యమా ఫాస్ట్‌గా కారు వాష్ -అదీ 3 లీటర్ల నీటితోనే !!

మోటార్ ఇండస్ట్రీలో వినూత్న స్టార్ట్ అప్అవసరమైతే ఇంటి దగ్గరకే వచ్చి కార్ సర్వీసింగ్ఆర్నెల్లలో ఆరు ఫ్రాంచైజీలు ప్రారంభించిన జస్మీత్ సింగ్

0

చిన్నచిన్న సంఘటనలే కావొచ్చు. కానీ అవి వారి జీవితాల్లో పెను మార్పులు తీసుకొస్తాయి. జస్మీత్‌సింగ్‌ ఆలోచనే అందుకు ఉదాహరణ. ఒకసారి జర్మనీలో మన కథానాయకుడు ఓ రోజు హైవేపై వెళ్తున్నాడు. ప్రతి పదినిమిషాలకు ఓసారి.. అంటే దాదాపు ప్రతి 12మైళ్లకు ఒక వెహికల్ వాటర్ సర్వీసింగ్ సెంటర్ ఉండటం కన్పించింది. ఆశ్చర్యం -ఆలోచన కలగలిశాయి. దీన్నే గొప్ప ఇండస్ట్రీగా ఎందుకు మార్చుకోకూడదు. వచ్చిన ఐడియా ఒక పట్టాన ఉండనీయలేదు. ఇండియా తిరిగి వచ్చాడు.  

వాస్తవానికి నిట్‌లో చదువుతున్నప్పుడే ఈ ఐడియా ఉంది. అదికాస్తా జర్మనీకి వెళ్లినప్పుడు బలంగా నాటుకుంది. పుష్పీందర్ సింగ్ అనే మరో స్నేహితుడు తోడయ్యాడు. స్టార్టప్ మొదలైంది. పుష్పీందర్ కు వేరే వ్యాపారాల్లో ఉన్న 15 ఏళ్ల అనుభవం ఈ స్టార్టప్‌కు బాగా ఉపయోగపడింది.

లివ్ ఇండియా గ్రూప్. స్పీడ్ కార్ వాష్ అండ్ కోజీ కార్స్ సర్వీస్. లూథియానాలో ప్రారంభమైంది. పేరుకు తగ్గట్లుగానే కస్టమర్లు ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. పని యమా స్పీడుగా అవుతుంది. పైగా ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ నీళ్లు కూడా అవసంర లేదు. జస్ట్‌ మూడు లీటర్లుంటే చాలు. కారు తళతళా మెరిసిపోతుంది. వేరే చోట అయితే కార్‌ వాషింగ్ అనేది పెద్ద ప్రహసనం. కారు ఇవ్వడం వరకే మనపని. పని ఎప్పుడు అవుతుందో తెలియదు. ఇచ్చినప్పుడే తీసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం కేవలం పది నిమిషాల్లో పని పూర్తవుతుంది. టీ తాగినంత సేపట్లో కార్ వాష్ చేస్తున్నారంటే ఎవరు మాత్రం క్యూ కట్టరు చెప్పండి! ఆటోమేటిగ్గా గిరాకీ పెరిగింది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే.. కోజీ కార్స్ మొబైల్ కార్ సర్వీసింగ్ కావడంతో.. డోర్ డెలివరీ కూడా ఉంది. అంటే ఇంటి దగ్గరకే వచ్చి సర్వీసింగ్ చేస్తారన్నమాట. ఒక్క కార్ల క్లీనింగే కాదు. డోర్స్, సీట్లు, టైర్ల సర్వీసింగ్ కూడా తక్కువ టైమ్ లో చేసిస్తారు. అంత ఫాస్ట్ ఉంది కాబట్టే వ్యాపారం మొదలు పెట్టిన ఆర్నెల్లలోనే ఆరు ఫ్రాంచైజీలు ప్రారంభించగలిగారు.

స్పందన అద్భుతం

ఆదాయం బాగుంది. రిపీటెడ్ కస్టమర్లున్నారు. ఫ్రాంచైజీలు బాగా పనిచేస్తున్నాయి. నిజానికి ఇండియాలో 3 కోట్ల 50 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. వాటికి రెగ్యులర్ సర్వీసింగ్ మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆటో మొబైల్ మార్కెట్ మనదని.. వచ్చే పదేళ్లలో ఇది మూడో స్థానానికి చేరుతుందంటారు జస్పీత్. కాబట్టి భవిష్యత్తులో తమ మార్కెట్ ఇంకా బావుంటుందనే అంచనాతో ఉన్నారిద్దరు.

ఇక రేట్ల విషయానికొస్తే ఒకసారి కారు వాష్ చేస్తే 1200 రూపాయలనుంచి 1500 రూపాయల వరకూ వసూలు చేస్తారు. అలా రోజుకూ పది నుంచి పన్నెండు కార్ల వరకూ సర్వీస్ చేస్తారు. వీకెండ్ లో మాత్రం 30 కార్లకు చేయాల్సి వస్తోంది. కోజీ కార్ మొబైల్ సర్వీసింగ్ తో రోజూ వీకెండ్ లానే ఉందని జస్పీత్ చెప్తున్నాడు. ప్రస్తుతానికి కోయంబత్తూరు, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో లివ్ ఇండియా గ్రూప్ స్పీడ్ కార్ వాష్ ప్రాంఛైజీలు నడుస్తున్నాయి. త్వరలోనే మిగిలిన ప్రాంతాలకు విస్తరించాలని లివ్ ఇండియా గ్రూప్ ఆలోచిస్తోంది. కాకపోతే కొంత టైం పడుతుంది.

i like extensive reading. తెలుగు భాష అంటే ఎనలేని ప్రేమ. ఎక్కువ చదువుతాను..ఎక్కువ రాయడానికి ఇష్టపడతాను..

Related Stories

Stories by anveshi vihari