ప్లాన్ పక్కాగా ఉంటే స్టార్టప్ సక్సెస్ ఖాయం!- లైఫ్ మెంటార్ శశికుమార్!

ప్లాన్ పక్కాగా ఉంటే స్టార్టప్ సక్సెస్ ఖాయం!- లైఫ్ మెంటార్ శశికుమార్!

Tuesday January 26, 2016,

3 min Read

స్టార్టప్ లకు కావల్సిన అంశాల్లో ప్రధానమైనది రూపకల్పన. సరైన డిజైన్, ప్లానింగ్ లేకపోతే స్టార్టప్ లు ఫెయిల్ కాడానికి అవకాశాలెక్కువంటున్నారు శశికుమార్. వందల వేదికలు, వేల ప్రసంగాలు, లక్షల మంది ప్రేక్షకుల తో ప్రతిరోజూ ఎంతో బిజీగా గడిపే శశికుమార్ స్టార్టప్ సక్సెస్ కు టిప్స్ అందించారు.

ఫండింగ్ అసలు సమస్యేకాదు

ప్రతి స్టార్టప్- ఫండింగ్ పొందడం పెద్ద సమస్యగా భావిస్తుంది. కానీ ఫండింగ్ అనేది సమస్యే కాదని శశి అభిప్రాయపడ్డారు.

“స్టార్టప్ కు సరైన డిజైనింగ్ ఉండటమే అన్నింటికంటే ముఖ్యం,” శశి కుమార్

దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో స్టార్టప్ ఐడియాలు మొదలైతే, అందులో వేల సంఖ్యలో ప్రారంభం అవుతున్నాయి. వందల సంఖ్యలో స్టార్టప్ లు మాత్రమే సరైన డిజైన్ తో ముందుకొస్తున్నాయి. తీరా అమలు చేసేవి పదులు సంఖ్యలో ఉన్నాయి. వాటి బ్రాండ్స్ మాత్రమే మనం చూడగలుగు తున్నాం. ఇవి మాత్రమే విజయ తీరాలకు చేరడానికి కారణం ఆ స్టార్టప్ లు చేసిన రూపకల్పన మాత్రమే. సరైన డిజైన్ తోనే ఆ స్టార్టప్ లకు సక్సెస్ వరించిందని ఆయన చెప్పుకొచ్చారు.

"రూపకల్పన ఉంటే ఫండింగ్ అదే వస్తుంది," శశికుమార్

రూప కల్పనతోనే ఫండింగ్ పొందడానికి అవకాశం ఉందని శశి అంటున్నారు. దీనికోసం పెద్దగా గ్రౌండ్ వర్క్ ఏమీ అక్కర్లేదన్న శశి- స్టార్టప్ కు ఫండింగ్ ఉంటే సరిపోదని, ఫండింగ్ వచ్చిన తర్వాత కూడా దాన్ని సరిగ్గా డిజైన్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.

image


ప్రాడక్ట్ అండ్ మార్కెట్

స్టార్టప్ ప్రాడక్ట్ ఎంత బాగున్నప్పటికీ దానికి మార్కెట్ చేసుకోలేకపోతే స్టార్టప్ ఫెయిల్ అవుతుందని శశి అంటున్నారు.

“నేను అటెండ్ అయ్యే సభలకు, సరైన వ్యూహంతోనే సక్సస్ చేసుకుంటున్నా!” శశికుమార్

మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడానికి తాను ప్రతిరోజూ వందల మంది ప్రేక్షకులను కలుస్తుంటానని, ఈ సభలను విజయవంతంగా నడపడానికి తనకోసం పనిచేసే వ్యక్తుల వ్యూహంతోనే సాధ్యపడుతోందన్నారు. ఇదే ప్రకారం స్టార్టప్ అనేది ఓ ప్రాడక్ట్ గా భావిస్తే , దాన్ని సరైన మార్కెటింగ్ చేయగలిగినప్పుడే అది జనంలోకి వెళ్తుందన్నారు. ఇన్నోవేషన్ తో కూడిన ఐడియాని ప్రాడక్టుగా మార్చడం ఎంత ముఖ్యమో, దాన్ని మార్కెట్ చేయడమూ అంతే ప్రధానమని అన్నారు శశి కుమార్.

