విదేశీ టూర్లు కలకాలం గుర్తుండేలా చేసే 'ఫోర్క్ మై సిటీ'

వెకేషన్ అంటే ఎంజాయ్‌మెంట్తేడా వస్తే ఎందుకొచ్చామా అనుకోవాల్సిందే..చివరి నిమిషంలో ప్లాన్ చేసుకున్నా...ప్రయాణం పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దుతామంటున్న ఫోర్క్ మై సిటీ

విదేశీ టూర్లు కలకాలం గుర్తుండేలా చేసే 'ఫోర్క్ మై సిటీ'

Sunday May 31, 2015,

4 min Read

“ఈ ప్రపంచంలో విదేశీ ప్రదేశాలుండవు. అక్కడ ప్రయాణించేవారే విదేశీయులు”- రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్
image


ప్రతీ ఒక్కరూ ఒకసారైనా లాంగ్ టూర్‌కి వెళ్లాలని కోరుకుంటారు. రిలాక్స్ అవడానికి, జీవితంలో రిఫ్రెష్ అవడానికి వెకేషన్స్ బాగా ఉపయోగపడతాయి. ఎంజాయ్ చేయడానికి ప్రయాణాల కంటే బెస్ట్ ఏదీ లేదనే విషయాన్ని చాలామంది ఒప్పుకుంటారు. అయితే వీటిలో అనేకసార్లు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఎక్కువమంది ఆయా ప్రాంతాల ఆహారాలను, అనుభవాలను రుచి చూసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే కొంత మంది మాత్రం ఎక్కడికి వెళ్లినా తమకు నచ్చిన ఆహారం, అలవాట్లే ఉండాలని కోరుకుంటారు. కానీ చివరి నిమిషంలో ప్లానింగ్ చేసుకునేవాళ్లకు... ముఖ్యంగా విదేశీ టూర్లకు వెళ్లేవారికి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. చాలామందికి మంచి వెకేషన్లను సమస్యల కారణంగా పాడుచేసుకున్నామనే భావన కలుగుతుంది. ఫోర్క్ మై సిటీ ఇలాంటి వారినే టార్గెట్ చేసుకుంది.

ఫోర్క్ మై సిటీ వెనుక ఆలోచన

ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు... ఇక్కడి వసతులు, సౌకర్యాలు, ఆహారం, స్పా, నైట్ క్లబ్స్ వంటి వాటిని అందించే మొదటి మార్కెట్ ప్లేస్ ఫోర్క్ మై సిటీ. వివిధ నగరాల్లో ప్రయాణాల్లో రోజువారీగా అవసరమైన వాటిని సెర్చ్ చేసుకుని, ప్లానింగ్, బుకింగ్ చేసుకునే అవకాశాన్ని టూరిస్టులకు కల్పిస్తుంది ఫోర్క్ మై సిటీ.

ప్రస్తుతం విమాన టికెట్ బుకింగ్స్‌లో 75 శాతం ఈ-కామర్స్ రంగమే ఆక్రమించింది. ఇందులో 70శాతం డొమెస్టిక్ సర్వీసులే. అలాగే 40శాతం అంతర్జాతీయ హోటల్స్ బుకింగ్ కూడా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి. దీన్ని పరిశీలించిన నకుల్ భాటియా.. ఈ రంగంలో భవిష్యత్తును ముందుగానే అంచనా వేసుకున్నానని చెబ్తారు. ఆయా నగరాల్లో సేవలు, ఉత్పత్తులకు సంబంధించినదే ఈయన ప్రారంభించిన లాస్ట్ మైల్. దానికి ఆయన పెట్టిన పేరు ఫోర్క్‌మైసిటీ.కాం.

