స్టార్టప్ కు మేం సాయం చేస్తాం..

స్టార్టప్ కు మేం సాయం చేస్తాం..

Saturday December 19, 2015,

3 min Read

చిన్న తరహా పరిశ్రమలు, భారతీయ సాంప్రదాయ కళలు లాంటివాటితో వ్యాపారం చేయడమంటే కొద్దిగా రిస్క్. ఆర్ట్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ బిజినెస్ అంటారు. కానీ కళాఖండాలను ఎగ్జిబిషన్ లో పెట్టి సేల్ చేయడం మనకు తెలిసిందే. ఇలాంటి ఐడియాతో ప్రారంభమైందే నేటివ్ దివా. భారతీయ సాంప్రదాయ కళలకు ప్రపంచ స్థాయి మార్కెట్ ఉంది. కానీ సరైన ప్లాట్ ఫాం లేదు. దాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో నేటివ్ దివా పనిచేస్తోంది.

“మాతో కలవాలనుకునే వారు, తమ వ్యాపారం గురించి సంక్షిప్తంగా చెబితే చాలు” నేహా అగర్వాల్

నేహా అగర్వాల్ నేటివ్ దివాకు కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. ఎవరి దగ్గరైనా బిజినెస్ ఐడియా ఉండి దాన్ని చేయగలమనే దీమా ఉంటే చాలు. దానికి కావల్సిన ఆర్థిక, ఇతర మద్దతిస్తామని బరోసా ఇస్తున్నారు నేహా.

image


హోం మేకర్ ని బిజినెస్ మేకర్ చేయలనుకుంటున్నాం

హోం మేకర్ అంటే ఇంట్లో అన్ని బాధ్యతల్ని నిర్వహించే శక్తి. ఇంట్లో ఉండే సమస్యలు మనకి చిన్నవిగా కనిపించొచ్చు. కానీ ఒక్కో సమస్యను విడదీసి చూస్తే అవన్నీ అంత తేలిగ్గా పరిష్కారమయ్యేవైతే కాదు. వాటన్నింటినీ సరైన టైంలో పరిష్కార మార్గాలను చూపించేది ఇంట్లో అమ్మ.

“ఇంట్లో నాన్న సంపాదిస్తే ఇళ్లు బాగుపడుతుంది. అది అమ్మకూడా సంపాదిస్తే పరిస్థితులు మరింత మెరుగు పడతాయి.” నేహా

నేటివ్ దివా స్లోగన్ ఇదే. భవిష్యత్ తరాల కోసం ఆడవారికి ఆర్థిక స్వేచ్చ ఎంతైనా అవసరం ఉంది. దీన్ని కల్పించడానికి నేటివ్ దివా ఓ అవకాశం ఇస్తోంది. ఇంట్లో ఉంటూనే , ఫ్యాషన్, ఈవెంట్స్ ప్లానర్స్ గా రాణించిన వారున్నారు. వారి స్పూర్తితో మరికొంత మందిని తయారు చేయాలనేదే మా టార్గెట్ అంటున్నారు నేహ.

image


అమ్మచెప్పింది

నేటివ్ దివా ఫౌండర్ రాజ్ పల్లపోతు. వారి అమ్మ క్రిమినల్ లాయర్. ఆమె చిన్ననాటి నుంచి కష్టపడి తనని పెంచారని, అమ్మ చూపిన మార్గంలోనే తానీ స్థాయికి చేరుకున్నానని రాజ్ అన్నారు. నేటివ్ దివా కాన్సెప్ట్ ను అమ్మ నుంచి స్పూర్తి పొంది రూపొందించిందే అన్నారాయన. మా సంస్థ ఈరోజిలా మీ ముందుందంటే దానికి కారణం అమ్మే అని ఆయన అంటున్నారు.

“సమాజం నీకేమిచ్చిందో మర్చిపోయి, సమాజానికి నువ్వేమిచ్చావో గుర్తుపెట్టుకో అని అమ్మ చెప్పింది.” రాజ్ పల్లపోతు
image


నా చిన్నతనం నుంచి చూస్తున్నా, అమ్మ ఎన్నో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేది. చాలా మంది అమ్మ చేసిన సాయం గురించి నాకు చెబుతుండే వారు. మా ఇంటికి వచ్చి ఆప్యాయంగా పలకరించి అమ్మ చేసిన సాయం వల్లనే తాము సంతోషంగా ఉన్నామని చెప్పిన ప్రతి సారి నేను స్పూర్తి పొందే వాడినని రాజ్ గుర్తు చేసుకున్నారు.