నా జీవితానికి నేనే రూపకర్తని

తనకు నాలుగేళ్లున్నప్పుడు తండ్రిని కోల్పోయానని శశికుమర్ చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి తాను నేర్చుకున్న జీవితపాఠాలే తననిక్కడ నిల్చోబెట్టాయన్నారు.

"నా చిన్నప్పుడు జరిగిన యాక్సిడెంట్ లో మానాన్న, అక్క చనిపోయారు," శివకుమార్

ఆ ప్రమాదం జరిగినప్పుడు తాను కూడా కారులో ఉన్నారట. తనని భగవంతుడు బతికించాడంటే ఏదో ఒక కారణం ఉందని గుర్తించడానికి చాలా ఏళ్లు పట్టిందని చెప్పుకొచ్చారు శివ. టెన్త్ స్టాండర్డ్ లో సెకెండ్ క్లాస్ మార్కులతో పాసయ్యారట. ఇంజనీరింగ్ సీట్ రాలేదట. కానీ తర్వాత పట్టుబట్టి స్పేస్ సైంటిస్ట్ కాలిగారు. ప్రభుత్వ ఉద్యోగం చేశారు. ఎంతో మంది కొత్తవారితో కలవడం తన జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకోడానికి అవకాశం లభించిందన్నారు.

image


అనుకోకుండా పబ్లిక్ స్పీకర్ అయ్యా!

పబ్లిక్ స్పీకర్ కావడం కూడా ఓ యాక్సిడెంటే అంటున్నారు శివకుమార్. 2000 సంవత్సరంలో ఓ ఆడిటోరియంలో సభను ఏర్పాటు చేశారు. మొత్తం సభను కో ఆర్డినేట్ చేసింది శివకుమారే. అయితే ఆ సభకు రావాల్సిన అథితి రాకపోవడంతో తాను మాట్లాడాల్సి వచ్చింది.

"నేనంత గొప్పగా మాట్లాడగలని గుర్తించింది ఆరోజే," శశికుమార్

తనలో గొప్ప స్పీకర్ ఉన్నారని గుర్తించిన శశి కుమార్ ఇక తిరిగి చూడలేదు. ఎన్నో ప్రసంగాలతో ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా మారారు.

image


భవిష్యత్ ప్రణాలికలు

ప్రస్తుతం స్టార్టప్ లకు మెంటార్షిప్ చేస్తున్నారు. లైఫ్ మెంటార్ ట్యాగ్ పెట్టుకున్న శశికుమార్ దేశంలో స్టార్టప్ ఈకో సిస్టమ్ బాగా వ్యాప్తి చెందుతుందంటున్నారు. స్టార్టప్ కు సంబంధించిన రూపకల్పన, ఇతర వ్యవహారాల విషయంలో సలహా ఇస్తానంటున్నారు. స్టార్టప్ ఫౌండర్ విజన్ ను ఇంప్లిమెంట్ చేసే రూపకల్పనకు ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తానంటున్నారు. దాని ద్వారా మెంటార్షిప్ చేయడంతో పాటు , స్టార్టప్ లకు ఫండింగ్ ఇచ్చే సంస్థలను ఎన్నుకొని వాటికి సరైన సలహా ఇచ్చే బాధ్యత చేపడతామన్నారు.

“పక్కనున్న సెలయేరు గుర్తించకుండా, నూతిలో ఉన్న నీటికోసం వెతుకుతున్న ప్రజానీకానికి తన లాంటి వారి అవసరం ఉంటుందని ముగించారు శశికుమార్

వెబ్ సైట్