బిలియన్ డాలర్ బిజినెస్ మీ కలా ?

రిస్క్, రిటర్న్, రివార్డ్స్ ఎలా చూడాలి ?నిత్యం గుర్తుంచుకోవాల్సిన అంకెలు ఏవి ?నిద్రలో లేపి అడిగినా ఏం చెప్పాలి ?స్టార్టప్స్ ఏం నేర్చుకోవాలి ?వై కాంబినేటర్ కెల్విన్ హేల్ సూచనలు

బిలియన్ డాలర్ బిజినెస్ మీ కలా ?

Thursday April 02, 2015,

3 min Read

ఫ్లోరిడాకు చెందిన ఆన్‌లైన్‌ ఫామ్‌ మేకర్‌ ఉఫ్‌ 35 మిలియన్‌ డాలర్ల వ్యాపారం, ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టిన పాల్‌ బుచెకు 29,561% రిటర్న్స్ రావడం అందరినీ ఆశ్చర్య పరిచిందని సర్వే మంకీలో వెల్లడైంది. ఏ సంస్థకు అయినా సరాసరి 676% రిటర్న్స్ రావడం సర్వసాధారణమే. అయితే యూఎస్‌కు చెందిన ఈ ప్రారంభ సంస్థలో పెట్టుబడిపెట్టిన పాల్‌ బుచెకు దక్కిన లాభాలు మాత్రం ఎవరి ఊహకూ అందనిది. ఎవరూ ఊహించనిది. ఈ స్థాయిలో లాభాలు ఆర్జించారంటే దాని అర్థం ఉఫ్‌ యజమానితో పాటు అక్కడి పదిమంది సభ్యుల బృందం ఎన్నుకున్న మార్గమే కారణం. ముఖ్యంగా వై కాంబినేటర్‌ వ్యవస్థాపకుడు కెవిన్‌ హేల్‌ ఈ కంపెనీకి వెనుక నుండి అందించిన ప్రోత్సాహం, ఆ తర్వాత ఈ సంస్థలో భాగస్వామిగా చేరడం వంటి అంశాలు విజయంలో కీలకపాత్ర పోషించాయి. ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించాల్సింది వై కాంబినేటర్‌ అధినేత కెల్విన్‌ హేల్‌ గురించి. కొద్సిదికాలం క్రితం సియోల్ లో పర్యటించిన కెల్విన్‌ కొన్బిని ఆసక్తికర విషయాలను అందరితో పంచుకున్నారు. ప్రతీ కంపెనీ కలగా చెప్పుకునే మ్యాజిక్ ఫిగర్ బిలియన్‌ డాలర్ల బిజినెస్ మార్కును ఎలా చేరుకోవాలనే అంశం ప్రేక్షకుంలదరిలోనో ఎంతో ఉత్సుతను రేకెత్తించింది. ఆ స్థాయిని అందుకోవడం వెనుక ఎటువంటి రహస్యం లేదని, ఆ మార్గాన్ని సులభంగా చేరుకోవడానికి కొన్ని కీలక అంశాలు దోహదపడతాయని చెప్పారు. 

ఎయిర్‌బీఎన్‌బీ, డ్రాప్‌ బాక్స్ సాధించిన విజయాలతో సహా వై కాంబినేటర్‌ అభివృద్ధికి సుమారు 1400 మంది వ్యవస్థాపకులు కొన్నేళ్ల పాటు శ్రమించారు. వ్యాపారాభివృద్ధికి చెయ్యాల్సినవి, చేయకూడనవి ఏంటన్నది వై కాంబినేటర్‌ భాగస్వామిగా, విజయవంతమైన వ్యాపారవేత్తగా కెల్విన్‌ హేల్‌కు బాగా తెలుసు. బిలియన్‌ డాలర్ల బిజినెస్‌ కలను సాకారం చేసుకునేందుకు ముఖ్యంగా మూడు విషయాలను ఆయన ప్రస్తావించారు.

