ఇంటర్నెట్ స్పీడ్‌లో సైబరాబాద్‌కు తిరుగులేదు

సైబరాబాద్ సార్థక నామధేయం..ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే నెట్ స్పీడ్ ఎక్కువ..ఎల్‌టిఈకి మెరుగైన అవకాశాలున్నాయి..

0

ట్విన్‌ప్రైమ్‌లోని గ్లోబల్ లొకేషన్ బేస్డ్ యాక్సిలరేషన్ స్ట్రాటజీస్ (GLAS) డేటాబేస్ నిత్యం కోట్లాది నెట్వర్క్‌లను అధ్యయనం చేస్తూ.. నెట్వర్క్‌ పనితీరును విశ్లేషిస్తూ ఉంటుంది. మొబైల్ పర్ఫార్మెన్స్‌ గురంచి తెలుసుకోవాలంటే నెట్వర్క్ పనితీరుకు అడ్డంకి ఉన్న అంశాలనూ విశ్లేషించాల్సి ఉంటుంది. మా డేటా ద్వారా ఈ వివరాలను అర్థం చేసుకుని మొబైల్ పనితీరును అర్థం చేసుకుంటాం.

నెట్వర్క్ మెరుగుపరిస్తే వైఫై కంటే మెరుగైన పనితీరు

సెల్యూలార్ నెట్వర్క్‌ కంటే వైఫై మెరుగ్గా ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. వేగమే ఇందుకు కారణంగా చెప్తూ ఉంటారు. అయితే లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ (ఎల్‌టిఈ) కారణం కాదని చాలా నగరాల ద్వారా మాకు అర్థమైంది. మరి ఇండియా పరిస్థితి ఏంటి ?

ఇండియాలో ఇప్పుడిప్పుడే ఎల్‌టిఈకి ఆదరణ పెరుగుతోంది. ట్విన్ ప్రైమ్ లెక్కల ప్రకారం ఎల్‌టిఈని కోరే వారు 2 శాతం వరకూ ఉన్నారు. ముందస్తు అంచనాలను ప్రామాణికంగా తీసుకుంటే మెట్రో నగరాల్లో వైఫై కంటే ఎల్‌టిఈ మెరుగ్గా పనిచేస్తుంది. టెక్నాలజీ పరంగా తనకున్న పేరును హైదరాబాద్ సార్థకం చేసుకుంది. ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడి స్పీడ్ చాలా బాగుంది.

ఈ స్పీడ్ చార్ట్ ప్రకారం 30-60KB లోపు డౌన్ లోడ్ అయ్యే ఫైళ్ల వేగాన్ని సూచిస్తోంది. లక్షలాది శాంపిళ్ల నుంచి పరిశీలించిన తర్వాత ఈ విషయం అర్థమైంది.

ఎల్‌టిఈలో వీడియోలు చూసే వీలు

ఓ నాణ్యత కలిగిన వీడియో (ఉదా. 480పి వీడియో) డౌన్‌లోడ్ కావాలంటే కనీసం 1.5 ఎంబిపిఎస్ స్పీడ్ నెట్ ఉండాలి. లక్షలాది శాంపిళ్లను పరిశీలించిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే.. ఎల్‌టీఈ వీడియోలను డెలివర్ చేయడంలో మెరుగ్గానే ఉంది. 200kb కన్నా పెద్ద ఫైళ్ల డౌన్ లోడ్ విషయంలో మేం స్పీడ్, కనెక్షన్ సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాం.

చివరాఖరికి..

భారత దేశంలో ఉన్న నెట్వర్క్‌ పనితీరును అంచనా వేయడానికి మేం మిలియన్ల సంఖ్యలో అనేక గణాంకాలను పరిగణలోకి తీసుకున్నాం. ఎల్‌టిఈ ప్రారంభానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి. సైబరాబాద్ పేరును హైదరాబాద్ సార్థకం చేసుకుంది. ఎల్‌టిఈ డివైజుల వృద్ధి కూడా ఆశాజనకంగా ఉంది. దీని వల్ల నాణ్యమైన వీడియో, మీడియా అనుభూతిని పొందవచ్చు. ఇదో అద్భుతమైన అవకాశం. ఎంకామర్స్, ట్రావెల్, డేటింగ్ సహా.. మొబైల్ ఆధారిత వ్యాపారాలన్నింటికీ ఇదో సవాల్ లాంటిది కూడా.


రచయిత గురించి

సతీష్ రఘునాధ్, ట్విన్ ప్రైమ్‌లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ - కో ఫౌండర్. నెట్వర్క్ సాఫ్ట్‌వేర్ డిజైనింగ్‌లో ఆయనకు 15 ఏళ్ల అనుభవం ఉంది. జునిపర్ నెట్వర్క్స్, నార్టెల్ నెట్వర్క్స్‌లో ఆయన కీలక బాధ్యతలు పోషించారు.


Image credit - shutterstock