హైదరాబాద్ డబ్బావాలా 'టిన్‌మెన్‌'కు ఫండింగ్!

0

హైదరాబాద్‌కు చెందిన ఫుడ్ టెక్ స్టార్టప్ టిన్‌మెన్‌ మొదటి దశ ఫండింగ్‌ను సమీకరించుకుంది. లోకల్ డబ్బావాలాలుగా పేరుతెచ్చుకున్న ఈ స్టార్టప్‌కు లీడ్ ఏంజిల్ నెట్వర్క్ ఫండింగ్ అందజేసింది. అయితే డీల్ వివరాలను మాత్రం ఇరు కంపెనీలూ వెల్లడించలేదు. సమీకరించిన నిధులతో ఏడాది పాటు నిరాటంకంగా కార్యకలాపాలు కొనసాగించేందుకు అవకాశం ఏర్పడిందని టిన్‌మెన్ టీం చెబ్తోంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన సర్వీసును ఇతర హైదరాబాద్‌లోని ఇతర ఏరియాలు, వివిధ నగరాలకు విస్తరించేందుకు దోహదపడ్తుందని వివరించింది.

2015 సెప్టెంబర్‌ నుంచి పూర్తిస్థాయి ఆపరేషన్స్ ప్రారంభించిన టిన్‌మెన్ ఆరు నెలలు తిరగకుండానే మంచిపేరు సంపాదించుకుంది. ఆఫీస్ లంచ్ సమస్యలకు సింపుల్ యాప్ ద్వారా పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో మొదలైన ఈ స్టార్టప్‌ రూ.50 అతితక్కువ ప్రైజ్‌ నుంచే డిఫరెంట్ వెరైటీల ఫుడ్‌ను ఆఫీసులకే డెలివర్ చేస్తూ వస్తోంది. ప్రారంభంలో రోజుకు 100 లంచ్‌లను డెలివర్ చేస్తున్న టిన్‌మెన్ ఇప్పుడా సంఖ్యను వారానికి 1500 స్థాయికి పెంచుకుంది. నెలకు యావరేజ్‌న రూ.6లక్షల సేల్స్ చేస్తున్నట్టు సంస్థ కో ఫౌండర్ ముఖేష్ యువర్ స్టోరీకి వివరించారు.

''మా మీల్ సబ్ స్ర్కిప్షన్ మోడల్ కస్టమర్లతో పాటు ఇన్వెస్టరను కూడా ఆకర్షించడం సంతోషంగా ఉంది. కస్టమర్ల సంఖ్యను మరింత పెంచుకోవడానికి ఈ సమీకరించిన నిధులను ఉపయోగిస్తాం'' - ముకేష్ మండా, కో ఫౌండర్ - టిన్ మెన్

సింపుల్ యాప్ ద్వారా ఏ రోజు ఏ ఫుడ్ కావాలో సెలక్ట్ చేసుకుని ఆఫీసుకే లంచ్ తెప్పించుకునే మోడల్‌ను టిన్‌మెన్ రూపొందించింది. హోం చెఫ్స్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా ఇంటి టేస్ట్‌ రావడంతో పాటు వాళ్లకు కూడా ఉపాధి దొరికినట్టవుతుందనేది టిన్‌మెన్ ప్లాన్.

''గత కొద్దికాలం నుంచి ఫుడ్ టెక్ స్టార్టప్స్ గురించి చాలా చర్చ జరుగుతోంది. ఇప్పుడు వాటిల్లో బలమైనవే నిలబడే సమయం ఆసన్నమైంది. ఈ స్పేస్ లో ఇప్పుడు స్పష్టమైన బిజినెస్ మోడల్ కావాలి. మల్టీ క్యుసిన్, మల్టీ రెస్టారెంట్ లాంటి సర్వీసును అతి చౌక ధరలో టిన్ మెన్ అందిస్తోంది. విభిన్నమైన డెలివరీ మెకానిజం, వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ కంపెనీకి కలిసొస్తోంది'' అంటున్నారు లీడ్ ఏంజిల్స్ వైస్ ప్రెసిడెంట్ వినుత రాళ్లపల్లి.

2015 ఆగస్టులో నిర్వహించిన ఆగస్ట్‌ ఫెస్ట్‌ పిచింగ్‌లో రూ.5 లక్షలను గెలుచుకున్న టిన్‌మెన్ ఇప్పుడు అదే ఉత్సాహంతో మొదటి దశ ఫండింగ్‌ను కూడా తెచ్చుకుంది. త్వరలో సీరీస్‌ ఏ ఫండింగ్ కోసం మిలియన్ డాలర్లు రెయిజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు ముకేష్ తెలిపారు.

టిన్‌మెన్ గురించి బ్రీఫ్‌గా

ఐఐటి, ఆక్స్‌ఫర్డ్ వంటి ఉన్నత యూనివర్సిటీల్లో చదువుకున్న వాళ్లంతా కలిసి టిన్‌మెన్ అనే స్టార్టప్‌ను ఆరునెలల క్రితం మొదలుపెట్టారు. టిన్ మెన్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని మన వాలెట్‌లో మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వారమంతా ఏం కావాలో జస్ట్ సెలెక్ట్ చేస్తే.. మధ్యాహ్నం ఒకటిన్నర కల్లా లంచ్ డెలివర్ అయిపోతుంది. ఒక వేళ ఆ రోజు వద్దనుకుంటే ఉదయం తొమ్మిది లోపు పాస్ బటన్ ప్రెస్ చేస్తే చాలు. యాభై రూపాయల నుంచి మొదలయ్యే లంచ్ ఐటెమ్స్ మెనూలో ఉన్నాయి. డెలివరీ కూడా ఉచితంగానే చేస్తున్నారు.

క్వాలిటీని నిలబెట్టుకుంటూ.. కొత్త రుచులను పరిచయం చేయడానికి ఆహారాన్ని వండే బాధ్యతను ఔట్‍‌సోర్స్ చేస్తోంది టిన్‌మెన్.

టిన్‌మెన్‌ వెనుక టీం ముకేష్, చైతన్య ఉన్నారు. ముకేష్.. ఐఐటి ఖరగ్‌పూర్‌లో బిటెక్ పూర్తిచేసి ఒరాకిల్, అమెజాన్ సంస్థల్లో పనిచేశారు. చైతన్య - ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబిఏ పూర్తిచేశారు. క్రిసిల్, డెలాయిట్ సంస్థల్లో పనిచేసి అనుభవం సంపాదించారు.

మా లక్ష్యం ఒకటే - ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేసి మీ విజయగాధను వివరించడం ! వాళ్లలో స్ఫూర్తిని నింపడం.

Related Stories

Stories by Nagendra sai