ఆన్‌లైన్‌లో కార్పొరేట్ పాఠాలు చెప్పే హైదరాబాదీ సంస్థ 'లెర్న్ సోషల్'

దేశవ్యాప్తంగా విస్తరించిన హైదరాబాద్ స్టార్టప్..ఆన్ లైన్లో కార్పోరేట్ పాఠాలు నేర్పించే సైట్..  

ఆన్‌లైన్‌లో కార్పొరేట్ పాఠాలు చెప్పే హైదరాబాదీ సంస్థ 'లెర్న్ సోషల్'

Tuesday June 16, 2015,

2 min Read


రాజు వనపాల తొలితరం ఔత్సాహిక పారిశ్రామికవేత్త. వే 2 ఆన్ లైన్ ఇంటరాక్టివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నడిపిన మెసేజింగ్ పోర్టల్ ''వే2 ఎస్సెమ్మెస్ డాట్ కాం'' తో విజయాన్ని రుచిచూశారు. హైదరాబాద్ కేంద్రంగా నడిచిన వే2ఎస్సెమ్మెస్ 4 కోట్ల మంది వినియోగదారులను సమకూర్చుకోవడంతో అది వాల్యూ ఫస్ట్ వారి దృష్టిలో పడింది. 2012 లో దానికి 200 కోట్ల రూపాయల విలువ కట్టి వాల్యూ ఫస్ట్ కొనుగోలు చేసింది.

రాజు వనపాల

రాజు వనపాల


ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆన్ లైన్ అధ్యయనంలో ప్రవేశించారు రాజు. ఆయన తాజా వెంచర్ పేరు లెర్న్ సోషల్. ఇది అంతర్జాతీయ ఆన్‌లైన్ చదువులకు కేంద్రబిందువు లాంటిది. అయితే, సంప్రదాయ ఆన్ లైన్ చదువులకూ, కొత్తతరం మాసివ్ ఓపెన్ ఆన్ లైన్ కోర్సు ప్లాట్‌ఫామ్స్‌కూ ఇది భిన్నమైనది. టీచర్ నడిపే ఆన్‌లైన్ కోర్సులు లెర్న్ సోషల్ ప్రత్యేకత. ఇందులో టెక్నాలజీ, భాషలు, బిజినెస్ మేనేజ్ మెంట్, రోబోటిక్స్ సహా.. మరెన్నో అంశాలుంటాయి.

లెర్న్ సోషల్‌లో 50 మంది పనిచేస్తున్నారు . పరిశ్రమకు అవసరమయ్యే కోర్సులను గుర్తించటం, కాలేజి ఫ్రెషర్స్‌కి, వృత్తిలో కొనసాగుతున్నవారికీ, సీనియర్ ప్రొఫెషనల్స్‌కీ ఏమేం కావాలో గుర్తించటం వీళ్ళపని. అదే సమయంలో పరిశ్రమలో నిపుణులను, ఉత్సాహవంతులను గుర్తించి వాళ్ళతో భాగస్వామ్యం ఏర్పరచుకోవటం మీద దృష్టిపెడతారు. ప్రతి లెక్చర్‌నీ రికార్డు చేయటం ద్వారా ఉత్తమమైనవన్నీ ఎప్పటికీ అందుబాటులో ఉండేలా చూస్తారు. 

“ ప్రాంతం ఏదైనప్పటికీ అద్భుతమైన నాణ్యతతో కూడిన జ్ఞానాన్ని అందుబాటులో ఉంచటం మా లక్ష్యం. అందువల్లనే ఇతరుల్లా మా దగ్గర సంప్రదాయ ప్రొఫెసర్లుండరు. వివిధ రంగాల్లోని కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తూ ఎంతో అనుభవంతో పాటు బోధనపై ఇష్టత ఉన్నవాళ్ళను జాగ్రత్తగా ఎంపిక చేస్తాం. ఏ మారుమూల ప్రాంతానికో చెందిన ఏ వ్యక్తికైనా ప్రత్యేకంగా నేర్చుకునే అనుభవాన్ని పంచవల్సిందిగా ప్రతి ట్రెయినర్‌కీ లెర్న్ సోషల్ చెబుతుంది, దీనికి కావాల్సిందల్లా 1 mbps లోపు ఇంటర్నెట్ కనెక్టివిటీ. అప్పుడే లెర్న్ సోషల్ అందించే అత్యాధునికమైన కోర్సులు అందుకోగలుగుతారు'' అంటారు రాజు వనపాల.

ఈ ప్లాట్‌ఫామ్ మీద బోధించటానికి లెర్న్ సోషల్ 200 మంది నిపుణులను భాగస్వాములుగా చేసుకుంది. ముందుముందు కోర్సుల సంఖ్యను పెంచుతూ మరింత వైవిధ్య భరితమైన విభాగాలకు విస్తరించాలని అనుకుంటోంది. ప్రస్తుతం ఈ వేదికపై 11 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక మీదట ప్రతినెలా పదేసి కొత్త కోర్సులు కలుపుకుంటూ పోవాలని నిర్ణయించుకున్నారు.

ఆన్ లైన్ లో నేర్చుకోవటం బాగా వేగం పుంజుకుంది. ప్రయోగాత్మక దశలో మరో 15 ఉండటమే అందుకు స్పష్టమైన రుజువు. మొత్తం ఆన్ లైన్ చదువుల విభాగంలో పెద్ద పెద్ద సంస్థలు అడుగుపెడుతున్నాయి. విప్లవాత్మకమైన మార్పులకు ఇంకా కొంత దూరంలోనే ఉన్న లెర్న్ సోషల్ విద్యారంగంలో టెక్నాలజీని తక్కువగా అంచనావేయటానికీ, పక్కనబెట్టటానికీ వీల్లేదంటోంది.

రాజు నుంచి మరిన్ని వివరాలు వినటం కోసం ఎదురు చూస్తూ ఉండండి. అతని వెబ్ సైట్ learnsocial చూడండి.