లక్ష్యంపై స్పష్టతే విజయానికి మార్గం - సెహ్వాగ్

యువర్ స్టోరీ చీఫ్ ఎడిటర్ శ్రద్ధా శర్మకు ప్రత్యేక ఇంటర్వ్యూతను సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పిన సెహ్వాగ్లక్ష్యంపై స్పష్టత ఉండడం అంత ముఖ్యమా ?ఓటమి ఉత్సాపరసుస్తుందా ?పారిశ్రామికవేత్తలుగా ఎదగాలుకునేవాళ్లు ఏం నేర్చుకోవాలి ?br

లక్ష్యంపై స్పష్టతే విజయానికి మార్గం - సెహ్వాగ్

Friday May 08, 2015,

3 min Read

వీరేందర్ సెహ్వాగ్‌ను కలుసుకోవడం నాకు చాలా కాలం గుర్తుండిపోయే ఘటన. సౌమ్యంగా.. నవ్వు మొహంతో ఉన్న ఆయనను చూస్తే.. విజేతలు ఇలానే ఉంటారేమో అనిపించింది. వాళ్లను వాళ్లు తీర్చిదిద్దుకుని గొప్పవాళ్లుగా మారిన వాళ్లు ఇంతే ప్రశాంతంగా ఉంటారా అనిపించింది.

తన గురించి నేను ముందు ఏవో ఊహించుకున్నా, ఈ మీటింగ్ తర్వాత ఆ అనుమానాన్నీ సమసిపోయాయి. దేశానికి సెహ్వాగ్ ఓ పర్ఫెక్ట్ ఐకాన్, మేడిన్ ఇండియాకు మచ్చు తునక. WOO APPకు నిజంగా ధన్యవాదాలు, లేకపోతే ఎప్పటికీ అతనిని కలుసుకుని ఉండకపోయేదాన్నేమో.

మన దేశపు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌ ముఖాముఖిలో ఇవి కొన్ని ముఖ్యాంశాలు. ప్రస్తుతం ఆయనే ఓ లీగ్‌ను నడిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. పెద్ద పెద్ద కలలను సాకారం చేసుకోవాలనుకునే ప్రతీ పారిశ్రామికవేత్తకూ... ఇక్కడ ఎన్నో సమాధానాలు లభిస్తాయి, ఎందుకంటే నాకూ చాలా విషయాలు తెలిసొచ్చాయి.

image


లక్ష్యాన్ని మించిందిలేదు

నేను స్కూల్లో ఉన్నప్పుడు రోజుకు నాలుగైదు ఆటలు ఆడేవాడిని. అన్నింటిలోనూ మెరుగైన ఆటనే ప్రదర్శించేవాడిని. పదో తరగతికి వచ్చేసరికి ఒకే ఒక్క ఆటపై దృష్టి నిలపాలని నిశ్చయించుకున్నా. అదే క్రికెట్. నా లక్ష్యం, నా శక్తియుక్తులన్నీ ఒకే ఆటపై నిలిపి.. నిత్యం నన్ను నేను మెరుగుపరుచుకోవాలనే నిశ్చయానికి వచ్చాను.

శాయశక్తులూ ధారపోయండి

నేను భారత దేశానికి ఆటడం నిజంగా అదృష్టం, అందులో భాగంగానే నా ఎన్నో కలలు తీరాయి. ఇక్కడ అన్నింటికంటే ముఖ్యం స్పష్టమైన లక్ష్యం. చదువు, ఆటలు... ఆ మాటకు వస్తే మనసుకు నచ్చిన ఏదో ఒకపనిపై మనకు గురికుదరాలి. ఆటగాడు, డాక్టర్, ఇంజనీర్, పారిశ్రామికవేత్త.. ఇలా మనకేం కావాలో మనం ఏం కావాలనుకుంటున్నామో నిర్దిష్టమైన అవగాహన ఉండాలి. అందుకే మీ దృష్టినంతటినీ మీ లక్ష్యంపై కేంద్రీకరించి శాయశక్తులూ ధారపోయండి. అదే మీ గమ్యాన్ని దగ్గరకు చేరుస్తుంది.

ఓటమే ఉత్సాహపరుస్తుంది

మనం మరింత మెరుగయ్యేందుకు ఓటమే దోహదపడ్తుంది. అసలు ఆ ఫెయిల్యూరే లేకపోతే ప్రతీ ఒక్కరూ ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులూ అయ్యేవారేమో (నవ్వుతూ...) ఆత్మపరిశీలన చేసుకుని, మనం మరింత అభివృద్ధి చెందేందుకు మనకో అవకాశం లభిస్తుంది.

