ఆన్‌లైన్‌లో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ల వివరాలిచ్చే ఫ్లాట్‌పెబుల్

ఆన్‌లైన్‌లో ఫోటోగ్రాఫర్లుదేశవ్యాప్తంగా 300 పట్టణాల్లో సర్వీసులుదేశంలో ఫోటోగ్రఫీ మార్కెట్ విలువ రూ. 10 వేల కోట్లుఅసంఘటితంగా ఉన్న రంగాన్ని మార్కెట్ చేస్తున్న ఫ్లాట్‌పెబుల్

0

ప్రణవ్ మెహతా, వెంకీ శేషాద్రిలకు మలేషియాలోని మైక్రోసాఫ్ట్‌లో పని చేసేటప్పుడే పారిశ్రామికవేత్తలుగా మారాలనే ఆలోచన వచ్చింది. ఆర్టిస్టులు, ఫోటోగ్రాఫర్ల కళను ఆన్‌లైన్‌ ద్వారా కస్టమర్లకు అందుబాటులోకి తేవాలని భావించారు వారు. దానిపై పరిశోధన ప్రారంభించాక వారి వ్యాపారం సాధారణంగా బల్క్ ఆర్డర్ల నుంచే వస్తోందనే విషయం అర్ధమైంది.

అందులోనూ ప్రస్తుత విధానం చాలా పాతబడిపోయిందని, దానిమూలంగా లాభదాయకత అట్టే ఉండడం లేదని తెలుసుకున్నారు వారిద్దరూ. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమ ఆలోచనను ఆచరణలోకి తెచ్చేసి ఫ్లాట్‌పెబుల్‌ను ప్రారంభించారు. ఇది కస్టమర్లను ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు, ట్యూటర్లను ఒకరితో ఒకరిని కలిపే ప్రాజెక్ట్. ఫ్లాట్‌పెబుల్ ఒక మార్కెట్ ప్లేస్ లాంటిది. ఈ ప్లాట్‌ఫాం ద్వారా ప్రపంచస్థాయి ఫోటోగ్రాపర్ల వివరాలు, బడ్జెట్, ఎస్టిమేట్లు కస్టమర్లు తెలుసుకోగలుగుతారు. అంతే కాదు వారి గురించిన రివ్యూలు చదివి, వారితో తేలిగ్గా కమ్యూనికేట్ కావచ్చు. ఇదంతా సాధ్యం చేసింది ఫ్లాట్‌పెబుల్.

మరోవైపు ఫోటోగ్రాఫర్లకూ ఇది ఎంతో ఉపయోగం. తమ వ్యాపార సరళిపై ఓ అంచనాకు వచ్చి తమ దృక్పథాన్ని మార్చుకునేందుకు ఫ్లాట్‌పెబుల్ దగ్గరున్న డేటా సైన్సెస్ టూల్ ఉపయోగపడుతుంది. తమ అంచనాలకు తగినట్లుగా కస్టమర్లతో డీల్స్ కుదుర్చుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ స్టార్టప్‌కు బెంగళూరు, ముంబై, పూనే వంటి మెట్రోల్లో స్పందన అంతగా రాకపోవడం ఆశ్చర్యకరం. 

“అంచనాలకు మించిన బడ్జెట్, రెవెన్యూలతో నాగపూర్ వంటి పట్టణాలు మమ్మల్ని సంభ్రమానికి గురి చేశాయి” అంటారు వెంకీ. 

మైక్రోసాఫ్ట్ వెంచర్స్ సపోర్ట్ ఇస్తున్న ఈ కంపెనీకి... రూ. 30 -60వేల మధ్య కొటేషన్లు అందుతున్నాయి. మొత్తం ఆర్డర్లలో 15-20శాతం బడ్జెట్ రూ. 1 లక్ష పైగానే. “ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు కూడా రెండంచెల బడ్జెట్ విధానానికి మారుతున్నారు. కస్టమర్ల స్థాయికి అనుగుణంగా రూ. 30 -60వేల బడ్జెట్‌లో ఒక రకమైన ఫోటోగ్రఫీ, రూ. 1లక్షకు మించిన వాటికి అధునాతనమైన సినిమాటిక్ ఫోటోగ్రఫీకి అలవాటుపడుతున్నార”ని చెప్పారు వెంకీ.

బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తోన్న ఈ సంస్థకు ప్రస్తుతం 1,700మంది ఫోటోగ్రాఫర్లున్నారు. దేశవ్యాప్తంగా 300 పట్టణాల నుంచి రూ. 1కోటికి పైగా బిజినెస్ టర్నోవర్‌ను అందుకుంది ఈ స్టార్టప్ కంపెనీ.

అభివృద్ధికి అవకాశాలు

సాధారణ స్థాయి అంచనాల ప్రకారమే మన దేశంలో పెళ్లిళ్ల ఫోటోగ్రఫీ మార్కెట్ విలువ రూ. 10 వేల కోట్లకు పైగానే. ఇందులో చాలావరకు అసంఘటిత రంగంలోనే జరుగుతోంది. దేశవ్యాప్తంగా 500 పట్టణాల్లో రెండున్నర లక్షల మంది ప్రొఫెషనల్స్ ఈ ఫోటోగ్రఫీ ద్వార జీవనం పొందుతున్నారు. సాధించేవరకూ మళ్లీ మళ్లీ “మా విధానాలు, నిర్ణయాలు, ఆలోచనలను పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. అదే మమ్మల్ని ఈ స్థాయికి చేర్చింది. ఇదే పద్ధతిని మేము కొనసాగిస్తామ”ని చెబ్తున్నారు వెంకీ. కొత్త ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండడం వీరికి బలం చేకూరుస్తోంది.

పోటీలోనూ మేటిగా

“ఓ రకంగా చూస్తే మాకు పోటీ చాలా ఎక్కువే. జస్ట్ డయల్, సులేఖ వంటి సైట్లు కస్టమర్లకు చాలా ఉపయోగపడుతున్నాయి. సోషల్ మీడియా కూడా చాలా విస్తృతంగా అభివృద్ధి చెందింది. అయితే.. ధరల నిర్ణయం చాలా ముఖ్యం. ఇది మిగతావాటిలో సాధ్యం కాదు. సమాచార మార్పిడి, నాణ్యతపై రివ్యూలు, ధరలు, అందుబాటు గురించిన అన్ని వివరాలు ఫ్లాట్‌పెబుల్ ఇవ్వడంతోడే కస్టమర్లు మాకు దగ్గరవుతున్నారం”టారు వెంకీ

ఫ్లాట్‌పెబుల్ ఇప్పుడు చాలా వేగంగా దూసుకుపోతంది. అనేక కొత్త ప్రోడక్టులను పరిచయం చేసేందుకు కూడా సిద్ధమవుతోంది. “మైక్రోసాఫ్ట్ వెంచర్స్ యాక్సిలరేటర్ దగ్గర మా అనుభవం మాకు చాలా ఉపయోగపడింది, మా డిమాండ్ 7 రెట్లకు పైగా పెరగడానికి మా విధానాలే కారణమని చెబ్తున్నారు వెంకీ. త్వరలో ట్యూటర్ల విభాగాన్ని పరిచయం చేయబోతోంది ఫ్లాట్‌పెబుల్.