ఏమండోయ్.. ఇది విన్నారా..?

0
మీ స్మార్ట్ ఫోన్ లో సరదాగా గేమ్ ఆడుతూ చైనీస్ నేర్చుకుంటారా? అదెలా అనుకుంటున్నారా. అది సాధ్యమే. మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ అయినా, విండోస్ అయినా, ఐఓఎస్ అయినా... ఓ కొత్త అప్లికేషన్ మీకు బేసిక్ చైనీస్ నేర్పిస్తుంది. అదే ఇహువాయు. గేమ్ బేస్డ్ చైనీస్ లాంగ్వేజ్ టీచింగ్ సాఫ్ట్ వేర్ ఇది. చైనీస్ లో సాధారణంగా ఉపయోగించే పదాలు, మాటలు ఇందులో ఉంటాయి. సుయూఫీ డెవలప్ చేసిన ఈ అఫ్లికేషన్ ను ఇంగ్లీష్ మాట్లాడే దేశాలైన అమెరికా, సింగపూర్, హాంగ్ కాంగ్, ఫిలిప్పీన్స్, ఇండియాల్లో లాంఛ్ చేశారు. అంతే కాదు... చైనాలో ఇప్పుడిప్పుడే చైనీస్ నేర్చుకుంటున్నవాళ్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు.

"ప్రతీ ఒక్కరూ వారి చిన్నచిన్న అవసరాల కోసం మొబైల్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. అందుకే చైనీస్ నేర్చుకోవడానికి ఉపయోగపడే యాప్ ను వారికోసం తయారుచేయాలనుకున్నా. స్మార్ట్ ఫోన్లల్లో గేమ్స్ ఆడుతూ చాలా సమయం వృథా చేస్తుంటాం. అయితే ఈ అప్లికేషన్ వినోదాన్ని అందించడంతో పాటు చైనీస్ నేర్పిస్తుంది- సుయూఫీ

రోజువారీ జీవితంలో, ప్రయాణంలో, విచారణ కౌంటర్ల దగ్గర, వాతావరణం, తేదీలు, షాపింగ్, గ్రీటింగ్స్, కుటుంబంలో మాట్లాడుకునే మాటలు, కెరీర్, వ్యాపారానికి సంబంధించిన పదాలన్నీ ఈ యాప్ లో ఉంటాయి. ఈ యాప్ తయారు చేయడానికి ఐదేళ్లు పట్టింది. ఇప్పుడు దీన్ని ఆండ్రాయిడ్, గూగుల్ స్టోర్, యాప్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. చైనీస్ లో రాసిన అక్షరాలను గుర్తించడానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. పదాల ఉచ్ఛారణ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వాయిస్ ఫెసిలిటీ కూడా ఉంది. చైనీస్ నుంచి హిందీతో పాటు ఇతర విదేశీ భాషల్లోకి ఈ యాప్ ను డెవలప్ చేయాలనుకుంటున్నారు.

"మేం ప్రస్తుతానికి ఈ అప్లికేషన్ ను బాగా ప్రచారం చేయాలనుకుంటున్నాం. ఆ తర్వాత హయ్యర్ లెవెల్ కు తీసుకెళ్లి చైనీస్ ను మరింత సులభంగా, వేగంగా నేర్చుకునేలా యాప్ ను తీర్చిదిద్దుతాం. తర్వాత చైనీస్ నుంచి హిందీకి యాప్ ను డెవలప్ చేసే ఆలోచనలున్నాయి" -సుయూఫీ

న్యూఢిల్లీలో జరిగిన వాల్డ్ బుక్ ఫెయిర్ లో ఈ అప్లికేషన్ పనితీరు గురించి సందర్శకులకు వివరించారు. మొత్తానికి గేమ్ ద్వారా ఓ భాషను నేర్చుకోవడం బోర్ కొట్టించకుండా ఉంటుందన్నమాట.

Related Stories

Stories by Sri