వద్దనుకున్న టికెట్లను ఆన్ లైన్లోనే అమ్మేసే సూపర్ ఐడియా  

రెడీగా ఉన్న పదివేల కోట్ల మార్కెట్  

0

గీతిక, రితీష, నందన్, మాధవ్ సినిమాకు వెళ్లాలనే ప్లాన్ వేసుకున్నారు. రెండ్రోజుల ముందే పీవీఆర్ లో టికెట్స్ బుక్ చేసుకున్నారు. అయితే తీరా టైంకి రితీష బెంగళూరుకి వెళ్లాల్సి వచ్చింది. గీతిక వాళ్లింట్లో అనుకోకుండా రెలిటివ్స్ వచ్చారు. సమయానికి ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో మాధవ్ డ్రాపయ్యాడు. దాంతో నందన్ నారాజ్ అయి తను కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. సో నాలుగు టికెట్లు ఉండిపోయాయి. కూకట్ పల్లినుంచి పంజాగుట్టకు వచ్చి, పీవీఆర్ బాక్సాఫీస్ దగ్గర నిలబడి, ఆ టికెట్లను ఎవరికైనా అమ్మేసి రావడమనేది వ్యయప్రయాస. ఫలితంగా రూ. 600 వట్టి పుణ్యానికి లాస్.

అలా కాకుండా మనం ఉపయోగించని టికెట్లను నిమిషాల్లో ఉన్నచోటు నుంచే వేరొకరికి అమ్మే వెసులుబాటే ఉంటే ఎలా వుంటుంది? సింగిల్ క్లిక్ ద్వారా వోచర్ రీ సేల్ చేసే అవకాశమే ఉంటే ఎంత బావుంటుంది? మనం పెట్టిన డబ్బులు తిరిగి మన జేబులోకి వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది?

సరిగ్గా ఈ కాన్సెప్టు మీదనే వర్కవుట్ చేసి సక్సెస్ అయ్యాడు నవీన్ ధన్ గోపాల్. ఆ ఐడియా పేరు కెన్ సెల్ (Cansell). లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిన టికెట్లను అమ్మిపెట్టే ప్లాట్ ఫాం. అంటే ఎరికైనా చివరి నిమిషంలో టికెట్ క్యాన్సిల్ అయితే, ఈ వేదిక ద్వారా ఆ టికెట్ ని వేరొకరితో ఎక్స్ ఛేంజ్ చేసుకోవచ్చన్నమాట. అది సినిమా టికెట్ గానీ, ఈవెంట్ వోచర్ గానీ, బస్సు, రైలు టికెట్ గానీ. మన డబ్బులు తిరిగొచ్చినట్టూ ఉంటుంది.. సేమ్ టైం.. వేరొకరికి సాయం చేసినట్టూ ఉంటుంది. రెండువైపులా లాభం. ధన్ గోపాల్ కి ఈ ఐడియా మొన్ననే అంటే, జనవరి 2న వచ్చింది.

ప్రయాణం అంటేనే ఒక్కోసారి అనుకోకుండా జరుగుతుంది. ప్లాన్ ప్రకారమూ ఉంటుంది. ఈ రెండు కేటగిరీల్లో ఉండే జర్నీలో.. టికెట్ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. అలాంటి సమస్యకు కెన్ సెల్ లైఫ్ లైన్ మాదిరి పనిచేస్తుంది.

ఇప్పటివరకైతే కెన్ సెల్ ఫ్రీ ప్లాట్ ఫాం. భవిష్యత్తులో ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్లు, డ్రాప్ బాక్సుల రూపంలో పెయిడ్ సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నారు. ప్రస్తుతానికిది సెల్ఫ్ ఫండెడ్ వెంచర్. మార్కెట్ రెస్పాన్స్ బట్టి స్టెప్ ముందుకు వేయాలని చూస్తున్నారు.

మార్కెట్ సైజ్ ఎలా వుందంటే..?

ఓవరాల్ టికెటింగ్ మార్కెట్ విలువ రూ. 79వేల కోట్లు. అందులో టికెట్ క్యాన్సిలేషన్ 9శాతం. అంటే రూ. 7,110 కోట్లు. వోచర్ మార్కెట్ వాల్యూ రూ. 9వేల కోట్లు. అందులో ఉపయోగించని వోచర్ 30 శాతం దాకా ఉంటుంది. దాని విలువ రూ. 3వేల కోట్లు. సో, ఈ లెక్కన అన్ యూజ్డ్ టికెట్స్, వోచర్ల మార్కెట్ కలిపి ఎంతలేదన్నా రూ. పదివేల కోట్లకు పైమాటే. అంటే ఆ పదివేల కోట్లు.. రెడీగా ఉన్న మార్కెట్ అన్నమాట.

ప్రస్తుతానికి ఈ స్టార్టప్ సినిమా టికెట్లు, ఈవెంట్ వోచర్లు, బస్సు, జనరల్ కేటగిరీల్లో ఉంది. మున్ముందు టికెటింగ్ పోర్ట్ ఫోలియోలు పెంచాలని చూస్తున్నారు. హోటల్స్, ఎయిర్ లైన్స్ వంటి సేవలన్ని లైన్లోకి తేవాలని భావిస్తున్నారు.

వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Stories

Stories by team ys telugu