వినూత్న చెల్లింపుల వేదిక.. తండ్రీ కూతుళ్ల సరికొత్త ఆవిష్కరణ

వినూత్న చెల్లింపుల వేదిక.. తండ్రీ కూతుళ్ల సరికొత్త ఆవిష్కరణ

Wednesday April 13, 2016,

3 min Read


ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ పెరిగిపోతోంది. ఇండియా కూడా టెక్నాలజీ రోజు రోజుకు అందిపుచ్చుకుంటోంది. దేశఆర్థిక వ్యవస్థలో కార్డ్‌లెస్, క్యాష్‌లెస్ సేవలు సుదూర స్వప్నమేమీ కాదు. 3జీ, 4జీ సేవలకే కాదు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) టెక్నాలజీకి కూడా క్యాష్‌లెస్ సేవలు పెరిగిపోతున్నాయి. సమీప దూరంలో ఉన్న రెండు ఎలక్ట్రానిక్ డివైజ్‌ల మధ్య వైర్‌లెస్ డాటా ఎక్స్చేంజ్‌నే ఎన్‌ఎఫ్‌సీగా చెప్తారు. మొబైల్ పేమెంట్ ఫోరం ఆఫ్ ఇండియా ప్రకారం దేశంలో 200 మిలియన్ల మొబైల్ యూజర్లున్నారు. ప్రతినెలా మరో ఐదు మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు జత కలుస్తున్నారు. ఇలాంటి తరుణంలో స్మార్ట్‌ఫోన్స్ లేని వినియోగదారులు సైతం క్యాష్‌లెస్ సేవలు పొందే అవకాశాన్ని ఈ ఎన్‌ఎఫ్‌సీ కల్పిస్తోంది. 

29 ఏళ్ల లక్ష్మీదీప లండన్‌లోని ఓ అంతర్జాతీయ టెలికం కంపెనీలో పనిచేశారు. ఆమె తండ్రి అర్జునమూర్తి ఓ సీరియల్ ఆంట్రప్రెన్యూర్. చెన్నైలో టెక్నాలజీ కంపెనీని ఏర్పాటు చేయాలన్న తన విజన్‌ను కూతురికి వివరించారు. దీంతో లక్ష్మీదీప 2012లో భారత్‌కు తిరిగొచ్చారు. కొన్నాళ్లపాటు రీసెర్చ్ తర్వాత ఈ తండ్రీ కూతుళ్లిద్దరూ ఎన్‌ఎఫ్‌సీ బేస్డ్, టెక్నాలజీ కంపెనీ యెల్డీ సాఫ్ట్‌కామ్‌ను 2015 జూలైలో ప్రారంభించారు.

అర్జున్‌మూర్తి, లక్ష్మీ దీప

అర్జున్‌మూర్తి, లక్ష్మీ దీప


ఎన్‌ఎక్స్‌పీ సెమికండక్టర్స్‌ సహకారంతో యెల్డీ ఎన్ఎఫ్‌సీ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ ఎన్‌ఎఫ్‌సీ ఇకో సిస్టమ్‌లో ఎన్ఎఫ్‌సీ హ్యాండ్‌సెట్, కార్డ్, బ్యాక్ ఎండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మొబైల్ యాప్ వంటివి ఉంటాయి. హ్యాండ్‌సెట్ కార్డ్ రీడర్, రైటర్‌లా పనిచేస్తుంది.