కెవినే హేల్, వై కాంబినేటర్

కెవినే హేల్, వై కాంబినేటర్


1. స్పష్టమైన ఆలోచనా విధానం : వై కాంబినేటర్‌ డెమో రోజున 75 మంది స్టార్టప్స్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కేవలం రెండున్నర నిమిషాల సమయాన్ని మాత్రమే కేటాయిం చారు. బిజినెస్‌ గురించి కేవలం స్పష్టమైన ఆలోచన ఉన్నవారు మాత్రమే ఆ తక్కువ సమయంలో ప్రభావవంతంగా మాట్లాడగలరు. ఈ క్వాలిటీ అనేది టీమ్ ద్వారా వస్తుంది. దీన్ని ఎలా అభ్యాసం చేయాలో హేల్ చెబ్తున్నారు.

గ్రూప్‌ ఆఫీస్‌ అవర్స్ - చాలామంది స్టార్టప్స్ (10-20 మంది) ఒక గదిలో కూర్చుని తమ కంపెనీ గురించి చర్చించుకోవడం. మొదటి స్టార్టప్‌ ఏమి మాట్లాడాడు, అదేవిధంగా ఇతర స్టార్టప్‌లు ఏ విషయాలపై చర్చించారన్న వాటిపై దృష్టి పెట్టాలి. దీని ద్వారా ఆలోచనల్లోనో లేదా మన ఆలోచనా విధానాల్లోనో ఏదైనా లోపముంటే తెలుస్తుంది. ఒకరకంగా ఇది కొంచెం కష్టమే. ఈ అభ్యాసాన్ని పదే పదే అవలంభిస్తుంటే ప్రతి ఒక్క స్టార్టప్‌కూ మేలు జరుగుతుంది. దీని వల్ల భవిష్యత్తులో ఇన్వెస్టర్లతో పాటు యూజర్లకు, ఉద్యోగులకు, షేర్‌ హోల్డర్లకు ప్రతి ఒక్కరికీ థాట్ ప్రాసెస్ లో స్పష్టత వస్తుంది.

వీక్లీ డిన్నర్స్ - స్టార్టప్స్ కు సంబంధించి అతి ముఖ్యమైన ప్రశ్నలకు ఎంటర్‌ప్రెన్యూర్స్ సమాధానాలు ఇక్కడ లభిస్తాయి. స్టార్టప్‌ ఏంటీ? ఏవిధంగా పనిచేస్తుంది? ఎక్కడ/ఎప్పుడు/ఎవరు మనతో కలిసి పనిచేస్తారు, ఏదైనా స్టార్టప్‌ ఎలా అభివృద్ధి పథంలో నడుస్తోందన్న వాటికి సమాధానాలు వస్తాయి. అయితే సమాధానాలు క్లుప్తంగానూ, సంభాషణల ధోరణిలోనూ ఉండాలి. స్పష్టమైన ఆలోచన అనేది అభివృద్ధికి శంకుస్థాపన లాంటిదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

2. ఫోకస్‌ ఆన్‌ నంబర్స్ : ఇవి కేవలం అంకెలు మాత్రమే కాదు కీ పాయింట్‌ ఇండికేటర్స్(KPI). యూజర్లతో మాట్లాడి వారికి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ప్రతివారం 10% అభివృద్ధి సాధించేలా లక్ష్యం ఉండాలి. నిద్రలో లేపినా ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్‌ తప్పకుండా చెప్పాల్సిన వాటిలో...

- తమ కంపెనీ డబ్బు బ్యాంకులో ఎంత ఉంది ?

- రాబడి ఎంత ?

- ఎంత వేగంగా రాబడి పెరుగుతోంది ?

- జేబుకు ఎంత చిల్లు పడింది ?

- ఇంకా ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది ?

ఈ సమాచారం మన మెదడులో నిక్షిప్తతమై ఉంటే అదే మనల్ని ఎప్పుడూ డ్రైవ్ చేస్తుంది

3. బిగ్‌ విజన్‌ - భవిష్యత్‌ అంశాలకు సంబంధించి దూరదృష్టి ఎంతో అవసరం. ఏది జరగొచ్చు, ఏది జరగకపోవచ్చు అనేది అందరికంటే ముందే పసిగట్టగలగాలి. అందుకు సరైన ఆలోచన కావాలి. ప్రభావశీలురైన వ్యక్తులతో క్రమంతప్పకుండా కలుస్తూ ఉండాలి . పెద్ద కలలు ఎలా కనాలి, వాటిని ఎలా సాకారం చేసుకోవాలో మనకు అనుభవాలే పాఠం నేర్పిస్తాయి.