అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుంటేనే అనుకున్న లాభాలు..

అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుంటేనే అనుకున్న లాభాలు..

Tuesday March 22, 2016,

2 min Read


ఇదంతా స్టార్టప్ శకం. తొందరగా ఎదిగేందుకు స్టార్టప్ కంపెనీలు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ముఖ్యంగా నిమ్న వర్గాలను టార్గెట్ గా చేసుకుని ప్రాడక్ట్ లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఐడియాతో కొన్ని సంస్థలు సక్సెస్ అయ్యాయి. ఒక్క కిందిస్థాయి వర్గాలనే టార్గెట్ చేసుకుంటేనే ఎదగలేమని, అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు ప్రణత్ భడాని. బాంబే ఐఐటీ పూర్వ విద్యార్థి అయిన ప్రణత్ యువ ఆంట్రప్రెన్యూర్ల కోసం కొన్ని విలువైన సలహాలు ఇస్తున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే..

ఇటీవలే నేను ఓ ఆర్టికల్ చదివాను. కొత్త తరం స్టార్టప్ కంపెనీలు తమ జీవితాలను మార్చుకునేందుకు నిమ్న స్థాయి వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని. అందుకు ఉదాహరణ, ఓలా, రోడ్ రన్నర్ వంటివి కింది స్థాయి ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నాయని. ఇలాంటి స్టార్టప్ సంస్థలు ఇచ్చే మంచి శిక్షణ, అవకాశాల వల్ల వేలాది మందికి ఉపాధి లభించిన విషయం వాస్తవమే. అయితే ఈ మార్పు అగ్రస్థానంలో లేదా, మధ్య స్థాయిపై దృష్టి కేంద్రీకరించడం వల్ల వచ్చింది. కిందిస్థాయిపై కేంద్రీకరించడం వల్ల కాదు.

స్పష్టంగా ఉండండి

ఆర్థికంగా వెనుబడిన అంశాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. విలువల సృష్టికి (వాల్యూ క్రియేషన్) భారీ ఆస్కారం ఉంటుందని ఇది సూచిస్తుంది. అయితే విలువలను సృష్టిస్తే సరిపోతుందా? అందులో ఉన్న కొన్ని విలువలను మనం కూడా పాటించాల్సి ఉంటుంది. మంచిని నడిపించే స్థిరమైన సంస్థలను నడిపించాల్సి ఉంటుంది.

image


అంటే స్థిరమైన కంపెనీలేవీ పేదల సమస్యలు తీర్చడం లేదని కాదు. వెనుకబడిన ప్రజల నిజమైన సమస్యలను తీరుస్తూనే లాభదాయకమైన కంపెనీలను సృష్టించాలి. ఇందుకోసం లాభాలు, విలువలు అనే సన్నటి గీతపై నడవాల్సి ఉంటుంది. కొన్నేళ్ల క్రితం మైక్రో ఫైనాన్స్ కంపెనీలు ఈ గీతను దాటాయి. 30% వడ్డీ రేట్లు వేయడం ప్రారంభించాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీంతో చాలా కంపెనీలు మూతపడ్డాయి.

అంటే ప్రభుత్వం, లేదా ఎన్జీవో సంస్థలే పేదల సమస్యలు తీర్చాలన్నది ఉద్దేశం కాదు. డబ్బు సంపాదించడమా, లేదా పేదలపై ప్రభావం చూపడమా అన్న అంశంపై మరింత స్పష్టంగా ఉండాలి. ఉత్పత్తి చేసిన ప్రాడక్ట్ కిందిస్థాయికి కూడా చేరుకుంటే మీ వ్యాపారానికి తిరుగుండదు.

ఉదాహరణకు హెల్త్ కేర్ రంగంలో నారాయణ హృదయాలయను తీసుకోండి. తక్కువ ఖర్చుకే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నది. అందుకే ధనికులు కూడా ఈ హాస్పిటల్ లో చికిత్స చేయించుకునేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. సర్జరీ జరిగిన తర్వాత పేషంట్ ఉండే ప్రైవేట్, షేరింగ్, జనరల్ వార్డుల్లో ఒక్కో డిపార్ట్ మెంట్ లో ఒక్కవిధంగా రూమ్ రెంట్ ఉంటుంది. సర్జరీ అందరికీ ఒకే విధంగా ఉంటుంది. ఇలాంటి అంచెల విధానం కారణంగానే ఆస్పత్రులు తక్కువ ధరకే పేదవారికి వైద్యాన్ని అందించగలుగుతాయి.

ఐఐటీ జేఈఈకి పేదలకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారే అనుకుందాం. ఇదే సమయంలో ధనిక విద్యార్థికి అవసరమైన ఫ్యాకల్టీని, పాఠ్యాంశాలను ఇవ్వగలుగుతామా? పేదలకే సేవ చేయాలని అనుకున్నప్పుడు ఇదంతా సాధ్యమవుతుందా?

అదే విధంగా గ్రామీణ ప్రాంత ప్రజలపైనే దృష్టిపెడితే బ్యాంకులు బతికి బట్టకట్టలేవు. (ఎక్కువ శాతం బ్యాంకులు తమ డబ్బును గ్రామీణ బ్రాంచుల ద్వారానే కోల్పోతాయి).

పట్టణ ప్రాంతాల్లో పటిష్ఠమైన నెట్ వర్క్ కలిగి ఉంటేనే, గ్రామీణ ప్రాంతాల్లో నష్టాలు వచ్చినా బ్యాంకులు నెగ్గుకు రాగలుగుతాయి.

కిందిస్థాయి ప్రజలపై దృష్టిసారిస్తే మంచి ప్రభావం చూపగలిగే మాట నిజమే అయినప్పటికీ, మంచి విలువైన కంపెనీగా ఎదగాలంటే మాత్రం ఆర్థిక అడ్డగోడలను బద్దలు కొట్టి, పేదలతోపాటు ధనవంతులకూ దగ్గర కావాలి. అప్పుడే మంచి కంపెనీగా ఎదగగలుగుతాం. యువ పారిశ్రామికవేత్తలు లీలా రమణి సూచనలను పాటిస్తారని యువర్ స్టోరీ ఆశిస్తోంది.

(ఈ స్టోరీలో చెప్పిన అంశాలు రచయిత, ఆంట్రప్రెన్యూర్ హెర్ష్ లీలా రమణి వ్యక్తిగత అభిప్రాయాలు. వాటిని యువర్ స్టోరీ అభిప్రాయాలుగా భావించొద్దని మనవి)