భారతీయను చాటుతూనే.. విదేశీ సంస్థలో ఎదిగిన గరిమా వర్మ

0

గరిమా వర్మ.. కమ్యూనికేషన్ రంగంలో ఈ పేరు వినని వారుండరు. జీఈ కమ్యూనికేషన్ బహుళ విభాగాల్లో రీసెర్చ్ అండ్ డెవలమెంట్ సంస్థ. ఇందులో ఏకంగా 4500 మంది ఇంజనీర్లు, సైంటిస్ట్‌లు పనిచేస్తున్నారు. జీఈ కమ్యూనికేషన్స్‌లో గరిమ వర్మకు 25 ఏళ్ల అనుభవం ఉంది. బ్రాండ్ క్రియేషన్, మార్కెటింగ్, ఛేంజ్ మేనేజ్‌మెంట్లో ఆమెకు మంచి గుర్తింపు ఉంది.

JFWTCలో గరిమ ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ కమ్యూనికేషన్, ఈవెంట్స్, లీడర్‌షిప్ కమ్యూనికేషన్ బాధ్యతలు చూసుకుంటారు. జీఈ కంపెనీలో కార్పొరేట్ వెల్‌నెస్ కూడా ఈమె ఆధ్వర్యంలోనే నడుస్తోంది. ఇందులో భాగంగా కార్పొరేట్ ఉద్యోగులకు ఆరోగ్య సూత్రాలు అందిస్తుంటారు.

ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, మైక్రో ల్యాండ్, సన్‌మైక్రో సిస్టమ్స్‌లో గరిమ కీ రోల్ పోషించారు. గరిమ అడ్వకేట్ కూడా. పర్యావరణ ప్రాముఖ్యతను అందరికి చాటిచెప్పే బాధ్యతను ఆమె భుజాన వేసుకున్నారు. కాలుష్య కాసారంగా మారుతున్న నగరాల్లో పచ్చదనం ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గరిమ ప్రఖ్యాత బిట్స్ పిలానీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. జేవియర్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి అడ్వర్టైజింగ్ అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో పట్టా అందుకున్నారు. జీఈ కమ్యూనికేషన్ ఎదుగుదల.....తన యాటిట్యూడ్‌తో టాప్ పొజిషన్‌కు ఎలా వెళ్లారో ఆమె మాటల్లోనే విందాం....

మహిళా సంచలనం గరిమ వర్మ
మహిళా సంచలనం గరిమ వర్మ

మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోవద్దు

'' 2004లో ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్లో నేను పని చేశాను. ఇది అమెరికన్ మల్టీ నేషనల్ ఫైనాన్సియల్ సర్వీస్ కార్పొరేషన్. కంపెనీ హెడ్ క్వార్టర్స్ బోస్టన్‌లో ఉంది. సంస్థకు ముంబైలో ఓ బ్రాంచ్ కూడా ఉంది. బోస్టన్‌లో ఉండే ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్ కొలిగ్స్ నన్ను ఓ విషయం అడిగారు. అదేంటంటే భారతీయులు ఇంకా తమ ప్రయాణాలకు ఏనుగులనే వాడుతున్నారా.... ? అని ఆశ్చర్యంగా అడిగారు. దీని అర్ధం అక్కడి వారికి ఇండియన్ కల్చర్ గురించి పెద్దగా తెలియదు. అందుకే ఇండియా డే పేరుతో బోస్టన్‌లోని ఫిడిలిటీ హెడ్ క్వార్టర్స్‌లో ఓ కార్యక్రమం నిర్వహించాం. అందులో భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై వారికి ఓ అవగాహన తెచ్చాం.

నేను ఎప్పుడూ విదేశాలకు వెళ్లినా నా వెస్ట్రన్ సూట్స్, గౌన్స్ నాతో పాటే తీసుకెళ్తాను. కొన్ని చీరలు కూడా తీసుకెళ్లమని మా అమ్మ గుర్తు చేస్తుంటారు. ఇదంతా ఎందుకంటే ఎక్కడికి వెళ్లినా మనకంటూ ఓ ఐడెంటిటీ ఉండాలి. మనం భారతీయులమని ఎదుటి వారు గుర్తించాలి. శారీస్ ప్యాక్ చేయడంతో నా లగేజీ క్లోజ్ అవుతుంది. కాని అన్ని ఈవెంట్లకు శారీతోనే వెళ్తానని చెప్పలేను.