మల్టీ టెనెంట్ వెరైటీ ఆఫ్ పేమెంట్, సెక్యూరిటీ యాక్సెస్ అప్లికేషన్ల కోసం కాంటాక్ట్‌ లెన్స్ కార్డ్స్‌ను యెల్డీ డిజైన్ చేసింది. ఈ కార్డ్‌లను యెల్డీ ఎన్‌ఎఫ్‌సీలో పెట్టగానే డాటా ఎక్స్చేంజ్, ట్రాన్సాక్షన్స్ జరిగిపోతాయి. డాటా సెంటర్స్ ఆధారంగా రూపొందించిన బ్యాక్ ఎండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భవిష్యత్‌లో పెద్ద ఎత్తున జరిగే ట్రాన్సాక్షన్లకు కూడా సరిపోయేలా రూపొందించారు. ఇక వీరు రూపొందించిన మొబైల్ యాప్ ఆర్డర్లు చేసేందుకు, అపాయింట్‌మెంట్లను ఫిక్స్ చేసుకునేందుకు, లేటెస్ట్ ఆఫర్లను చెక్ చేసుకునేందుకు, గత ట్రాన్సక్షన్లను పరిశీలించేందుకు ఉపయోగపడుతుంది.

శ్రీలంకలో అరంగేట్రం..

శ్రీలంకలో ఐటాప్‌ ఇట్‌ పేరుతో ఇటీవలే ఓ ప్రిపెయిడ్ కార్డును నేషనల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ పీఎల్సీ సహకారంతో లాంచ్ చేసింది యెల్డీ సాఫ్ట్‌కామ్. దీన్ని డెబిట్ కార్డులాగా, ప్రీపెయిడ్ వాలెట్ కార్డులాగా వాడొచ్చు. ఈ ఐట్యాప్‌ ఇట్ కార్డును బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్, మిడిల్ ఈస్ట్‌ దేశాల్లో కూడా లాంచ్ చేసేందుకు యెల్డీ సాఫ్ట్‌కామ్ చర్చలు జరుపుతోంది.

పేమెంట్ కార్డ్..

దీనికితోడుగా ఎఫ్ అండ్ బీ సెగ్మెంట్‌ బ్యూటీపార్లర్, లైబ్రరీస్, లాండ్రోమాట్స్‌లలో చెల్లింపుల కోసం క్లోజ్డ్ గ్రూప్ పేమెంట్ కార్డు యెల్డీ ఎంఫాస్‌ను కూడా లాంచ్ చేసింది. ఎయిరిండియా, వసంత్ భవన్, వాంగో, బౌన్స్ బ్యాక్, గుర్డిని వంటి కంపెనీలు యెల్డీ కస్టమర్లే.

‘‘మా ప్రాడక్ట్‌ను తీసుకోవడం ద్వారా మా బీ2సీ కస్టమర్లు ఎంతో డబ్బును పొదుపు చేసినవారవుతారు. అలాగే రీటైలర్లు కూడా ఎంతో సంతృప్తి చెందుతారు. మా ఎన్‌ఎఫ్‌సీ మొబైల్ ట్యాగ్స్, బయోమెట్రిక్ టాప్ అప్స్‌కు ఫీల్డ్ పేటెంట్ కూడా ఉంది’’ అని లక్ష్మీ దీప వివరించారు. 

దీప తమిళనాడులోని అన్నై యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్, ఇంగ్లండ్‌లోని వార్విక్ యూనివర్సిటీ నుంచి అడ్వాన్స్డ్ ఫొటోనిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో పీజీని పూర్తి చేశారు. ప్రస్తుతం యెల్డీ సాఫ్ట్‌కామ్‌లో బిజినెస్ వ్యవహారాలతోపాటు ప్రాడక్ట్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్ అండ్ హెచ్‌ఆర్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

జీనీ ఫూడ్స్, మౌన్మెంట్ మాస్ మీడియా, జిల్లియాన్ మార్కెటింగ్, శ్రీరాం కార్పొరేషన్ వంటి సంస్థలను నిర్వహించిన అర్జున్‌ మూర్తికి ఆంట్రప్రెన్యూర్ రంగంలో 30 ఏళ్ల అనుభవముంది.

విస్తరణ వ్యూహం..

యెల్డీ సాఫ్ట్‌కామ్ సంస్థలో 80 మంది టెక్నాలజీ టీమ్‌తో కలిపి మొత్తం 90 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాదిలో సాఫ్ట్‌ను 300కు పెంచాలని యాజమాన్యం భావిస్తోంది. చెన్నై కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థకు ఢిల్లీ, శ్రీలంకలలో సేల్స్ ఆఫీసులున్నాయి.