నేను ఎన్నోసార్లు ఓటమిపాలయ్యా.. కానీ ఎప్పుడూ అది నన్ను నిరుత్సాహపరచలేదు. నా ఆటతీరును మరింత ఉన్నతంగా మార్చుకునేందుకు దోహదపడింది. నిన్ను నువ్వు ఎలా ఇంప్రూవ్ చేసుకుంటావు... అనే ఒకే ఒక్క ప్రశ్న ఎప్పుడూ నన్ను తొలుస్తూ ఉండేది. అది బ్యాటింగ్, బౌలింగ్ లేదా ఫీల్డింగ్.. రంగమేదైనా కావొచ్చు.

నేను చదువుకునే రోజుల్లో నా తల్లిదండ్రులు కొద్ది సమయం మాత్రమే నన్ను ఆడుకోనిచ్చేవాళ్లు. వాళ్ల ఆలోచన ఏంటంటే చదువు తర్వాత మా నాన్న వ్యాపారాన్ని నేను చూసకుంటానని. అందుకే డిగ్రీ చదివే సమయంలో మూడు,నాలుగేళ్ల సమయం మాత్రమే నా చేతుల్లో ఉండేది. నా ధ్యాసనంతా క్రికెట్ పైనే నిలిపాను. వ్యాపారం చూసుకోవడం నాకు ఇష్టముండేది కాదు. మొదట ఢిల్లీ టీం, రంజీ టీమ్‌ ఆ తర్వాత భారత దేశం తరపున ఆడాను, అది కూడా గ్రాడ్యుయేషన్ పూర్తికాకముందే. గ్రాడ్యుయేషన్ మొదటి ఏడాదిలోనే నేను దేశం కోసం ఆడినప్పటికీ వివిధ కారణాలతో నన్ను పక్కకు తప్పించారు. అది నన్ను చాలా బాధించింది. కానీ నేను మాత్రం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు సాధ్యమైనంత ప్రాధాన్యాన్ని ఇస్తూ.. రాత్రింబవళ్లు కష్టపడ్డాను, తిరిగి భారత టీమ్‌లోకి అడుగుపెట్టాను.

నవ్వు..

'నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటే, నీ తలరాత మారుతుందని' చిన్నప్పటి నుంచి మా నాన్న పదే పదే చెప్పేవారు. అందుకే ఆయన మాటలను నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకున్నాను. ఏ పరిస్థితులు ఎదురైనా, నవ్వును మాత్రం వీడలేదు.

ఇతరుల ఎందుకన్నారో.. ఏమనుకుంటున్నారో.. అనే విషయాలను నేను నా కుటుంబ సభ్యులు పట్టించుకోవడం ఎప్పుడో మానేశాం. మాది చాలా సంతోషకరమైన కుటుంబం. మా కోసం మా తల్లిదండ్రులు ఎంతకష్టపడ్డారో, మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చేందుకు ఎన్ని ప్రయాసలకు ఓర్చారో తెలుసు. మేం ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ల కృషే. అందుకే మాకు ఉన్నదానిలోనే మేము పూర్తి సంతృప్తిగా ఉన్నాం.

పదివేల పరుగుల మైలు రాయిని చేరలేదని, 200 టెస్టు మ్యాచులు ఆడలేదనే బాధ నాకు లేదు. 100 టెస్టులు, 250 వన్డేలు, 8000 పరుగులు చేశాను.. అవి చాలు నేను సంతోషంగా ఉండేందుకు.

నా అదుపులో ఉన్నవాటి గురించే ఆలోచించడాన్ని చిన్నప్పటి నుంచి అలవర్చుకున్నాను. అందుకే నా ఆటను మెరుగుపర్చుకోవడానికి మరింత కష్టపడేందుకే నా దృష్టిని కేంద్రీకరించాను. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని టార్గెట్ చేసేందుకు నిత్యం జిమ్‌కు వెళ్తాను, ధ్యానం, యోగా చేస్తాను. అందుకే ఫాస్ట్ బౌలరా.. స్లో బౌలరా.. అనే ఆలోచన నా మైండ్లో ఉండదు.

ఆరోగ్యకరమైన.. సంతోషమైన జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాను. ఎన్ని కోట్ల రూపాయలు, హోదా ఉన్నా ఆరోగ్యం లేకపోతే అవన్నీ శూన్యం. సంతోషమైన, ఆరోగ్యమైన కుటుంబంలా ఉండాలనేది నా ఆకాంక్ష. అదీ ఓ అఛీవ్‌మెంటే.

చివరగా.. woo app ద్వారా తన ఫ్యాన్స్‌తో ముచ్చటించేందుకు అందుబాటులో ఉంటానని హామీనిస్తూ.. సెలవు తీసుకున్నాడు.