ఒక రోజు బోస్టన్‌లో చీర ధరించడంపై నా ఆలోచనా విధానంలో మార్పొచ్చింది. 175 మంది పాల్గొన్న ఆ కార్యక్రమంలో చీరతో ఉన్న భారతీయ మహిళను నేనొక్కదాన్నే.

ఆ ఈవెంట్ తర్వాత ఓ ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ సీఈవో నెడ్ జాన్సన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఆయన నాతో డిన్నర్‌లో 45 నిమిషాలు మాట్లాడారు. చాలా మంది ఇలాంటి అవకాశాలను చేజార్చుకుంటారు. ఆ సమయంలో నెడ్ జాన్సన్ నన్ను ఇలా ప్రశ్నించారు. యంగ్ లేడీ... మీరు వేసుకున్న వస్త్రాన్ని ఏమంటారు...? అంతకు ముందు వరకూ దాన్ని శారీ అంటారని ఆయనకు తెలియదు. అప్పుడే ఆయనకు చీరలతో పాటు భారత్ లో స్త్రీల వస్త్రధారణ సంప్రదాయంతో ముడిపడి ఉండే పద్ధతులు వివరించాను. ఆయన ఇండియాలో పర్యటించేటప్పుడు శారీ షాప్‌ తీసుకెళ్లి మరీ వాటి విశిష్టతను వివరించాను. అందుకే ఇంత గొప్ప సంస్కృతి గల భారతదేశంలో పుట్టినందుకు నేను ఎప్పుడూ గర్వపడతాను.

కొన్ని సమయాల్లో అవకాశాలు మనం నడుచుకునే తీరు బట్టి వాటికవే వస్తాయి. అందుకే మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది ఎప్పుడూ మర్చిపోకూడదు. బోస్టన్ ఈవెంట్ లో జరిగిన సంఘటన నాలో ఎంతో మార్పు తెచ్చింది. అప్పటి నుంచి నేనెక్కిడి వెళ్లినా నా భారతీయతను నావెంటే తీసుకెళ్తాను. ఇలాంటి విలువైన సలహా ఇచ్చినందుకు మా అమ్మకు నేను కృతజ్ఞురాలిని.

ఎదుటి వారికి మీరెంటో తెలుసుకునేందుకు 7 నిమిషాలు చాలు

కొన్నేళ్ల క్రితం.... నా ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభమైన మొదట్లో మరో సంఘటన నా జీవితాన్ని ప్రభావితం చేసింది. ఆఫీసులో ఉన్న లిఫ్ట్‌లో నేనూ, మా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెళ్తున్నాం. సెవంత్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వెళ్లాలి. లిఫ్ట్‌లో ఉన్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ మీరేం చేస్తారు అని ప్రశ్నించారు. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి నాతో మాట్లాడేసరికి ఒక్కసారిగా నేను అవాక్కయ్యాను. అసలు ఆయనకు ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు. భయంతో నోటి నుంచి మాట రాలేదు.

నా జీవితంలో ఈ సంఘటన ఓ గొప్ప అనుభవం. అప్పటి నుంచి అత్మనూన్యతను నా నుంచి దూరం చేశాను. మనమేంటో మనం తెలుసుకుని అన్నింటికి సిద్ధంగా ఉండాలని తెలుసుకున్నాను.

ఫస్ట్ ఇంప్రషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రషన్ అంటారు. ఎవరితోనైనా కనీసం ఏడు నిమిషాలు మాట్లాడితే చాలు ఎదుటి వారికి మీరేంటో తెలిసిపోతుంది. ఆ టైంలోనే మనమేంటో చెప్పాలి. లేదంటే ఫస్ట్ మినిట్‌లోనే మనపై బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది. అదే జరిగితే మన భవిష్యత్తు శూన్యమవుతుంది.

ఔత్సాహిక యువతకు నాదో సలహా. ఎప్పుడూ మనపై మనకు నమ్మకం ఉండాలి. ప్రతి విషయంలో సూటిగా స్పష్టంగా ఉండాలి. ఇలాంటి పద్దతి మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది.