గాలికి ఎగిరొచ్చిన చింపి కాగితం జీవిత గమనాన్ని మార్చింది

రెండో ప్రపంచ యుద్ధ సైనికుడి కారణంగా పుట్టుకొచ్చిన కార్టూనిస్ట్గాలికి ఎగిరొచ్చిన మిక్కీ మౌస్ కాగితం మలుపుతిప్పిందిఫుట్ పాత్ నుంచి లైఫ్ టైం అఛీవ్‌మెంట్ స్థాయికి ఎదిగిన ఆబిద్ సుర్తిదేశంలో కామిక్ సిరీస్‌లకు వన్నెతెచ్చిన వైనంకార్టూనిస్ట్,రచయితగా ఎంతో పేరు

గాలికి ఎగిరొచ్చిన చింపి కాగితం జీవిత గమనాన్ని మార్చింది

Thursday April 16, 2015,

3 min Read

పెద్దింటి కుటుంబంలో పుట్టి అనుకోని కారణాలవల్ల ఫుట్‌పాత్‌ల తన జీవితాన్ని గడిపిన ఆబిద్ సుర్తి, ఈ రోజు జాతీయ అవార్డులు అందుకున్న ప్రముఖ రచయిత, కార్టునిస్ట్ మరియు కళాకారుడు కూడా. ఇటీవల ‘కామిక్ కాన్’ ఆయనను జీవితసాఫల్య పురస్కారంతో సత్కరించింది. ‘బహాదుర్’ కామిక్ సిరీస్ ఆబిద్‌కు అనుకోని ప్రఖ్యాతిని తెచ్చిపెట్టంది. ఇవన్నీ కాకుండా ఆయన ఓ నవల రచయిత, నాటక రచయిత, మరియు పర్యావరణవేత్త కూడా. నీళ్ల పరిరక్షణ కోసం “డ్రాప్ డెడ్’’ పేరుతో ప్రచార కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు.

తన ఫ్యాన్స్‌తో ఆబిద్ సుర్తి

తన ఫ్యాన్స్‌తో ఆబిద్ సుర్తి


1943లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో, ముంబయి ఓడరేవు నుండి వీటీ స్టేషన్ వరకు రైళ్లు తిరుగుతుండేవి. ఆ రైళ్లలో ప్రపంచ యుధ్ధానికి వెళ్తున్న సైనికులను తీసుకెళ్లే వారు. అప్పట్లో రైలును విచిత్రంగా చూస్తూ దానివెంట పరిగెత్తే పిల్లలకు వాళ్లు పాత బట్టలు, చాక్లెట్లు, బిస్కెట్లు, సగం తిన్న సాండ్‌విచ్‌లను విసిరే వారు. వాటి కోసం ఎగిరిమరీ పోటీపడేవాళ్లమని తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు ఆబిద్. 

అలా "ఓ రోజు మిక్కీ మౌజ్ కామిక్ పుస్తకాన్ని చదువుతున్న సైనికుడు మాపై ఆ పుస్తకాన్ని విసిరేసాడు, అందులో నుంచి నాపై పడ్డ ఓ పేజీ నన్ను కార్టునిస్ట్ గా తయారుచేసిందని అంటున్నారు" ఆబిద్.

అపట్లో కామిక్ పుస్తకాలు దేశంలో ఎక్కడా కనిపించేవి కావు. అదో వింతగా, కొత్తగా అనిపించినా... వాటిని వేయడం పెద్ద కష్టమేమీ కాదని అనుకున్న ఆబిద్, అప్పటి నుండే వాటిని కాపీ కొట్టడం ప్రారంభించారు. మెల్లిగా వాటి టెక్నిక్ అర్ధం చేసుకున్నఆయన తన సొంత కార్టూన్లను వేయడం ప్రారంభించారు.

ఇక ఆయన ప్రతిభను గమనించిన కొంతమంది వాటిని విక్రయిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. కాని వాటిని ఎలా అమ్మాలో తెలియని ఆబిద్ కు ఓ మంచి అవకాశం దొరికింది. స్కూళ్లో స్కౌట్స్ బాయిగా ఉన్న సమయంలో ఏదైన విక్రయించి సంపాదించాలన్న కార్యక్రమంలో పిల్లలంతా పాల్గొనే వారు. కొంత మంది బూటు పాలిష్ చేస్తే మరికొంత మంది పూవులు అమ్మే వారు. అయితే ఆబిద్ మాత్రం తను వేసిన కార్టున్లను అమ్మాలని అనుకున్నారు. దగ్గర్లో ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతికా కార్యాలయానికి వెళ్లి నేరుగా ఎడిటర్‌కే తను వేసిన కార్టున్లను చూపించారు. వాటిని చూసిన ఆ ఎడిటర్ మొహంపై చిరునవ్వు చూడగానే నా కార్టున్లు కొన్నట్టే అనిపించిందంటున్నారు ఆబిద్. ఇక అప్పటి నుండి కార్టున్లు వేయడం ఆబిద్ సుర్తికి జీవనోపాధిగా మారింది.

image


రచయితను తయారుచేసిన ప్రేమ వైఫల్యం...

