని క్యాష్ లెస్ పేమెoట్స్ వైపు మరలేలా డిజిటల్ లిటరసి క్యాంపెయిన్లను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు డిమోనిటైజేషన్ పై ఆర్థిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులతో కలసి సీఎస్ ప్రదీప్ చంద్ర జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన నేపధ్యంలో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి సరైన వ్యూహం రూపొందిoచుకొని, అన్ని శాఖలు సమన్వయంతో ప్రజలను డిజిటల్ ట్రాన్సాక్షన్ల వైపు మళ్లేలా చూడాలని సీఎస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి సీఎం కేసీఆర్ మద్దతు ప్రకటించారని, కార్మిక శాఖ ద్వారా కార్మికులకు అక్కౌంట్స్ తెరవడం, వ్యవసాయ మార్కెట్ల ద్వారా రైతులకు బ్యాంకు అక్కౌంట్లకు చెల్లింపులు చేయడం ప్రారంభిoచిoదన్నారు. డిజిటల్ లిటరసి ప్రజల్లోకి వెళ్లేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జన్ ధన్ ఖాతాలు ఉన్న వారందరికి రూ పే కార్డులు అందచేయడoతో పాటు వాటిని వినియోగించేలా చూడాలని ఆయన కోరారు. ఇప్పటికే ఉండి వాడకంలో లేని వాటిని వాడుకలోకి వచ్చేలా చూడాలని సూచించారు. ప్రతి ఖాతాను ఆధార్ తో అనుసంధానం చేయాలని సీఎస్ ఆదేశించారు. ఆర్బీఐ నుంచి వచ్చే కరెన్సీని గ్రామీణ ప్రాంతాలకు అందేలా చూస్తామని సీఎస్ ప్రదీప్ చంద్ర అన్నారు.

ఆన్ లైన్ లావాదేవీలపై అవగాహన కోసం కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో త్వరలోనే ఓ సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రజల్లో డిజిటల్ లిటరసీపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ద్వారా ఓరియెoటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకర్లు, సంబంధిత శాఖలు పాల్గొంటాయి. అనంతరం ప్రతీ బ్యాంకు వ్యాపారస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి e- pos మెషిన్స్, మొబైల్, Pay tm , EKYC బడ్డి తదితర వాటిపై అవగాహన కల్పించాలని సీఎస్ కోరారు.

image


ఆసరా పించన్లకు సంబంధించి తెలంగాణలో 4.2 లక్షల మందికి నగదు రూపంలో పంపిణి జరుగుతోంది. వీటిని బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా అందేలా చూడాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు. డిసెంబర్ నెలలో పోస్టాఫీస్ ల ద్వారా ఆసరా పించన్ల పంపిణిని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ప్రదీప్ చంద్ర కలెక్టర్లను కోరారు. ఇప్పటికే ఆసరా పించన్ల కు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన తెలిపారు. ఆసరా పించన్ల పంపిణిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చుడాలని సూచించారు. డిసెంబర్ 2 నుండి NHAI టాక్స్ వసూలు చేస్తున్న నేపధ్యంలో జాతీయ రహదారుల పై సమస్యాత్మక ప్రాంతాల్లో తగిన పోలీసు సిబ్బందిని కేటాయించాలని సీఎస్ ఆదేశించారు.

రాష్ట్రంలో 81.71 లక్షల జన్ ధన్ ఖాతాలున్నాయి. 70 లక్షల దాకా రూ పే కార్డులు ఇచ్చారు. ఇంకా 12 లక్షల దాకా రూ పే కార్డులు ఇవ్వాల్సి వుంది. ప్రతి రూపే కార్డు ఆక్టివేట్ అయ్యేలా చూడాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. అన్ని అక్కౌంట్స్ ఆధార్ సీడింగ్ జరిగేలా చూడటమే కాకుండా. . ప్రజల్లో ఉన్న ఇబ్బందులను, అపోహలను తొలగిoచాలని ఆయన కోరారు.

వ్యాపారస్తులు, ప్రజలు, వినియోగదారులకు ఆన్ లైన్ లావాదేవీలపై అవగాహన కల్పించాలని, వారి సందేహాలు తీర్చడానికి ఈ నెల 7, 8 తేదిలలో జిల్లా కేంద్రాలలో ఓరిoయేoటేషన్ కార్యక్రమాలను నిర్వహించాలని ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ కలెక్టర్లను కోరారు. మండల కేంద్రాలలో మీ సేవ సిబ్బంది ద్వారా శిక్షణ ఇస్తారని, అనంతరం గ్రామ పంచాయతి లలో TITA వాలంటీర్ల ద్వారా శిక్షణ ఇస్తామని అన్నారు.