నేటివ్ దివా పనితీరు

నేటివ్ దివా ప్రధానంగా మగువల్లో ఆంత్రప్రెన్యుర్షిప్ ను ప్రోత్సహిస్తుంది. వారి దగ్గర ఉండే స్కిల్ ని వెలికితీసి దాన్ని మార్కెట్ చేసే బాధ్యతను చేపడుతుంది. టైలరింగ్ లాంటివి ప్రతి ఇంట్లో ఉండే ఆడవాళ్లకు వచ్చిన విద్య. దాని నుంచి కూడా వండర్స్ క్రియేట్ చేయొచ్చు అని నేటివ్ దివా నమ్ముతోంది. ఆడవారికి ఒక ఇమేజి కన్సల్టెన్సి లాగా ఇది పనిచేస్తుంది. దీంతో పాటు ఎవరైనా కాలేజీ పూర్తియన తర్వాత స్టార్టప్ ప్రారంభిచాలంటే తమను కలవాలని నేటివ్ దివా వాళ్లు సలహా ఇస్తున్నారు. ప్రాజెక్ట్ రిపోర్టుతో వస్తే దానికి సీడ్ ఫండింగ్ అందిస్తామని బరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం చాలా సంస్థలతో టై అప్ అయిన ఈ స్టార్టప్ ఇకో ఫ్రెండ్లీ ప్రాడక్టులు, బ్యాగ్స్, ఫ్యూజన్ ఆర్టికల్స్ ని అందిస్తోంది. ఆడవారికి ఇన్ కమ్ జనరేట్ చేసే బిటిబి స్టార్టప్ ఇది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ట్యాలెంట్ ను గుర్తించి వారికి సాయం అందించడమే ప్రస్తుతానికి లక్ష్యంగా పెట్టుకొని కొనసాగుతోంది.

image


నేటివ్ దివా టీం

రాజ్ పల్లపోతు నేటివ్ దివా ఫౌండర్. తెలుగు ఎన్నారై అయిన రాజ్ ఇన్వస్టర్, ఆంట్రప్రెన్యుర్. చార్లెస్ స్టూర్ట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రాజ్ సామ్ సంగ్ వెంచర్స్, సామ్ సంగ్ మొబైల్స్, సామ్ సంగ్ మీడియా సొల్యూషన్స్ అమెరికా లో పనిచేశారు. ప్రస్తుతం కాన్ఫిడెరేషన్స్ బిల్డర్స్ ఫోర్ట్ ఏరియాకు మేనేజ్మెంట్ కన్సల్ట్ టెంట్ గా పనిచేస్తున్నారు. దీంతో పాటు అల్కమీ డెకోర్స్, స్టీల్త్ మోడ్ స్మార్ట్ హెల్త్ కేర్ టెక్నాలజీస్ అండ్ సర్వీస్ సిండికేట్ సంస్థ ల ఫౌండర్ గా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో నేటివ్ దివా ప్రారంభించారు. నేహ అగర్వాల్ ఈ సంస్థకు కో ఫౌండర్ గా ఉన్నారు. 2008లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లైఫ్ సైన్సస్ లో డిగ్రీ పొందారు నేహ. అనంతరం ఆరోగ్యశ్రీ, మైక్రో ఇన్వస్ట్ మెంట్ లాంటి ప్రభుత్వ సంస్థలకు పనిచేశారు. దీంతో పాటు ఇంటీరియర్ డిజైనర్ అయిన నేహా చాలా ఎన్జీఓలతో అసోసియేట్ గా వ్యవహరించారు. ప్రస్తుతం నేటివ్ దివాకు భారత్ లో ఆపరేషన్స్ అన్ని నేహానే చూసుకుంటున్నారు. వీరితో పాటు ఏడుగురు ఉద్యోగులున్నారు. మరో 25మంది ఆఫ్ రోల్ ఉద్యోగులున్నారు.

image


సవాళ్లు

నేటివ్ దివా ప్రధానంగా రెండు సవాళ్లను అధిగ మించాల్సి ఉందని నేహా అంటన్నారు.

  1. టాలెంట్ ను గుర్తించడం అన్నింటికంటే ముఖ్యం. సరైన ట్యాలెంట్ గుర్తించడం ఓ పెద్ద సవాలని నేహా చెప్పుకొచ్చారు.
  2. తమ సంస్థ పూర్తి స్థాయిలో సక్సస్ ఫుల్ గా నడవాలంటే చాలా సంస్థలో కలసి పనిచేయాల్సి వస్తుంది. చాలా పార్ట్ నర్ షిప్ ఏర్పాటు చేసుకోవడం మరో పెద్ద సవాలంటున్నారామె.

భవిష్యత్ లక్ష్యాలు

వచ్చే 4నెలల్లో ముంబై, పుణె, బెంగళూరుల్లో విస్తరించాలని చూస్తున్నారు. అనంతరం అమెరికాలో బ్రాంచీని ప్రారంభించాలనుకుంటున్నారు. సప్లై చెయిన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు. ప్రస్తుతానికి పార్ట్ నర్ షిప్ దశలో ఉంటూనే అన్ని వ్యవహారాలు చేపడుతున్న నేటివ్ దివా మాల్స్ , హోటల్స్ కు కస్టమైజ్డ్ బ్యాగ్స్ లను అందించాలని, దానిలో సరికొత్త బ్రాండ్ క్రియేట్ చేయాలని ఆలోచిస్తోంది.

“వ్యాపారం అంటే సంపాదన ఒక్కటే కాదని. వ్యవస్థను స్థాపించడమని ముగించారు నేహ”