కాలేజ్‌లో ఆబిద్ ప్రేమ వైఫల్యం ఆయనలోని రచయితను బయటపెట్టింది. అయితే తన ప్రేమ వ్యవహారాన్ని చెప్పుకోలేకపోయిన ఆబిద్, తన భావాలను రచనల రూపంలో పెట్టేవారు. ఆ ప్రయత్నంతోనే ఆయన తొలి రచన ‘టూటే హుఏ ఫరిష్తే’ రాయగలిగారు. ఇక ఆ రోజుల్లో ముంబయిలోని ఓ చిన్న ఇంట్లో ఉంటున్న ఆబిద్ నుండి పెద్ద సంఖ్యలో పేపర్ల రద్దీని గమనించాడు చెత్త పేపర్లు అమ్ముకునే వ్యాపారి. అయితే అతనికి పబ్లిషర్లతో ఉన్న సంబంధాల కారణంగా ఆబిద్ తొలి నవల స్వాతి ప్రకాష్ ద్వారా హిందీ, గుజరాతీ భాషల్లో ప్రచురితమైంది.

అప్పటి నుండి రచనలు కూడా ఆబిద్ సుర్తికి ఓ ఆదాయమార్గంగా మారింది. ఏది క్రియేటివ్‌గా కనిపించినా వాటిని ప్రయత్నించడం ప్రారంభించారు ఆబిద్. అలా మొదలు పెట్టిన ఆబిద్ ఈ రోజు 45 నవలలు, ఏడు నాటకాలు, పది షార్ట్ స్టోరీలు రాసారు.

ఆయన కధలను అనేక మ్యాగజీన్లు, న్యూస్ పేపర్లు ప్రచురించినప్పటికీ, ‘తరంగా’ మ్యాగజీన్ ఎడిటర్ ఆయన మిత్రుడు కావడంతో వరుస నవలలు ఆ మ్యాగజీన్లో రాయగలిగారు.

అవార్డులకు వయస్సుతో పనిలేదు

అవార్డులకు వయస్సుతో పనిలేదు


ఆబిద్ రచనలకు సహాయపడ్డ సినిమా రంగం...

జీవనోపాధి కోసం ఆబిద్ సినిమా రంగంలో స్పాట్ బాయిగా కూడా పని చేసారు. కాలేజ్‌లో చదువుతూ, పార్ట్ టైమ్ జాబ్‌గా ఈ రంగం ఆయనకు మంచి అవకాశంగా మారింది. ''ఓ రోజు షూటింగ్ సమయంలో శుభాష్ బాబు పుస్తకాన్ని చదువుతున్న నన్ను చూసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆశ్చర్యపోయారు. నేను రచయితనని తెలుసుకున్న ఆయన నన్ను అసిస్టెంట్ డైరెక్టర్‌ని చేసారు. మెల్లిగా స్ర్కిప్ట్ రైటర్‌గా ఆ తరువాత సినిమా ఎడిటర్‌గా మారాను. సినిమా ఎడిటింగ్ కారణంగానే కధ సారాంశంతో పాటు, ఆ కధలో ఓ సీన్ నుండి మరో సీన్ వైపు ఏ విధంగా తీసుకెళ్లాలో నేర్చుకున్నానంటారు'' ఆబిద్.

సినిమా రంగంలో స్ర్కిప్ట్ రైటర్‌గా పని చేసిన ఆబిద్, పాఠకులను మొదటి పది పేజీల్లో ఎలా ఆకట్టుకోవాలో నేర్చుకున్నారు. సినిమా మొదటి పది నిమిషాల్లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతే ఆ సినిమా చేయిజారినట్టే అంటారు ఆబిద్.

‘బహదూర్’ రుపకల్పన...

1960-70 శకంలో పెద్దగా మన దేశంలో ఇండియన్ కామిక్స్ లేదా క్యారెక్టర్లు లేవు. కాని వివిధ పబ్లిషర్లు మాత్రం వాటి కోసం ఎదురుచూసే వారు. అదే సమయంలో దేశంలో బందిపోట్ల కార్యకలాపాలు జోరుగా సాగేవి. వారిపైనే ఎందుకు ఆలోచించకూడదనుకున్న ఆబిద్, చంబల్ ప్రాంతాన్ని పర్యటించారు. బాధితులను కలవడంతో పాటు, బందిపోట్ల పనితీరు తెలుసుకున్నారు. అదే సమయంలో ఆ బందిపోట్ల ఫ్యాన్స్‌ని కూడా కలిసారు.

ఈ విషయంపై అధ్యాయనం చేసిన ఆబిద్, ‘’బందిపోట్లు చిన్న చిన్న సహాయాలు చేసి గ్రామస్తులకు దగ్గరయ్యేవారు, ఆ విధంగానే వారికి తిండి, ఉండటానికి చోటు కూడా దొరికేది’’. ఇక గ్రామాల్లో పోలిసులు, జమీందార్ల ఆకృత్యాల కారణంగా చాలా మంది బందిపోట్లుగా మారినట్టు గమనించారు ఆబిద్.

అదే సమయంలో బందిపోట్లపై తరుణ్ కుమార్ భాదురీ రాసిని పుస్తకం ఆబిద్ సుర్తికి సహాయపడింది. ఆ బుక్ సహకారంతో ‘బహదుర్’ కామిక్ సీరీస్‌ని నడపగలిగారు ఆబిద్ సుర్తి. కామిక్ ఇండస్ట్రీపై పెరుగుతున్న మోజు గురించి స్పందించిన ఆబిద్, ఇప్పుడున్న రచయితలకు, కార్టునిస్టులకు గ్రాఫిక్స్‌తో పాటు, టెక్నాలజీ ఎంతో సహాయపడుతోందని అంటున్నారు. ఇక ఈ కాలం రచయితలకు ఆయన ఇచ్చే సలహా, స్ర్కిప్ట్ రైటింగ్ ద్వారా పాఠకులను ఎలా ఆకట్టుకోవాలో నేర్చుకోవాలంటారు ఆబిద్ సుర్తి.

image