పత్తిరైతుల పాలిట ఆపద్బాంధువులు ఈ కుర్రాళ్లు

పత్తిరైతుల పాలిట ఆపద్బాంధువులు ఈ కుర్రాళ్లు

Saturday August 05, 2017,

1 min Read

రైతు గురించి చాలామంది చాలా చెప్తారు. కానీ వాళ్ల కష్టాలను పంచుకునే వారు కొందరే వుంటారు. ఎగిరే విమానాలు.. ఏఢంకెల జీతాలు.. వీటిని మాత్రమే కలగనే యువతలో చాలా అరుదుగా అన్నదాత గురించి ఆలోచిస్తారు. అలాంటి కోవలోకి వస్తారు అనిల్, శరత్.

image


పత్తిచేను కత్తిదూస్తే మేమున్నామంటూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. తాము తీసుకున్న నిర్ణయం వరంగల్ జిల్లాలో 50 మంది పత్తిరైతులకు భరోసా కలిగించిందంటే.. వాళ్లనే నమ్మలేకుండా చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎనబావికి చెందిన ఆ ఇద్దరు కుర్రాళ్లే అనిల్ కుమార్, శరత్.

40వేల ఆర్గానిక్ టీ షర్ట్స్. మూడువేల మంది రైతులు. నమ్మశక్యం కాలేదు. పత్తి రైతులకు చేయూతనివ్వడం కోసం ఇద్దరు మిత్రులు ఏర్పాటు చేసిన గ్రామీణ వికాస కేంద్రం ఇంతటి విజయస్ఫూర్తి రగిలిస్తుందని ముందు ఊహించలేదు.

విజయనగరం జిల్లా కొత్తవలస, చింతలపాడు గ్రామం నుంచి ప్రయాణం మొదలైంది. యాభై మంది పత్తి రైతులో స్టార్ట్ చేశారు. వారి నుంచి కాటన్ సేకరించి తిరుప్పూర్ లో టీ షర్టులు తయారుచేయించారు. టీ ఫర్ చేంజ్ పేరుతో తయారైన టీ షర్టులు నెదర్లాండ్స్ లో కూడా అమ్ముడయ్యాయి. అమెరికా, కొన్ని యూరోపియన్ దేశాలు కూడా వీరి టీ షర్టులు కొనేందుకు ఆసక్తి చూపించాయి. ఏపీ ప్రభుత్వ సలహాదారు టీ విజయ్ కుమార్ చొరవతో వీరి ప్రయత్నం మరింత ముందుకు సాగుతోంది.

సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలో రైతులకు చెప్పడమే కాదు.. దానివల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరిస్తారు. నీటి వాడకం ఎంత మేరకు తగ్గించవచ్చో ప్రాక్టికల్ గా చేసి చూపించారు. ఎకరానికి 15వేల నుంచి 20 వేలు వరకు అయ్యే పెట్టుబడిని ఐదువేలకు తగ్గించలిగారు.

గత ఏడాది 341 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అయింది. అయితే ఈ ఏడాది కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు అంతకంటే ఎక్కువ వస్తుందని నమ్మకంతో ఉన్నారు.