యెల్దీ సాఫ్ట్ కామ్ ఉద్యోగులు

యెల్దీ సాఫ్ట్ కామ్ ఉద్యోగులు


రెవెన్యూ మోడల్..

ఈ ఏడాది తాము లాంచ్ చేయబోయే ప్రాడక్ట్‌ల ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకోవాలన్నది యెల్డీ సాఫ్ట్‌కామ్ లక్ష్యం. అలాగే ఈ ఏడాది చివరికల్లా 10 లక్షల మంది కస్టమర్లను సంపాదించాలని భావిస్తోంది. తమ ప్రతి కార్డు ట్రాన్సాక్షన్‌కు 50 రూపాయలను చార్జ్‌గా వసూలు చేస్తున్నది. ఒప్పందం కుదుర్చుకునేందుకు మెట్రో రైల్ కార్పొరేషన్‌తో కూడా చర్చలు జరుపుతున్నరు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, మల్టీప్లెక్సెస్, షాపింగ్‌మాల్స్, రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా పేమెంట్ సొల్యూషన్‌గా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.

‘‘ఈ ఏడాది చివరికల్లా కోటి ఎన్‌ఎఫ్‌సీ కార్డులను మార్కెట్ చేయాలనుకుంటున్నాం. అలాగే రెస్టారెంట్లు, రీటైలర్లు, అకాడమిక్ ఇన్‌స్టిట్యూషన్స్‌, కార్పొరేట్ కంపెనీల కోసం యెల్డీ బిజ్‌ను కూడా త్వరలో లాంచ్ చేయబోతున్నాం’’ -లక్ష్మీ దీప 

మార్కెట్ దూకుడు 

మార్కెట్‌ సాండ్‌ మార్కెట్ నివేదిక ప్రకారం 2020 కల్లా ఎన్‌ఎఫ్‌సీ మార్కెట్ విలువ 21.84 బిలియన్ డాలర్లను చేరుతుంది. ఈ మధ్యకాలంలో కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) 20.5కి చేరుతుందని ఏపీఏసీ అంచనా వేస్తోంది. దీనికితోడు ప్రతియేటా ఎలక్ట్రానిక్ వినియోగదారులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్‌ఎఫ్‌సీ చిప్ ఉత్పత్తిదారుల అవకాశాలు మెరుగవుతున్నాయి. ఎన్‌ఎక్స్‌పీ సెమీ కండక్టర్స్, బ్రాడ్‌కామ్ కార్పొరేషన్, ఎస్‌టీ మైక్రో ఎలక్ట్రాన్సిక్స్, మీడియాటెక్, టెక్సాస్ ఇన్‌స్ట్రూమెంట్స్ వంటి సంస్థలు ఈ రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. 

స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్న వారిలో 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న యువకుల్లో ఎక్కువ మంది డిజిటల్ చెల్లింపులకే ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. దీంతో ఈ రంగంలో రోజు రోజుకు అవకాశాలు పెరిగిపోతున్నాయి. ఎన్‌ఎఫ్‌సీ ఆధారిత టెక్నాలజీని ఆవిష్కరిస్తున్న సార్టప్ కంపెనీలకు రోజు రోజుకు పెరిగిపోతున్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారు. పుణెకు చెందిన జిట్ ట్రాకా సొల్యూషన్స్, నోయిడాకు చెందిన మ్యాజిక్‌ట్యాప్, బెంగళూరుకు చెందిన టోన్‌ట్యాగ్ స్టార్టప్ కంపెనీలు ఈ రంగంలో యెల్డీ సాఫ్ట్‌కామ్‌కు గట్టి పోటీనిస్తున్నాయి. వినూత్న ఆలోచనలతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న యెల్డీ సాఫ్ట్‌కామ్ మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని యువర్‌ స్టోరీ ఆకాంక్షిస్తోంది.