ఢిల్లీలో లాండ్రీ స్టార్టప్ ఎందుకు షట్‌డౌన్ అయిందంటే..

Sunday February 28, 2016,

2 min Read

స్టార్టప్ రంగంలోనూ కరెక్షన్ మొదలైంది. ఎన్నో ఆశలతో సంస్థలను ప్రారంభిస్తున్న నిర్వాహకులు.. మార్కెట్‌ను సొంతం చేసుకోలేక, సరైన పెట్టుబడులు రాక సంస్థలను మూసేస్తున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఆన్‌డిమాండ్ లాండ్రీ స్టార్టప్.. టూలర్ తమ కార్యకలాపాలను నిలిపేసింది. ఇన్వెస్టర్లు, కస్టమర్ల నమ్మకాన్ని చూరగొనలేకపోయిన కారణంగానే సంస్థ షట్‌డౌన్ చేసిందని నిపుణులు అంటున్నారు.

భారత్‌లో ఆర్థిక వ్యవస్థ ఎగుడుదిగుడుగా సాగుతోంది. గత ఏడాది మూడో క్వార్టర్ వరకు ఆడుతూపాడుతూ గడిపిన ఇన్వెస్టర్లకు ఆ తర్వాత కష్టకాలం మొదలైంది. సరైన నిర్వహణ లేని కారణంగా కొన్ని సంస్థలు తమ కార్యకాలపాలను నిలుపేయాల్సి వచ్చింది. అందులో ఒకటి ఢిల్లీకి చెందిన ఆన్ డిమాండ్ లాండ్రీ స్టార్టప్ టూలర్. ఈ సంస్థ ఇటీవలే ఆర్డర్లు తీసుకోవడం నిలిపేసింది. గుర్గావ్, ఢిల్లీల్లో ఉన్న ఆఫ్‌లైన్ కౌంటర్లను కూడా ఈ సంస్థ మూసేసింది.

undefined

undefined

:

కార్యకలాపాలను నిలిపేయడంపై స్పందన కోరేందుకు యువర్‌స్టోరీ ప్రయత్నించినప్పటికీ నిర్వాహకులు సరైన అందుబాటులోకి రాలేదు. అయితే సంస్థను మూసేసిన విషయం వాస్తవమేనని కో ఫౌండర్ సుకాంత్ శ్రీవాస్తవ ఎస్‌ఎంఎస్‌ ద్వారా కన్ఫమ్ చేశారు.

మూసివేతకు కారణాలు..

యువర్‌స్టోరీకి విశ్వసనీయ వర్గాల అందించిన సమాచారం ప్రకారం టూలర్ కొంతకాలంగా నిధుల సమీకరణకు ప్రయత్నిస్తున్నది. అయితే ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను పొందడంలో మాత్రం విఫలమైంది. ఇటీవలే ఆన్ డిమాండ్ స్టార్టప్ మైవాష్ సంస్థను అమెజాన్ సొంతం చేసుకుంది. ఈ సంస్థలో హౌస్ జాయ్ పెట్టుబడి పెట్టింది. అలాగే హైబ్రిడ్ లాండ్రి ప్లాట్‌ఫామ్ వాసప్‌ను ఏంజెల్ సంస్థ సొంతం చేసుకోగా, చమక్ దీనిలో పెట్టుబడులు పెట్టింది. అయితే ఎంతమేర పెట్టుబడులు పెట్టిందో మాత్రం బయటకు రాలేదు.

గత ఏడాది జూన్‌లో ప్రారంభమైన టూలర్ ప్రతి రోజు వంద ఆర్డర్లకు పైగా తీసుకుంటోందని గతంలో యువర్‌స్టోరీతో ఇంటరాక్షన్ సందర్భంగా సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇతర స్టార్టప్‌లతో పోలిస్తే ఆన్ డిమాండ్ స్టార్టప్స్ ప్రి-సిరీస్ ఏ లేదా సీడ్ ఫండింగ్‌ను సంపాదించడంలో విఫలమవుతున్నాయి. విస్తరించే అవకాశాలు ఎక్కువగా లేకపోవడం, సరైన సదుపాయాలు కల్పించకపోవడం కారణంగానే ఇన్వెస్టర్లు పెట్టుబడులు ముందుకు రావడం లేదని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.

నమ్మకం కోల్పోవడమే కారణం..

ఆన్ డిమాండ్ స్టార్టప్స్ రంగంలో సంస్థలు విఫలమవడానికి ప్రధాన కారణం కస్టమర్ల నమ్మకం కోల్పోవడమే. లాండ్రీ స్టార్టప్స్‌లలో ప్రధాన సమస్య కస్టమర్లను పొందడం, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, డెలివరీ ఇవ్వడం. లాండ్రీ బిజినెస్‌లో కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టకోవడం చాలా కష్టం. వాషింగ్, డ్రై, ఐరన్ ఇలా మొత్తం ప్రక్రియ పూర్తవడానికి కనీసం రెండు నుంచి మూడు రోజులు పడుతుంది. కస్టమర్లేమో వేగంగా డెలివరీ కోరుకుంటారు. ఈ నేపథ్యంలో డిమాండ్‌ను తట్టుకొని డెలివరీ చేయడం స్టార్టప్ సంస్థలకు కష్టంగా మారింది. అలాగే ఈ రంగంలో విస్తరణకు కూడా పెద్దగా అవకాశాలు ఉండవు. డిమాండ్ కూడా స్థిరంగా లేదు. దీంతో సంస్థలు ఒక్కొక్కటిగా మూసివేత దిశగా పయనిస్తున్నాయి. పెద్దఎత్తున పెట్టుబడులతో వచ్చిన ఆన్ డిమాండ్ గ్రోసరీ స్టార్టప్స్ గ్రోఫర్స్, పెప్పర్‌టాప్ సంస్థలు కూడా డిమాండ్ అంతగా లేకపోవడంతో కొన్ని నగరాల్లో తమ కార్యకలాపాలను నిలిపేశాయి.

లాండ్రీ స్టార్టప్స్ మాత్రమే కాకుండా, బ్యూటీ, హోమ్ సర్వీసెస్ రంగాల్లో కూడా కరెక్షన్ ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి ఎన్నో ఆశలతో స్టార్టప్ రంగంలోకి అడుగుపెట్టిన టూలర్ నిర్వాహకులకు చివరకు నిరాశే మిగిలింది.