విద్య ప్రాథమిక హక్కు. కానీ అది ప్రజలందరికీ సమానంగా దక్కడం లేదు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్ష. సామాజిక, ఆర్థిక అడ్డంకులతోపాటు సరైన అవగాహన లేకపోవడం కారణంగా గ్రామీణ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారు . సమాజంతో పోరాడి ఈ సమస్యను రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నాడు భారత్ కాలింగ్ స్థాపకుడు సందీప్ మెహతో...(This story is a part of Portraits of Purpose series sponsored by DBS Bank. ...)
'ప్రజలందరికీ ఇతరుల పట్ల సానుభూతి ఉంది. కానీ దాన్ని ప్రదర్శించే దైర్యం మాత్రం లేదు' అమెరికాకు చెందిన ఓ సుప్రసిద్ధ రచయిత్రి అభిప్రాయమిది. కానీ ఓ సామాన్య యువకుడు ఈ తెగువను ప్రదర్శించి సమస్యను ఎదుర్కొని.. పరిస్థితుల్లో మార్పు తెచ్చాడు. సందీప్ మెహతో.. భారత్ కాలింగ్ స్థాపకుడు.
ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కారణాలతో ఉన్నత విద్యకు ఎవరూ దూరం కాకుడదన్నది సందీప్ లక్ష్యం. భారత్ కాలింగ్ కార్యక్రమ సృష్టికర్త సందీప్ మెహతో స్వస్థలం మధ్యప్రదేశ్ సత్పౌడ అటవీ ప్రాంతం పత్రోటా. కుటుంబ పరిస్థితి అంతంతమాత్రమే. చిన్నతనంలో తన తండ్రి నిస్వార్థ సేవా గుణం సందీప్‌కు అర్థం కాలేదు. సందీప్ ఇంటిముందు ఓ కొటేషన్ ఉంటుంది. ' సుఖ జీవితానికి దయే మార్గం' అని. ఐతే దీనెప్పూడు సందీప్ పట్టించుకోలేదు. అతని తండ్రి మాత్రం దాన్నే అనుసరించేవారు.
సందీప్ తండ్రికి చిన్న వ్యాపారం ఉండేది. అది కూడా సరిగా నడిచేది కాదు. ఆరోగ్యం కూడా రోజు రోజుకూ దెబ్బతింది. ఆర్థిక సమస్యల కారణంగా మెహతో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. ఎన్ని సమస్యలు ఎదురైనా తల్లిదండ్రులు మాత్రం సందీప్ చక్కగా ఉన్నత విద్య చదువుకోవాలని ఆకాంక్షించారు. ఓ వైపు ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా ఎలాగోలా హయ్యర్ సెకండరీ విద్యను పూర్తి చేశాడు. అదీ అత్తెసరు మార్కులతో. ఆ తర్వాత బీఈ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌ను పూర్తి చేశాడు. సందీప్‌తోపాటు స్కూల్లో చదివిన వారిలో చాలామందికి సరైన ప్రోత్సాహం లేక మధ్యలోనే చదువును ఆపేశారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి ఇంజినీరింగ్ చేసిన వారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లోఉండగా సందీప్ తండ్రి గుండెపోటుతో చనిపోయారు. అంత్యక్రియలు పూర్తయిన మరుసటి రోజు సందీప్ ఇంటి ముందు పెద్ద క్యూ. సందీప్ తండ్రి మృతికి నివాళులర్పించేందుకు ఆ ఊరి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిస్వార్థంగా ప్రతి ఒక్కరికి సాయం చేసిన సందీప్ తండ్రి ఆ ఊరి ప్రజల మనస్సులో నిలిచిపోయారు. ఆ దృశ్యాలే భవిష్యత్‌లో ఏం చేయాలో సందీప్‌కు మార్గనిర్దేశమయ్యాయి.
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్)లో ఎంఏ సోషల్ ఆంట్రపెన్యూర్ప్రెన్యూర్షిప్కు ఎంపికయ్యాడు. ఆ కోర్సులో చేరడమే సందీప్ జీవితాన్ని మార్చేసింది. సమాజానికి ఏదో చేయాలన్న సంకల్పాన్ని కల్పించింది. సమాజానికి ఉపయోగపడేలా చేసి.. తన తండ్రిలాగే గుర్తింపు తెచ్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు సందీప్. సమాజానికి ఉపయోగపడే పనులు చేసి జీవితాన్నిసార్థకం చేసుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నాడు. టిస్‌లో సోషల్ ఇంటర్న్‌షిప్ ప్రాజెక్ట్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్యపై అవగాహన అనే విషయంపై పరిశోధన చేయాలని సూచించారు. ఐతే చిన్నతనంలో తాను అనుభవించిన పరిస్థితులే సందీప్‌కు ఈసారీ కనిపించాయి. గ్రామీణ ప్రాంతాల్లో ట్వెల్త్ స్టాండర్డ్ లోపే 90 శాతం మంది విద్యార్థులు చదువులకు స్వస్తి చెప్పడం సందీప్ గుర్తించాడు.
ఉన్నత విద్య చదవాలంటే తెలివి ఒక్కటే సరిపోదని సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు కూడా సహకరించాలని తెలిసొచ్చింది. సరైన మార్గదర్శి లేక, కాలేజీ దరఖాస్తులు ఆన్లైన్లో నింపలేక, వివిధ రకాల వివక్షలు, సరైన సమాచారం లభించని కారణంగా ఉన్నత విద్య గ్రామీణ విద్యార్థులకు అందని ద్రాక్షగా మారింది. 2009కు ముందు సందీప్ గ్రామానికి చెందిన వారెవరూ 'నాక్' గుర్తించిన కాలేజీలో చదవలేదు.
'టిస్' మద్దతుతో సందీప్ భారత్ కాలింగ్‌ను 2009లో ప్రారంభించారు. ఆరంభంలో ఉన్నత విద్య సమాచారాన్ని విద్యార్థులకు అందించడం, దరఖాస్తులు నింపడం, సమ్మర్ క్యాంప్‌లను నిర్వహించి ఉన్నత విద్యా సంస్థల గురించి స్టూడెంట్స్‌కు తెలుపడం వంటి సహాయ కార్యక్రమాలను భారత్ కాలింగ్ అందించింది. ఉన్నత విద్య సమాచార అవకాశాల గురించి మొదట్లో ఒక్క కాలేజీకి అందించిన ఈ సంస్థ ప్రస్తుతం 27 స్కూళ్లకు విస్తరించింది. ప్రతియేటా అవేర్నెస్ సెషన్లోనమోదు చేయించుకున్న 12 వేల మందిలో 380 మంది ఉన్నత విద్య సమాచారం కోసమే అందులో చేరుతున్నారు. ఇక వివిధ యూనివర్సిటీల నుంచి పట్టుదల, చిత్తశుద్ధి కలిగిన వలంటీర్లను ఎంపికచేసి అవేర్నెస్ సెషన్స్, సమ్మర్ క్యాంప్‌లలో టీచింగ్ బాధ్యతలు అప్పగించారు. వారి బోధనలు, సూచనల కారణంగా ఎంతోమంది డ్రౌపౌట్స్ మళ్లీ చదువుపై ఆసక్తి పెంచుకొన్నారు. ఈ ప్రయాణం సందీప్ మెహతో నేతృత్వంలో భారత్ కాలింగ్ బృందానికి ఓ వైపు సంతృప్తినివ్వడంతోపాటు మరిన్ని సవాళ్లను కూడా తెచ్చిపెట్టింది.
డీబీఎస్ సహకారంతో..
'వేగంగా వెళ్లాలంటే ఒంటరిగా వెళ్లు.. దూరం వెళ్లాలంటే కలిసివెళ్లు' అన్నది ఆఫ్రికా సామెత. మెహతో కూడా సుదూరం ప్రయాణించాలనుకున్నాడు. అందుకోసం సరైన భాగస్వామి డీబీఎస్ బ్యాంక్ ఇండియాను ఎంపికచేసుకున్నాడు. డీబీఎస్‌తో ప్రయాణం మొదలైన తర్వాత సమస్యలు కూడా అవకాశాల్లాగా మారిపోయాయి. ఇండియా కాలింగ్‌కు ఆర్థికంగానే కాదు అన్ని వ్యవహారాల్లోనూ చేదోడువాదోడుగా నిలిచిందీ డీబీఎస్. కుటుంబంలాగా వెన్నెంటి నిలిచి అన్ని అవసరాలను తీర్చింది. డీబీఎస్ బ్యాంక్ భాగస్వామిగా చేరిన తర్వాత 2012లో ఇండియా కాలింగ్ ఉన్నత శిఖరాలను అధిరోహించింది. భారత్ కాలింగ్ భవిష్యత్‌పై కూడా మెహతో ఎంతో సంతోషంతో ఉన్నాడు.
'వచ్చే పదేళ్లలో భారత్ కాలింగ్‌కు పనిలేకుండా పోవాలి. అప్పుడే పరిస్థితుల్లో కోరుకున్న మార్పు వచ్చినట్టవుతుంది. ప్రభుత్వమే చొరవ తీసుకుని వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలి’ అని మెహతో కోరుతున్నాడు.
Related Stories
Stories by GOPAL
March 14, 2017
March 14, 2017
March 14, 2017
March 14, 2017