నకుల్ భాటియా, సిఈఓ ఫోర్క్ మై సిటీ

నకుల్ భాటియా, సిఈఓ ఫోర్క్ మై సిటీ


ఫోర్క్ మై సిటీ వెనుక ఉన్న టీం

ఫోర్క్ మై సిటీకి నకుల్ భాటియా వ్యవస్థాపకులు - సీఈఓ. ట్రావెల్ ఇండస్ట్రీపై ఈయనకు తగని మోజు. ఈ రంగానికి సంబంధించి రిటైల్, హోల్‌సేల్ విభాగాల్లో 12 ఏళ్లకు పైగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో విధులు నిర్వహించారు. దీంతో వాణిజ్యం, మీడియా, అనుబంధ రంగాలకు సంబంధించి విశేష అనుభవం లభించింది. గతంలో ఈయన అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఈబుకర్స్.కాంలలో కూడా పని చేశారు. మొత్తం ఈయన కుటుంబంలోని వారందరికీ కలిపి ట్రావెల్ పరిశ్రమలో 50ఏళ్ల అనుభవం ఉండడం విశేషం.

నితిని భాటియా, సిఓఓ ఫోర్క్ మై సిటీ

నితిని భాటియా, సిఓఓ ఫోర్క్ మై సిటీ


నితిన్ భాటియా... యూకే ట్రావెల్ మార్కెట్‌లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రొఫెషనల్. ఫోర్క్ మై సిటీకి ఈయన సహ వ్యవస్థాపకుడు, సీఓఓ కూడా. ఈబుకర్స్.కాం, సౌతాల్ ట్రావెల్ వంటి సంస్థల్లో సీనియర్ మేనేజ్మెంట్లో విధులు నిర్వహించారు నితిన్.

కపిల్‌దేవ్‌ కుమార్

కపిల్‌దేవ్‌ కుమార్


సౌరభ్ భాషిన్.... ఈయన హాస్పిటాలిటీ రంగంలో అనుభవ శాలి. అమెరికాలోని ఫుడ్ అండ్ బెవరేజెస్ సంస్థ కంపాస్ ఫుడ్స్‌కు డైరెక్టర్, సలహాదారుగా ఉన్నారు. ఈ సంస్థ కోర్ టీంలోని మరో వ్యక్తి కపిల్ దేవ్ కుమార్. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం అహ్మదాబాద్‌లలో విద్యాభ్యాసం చేశారు. నెక్స్‌ట్రా టెలీసర్వీసెస్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. రిలయన్స్ ఇన్ఫోటెల్‌కు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఫోర్క్ మై సిటీకి సీడ్ ఫండింగ్ చేసింది కపిల్ దేవ్ కుమారే కావడం విశేషం.

image


మార్కెట్ రీసెర్చ్

ట్రావెల్ మార్కెట్‌లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఏజంట్లందరూ ఒకే తరహా ఆఫర్స్ ఇస్తుంటారు. సాంప్రదాయ ఏజంట్లందరూ ఈ పోటీలో నిలబడ్డానికి భారీ ఆఫర్స్ ఇవ్వడమో... ఆన్‌లైన్‌కి మారడమో చేయాల్సి వస్తోంది. అదే ఎఫ్ఎంసీ (ఫోర్క్ మై సిటీ) విషయానికొస్తే... ఈ పోటీ మరింత విభిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం మన దేశం నుంచి ఏటా 1.7 కోట్ల మంది విదేశీ టూర్లు చేస్తుంటారు. 2020నాటికి ఈ సంఖ్య 5 కోట్లకు పెరుగుతుంని అంచనా. ట్రిప్ అడ్వైజర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మన ప్రయాణికుల్లో 50 శాతం మంది శాకాహారులు. 40శాతం మంది తమ ఆహారాన్ని వారితోపాటే తెచ్చుకుంటారు. ఆహార సమస్యలు ఏవైనా ఎదురైతే 40శాతం మంది తమ గమ్యస్థానాలను మార్చుకుంటుంటారు. అకార్ గ్రూప్ ప్రకారం స్పాలలో అధికంగా (80శాతం) ఖర్చుపెట్టేవారు మన భారతీయులే. నైట్ లైఫ్, షాపింగ్ విభాగాల్లోనూ ఇండియన్స్‌ టాప్‌లోనే ఉంటారు.

ఫోర్క్ మై సిటీ ఏం చేస్తుంది ?

యూజర్లు వివరాలను వెతుక్కుని ప్లానింగ్, బుకింగ్ చేసుకోవడానికి ఫోర్క్ మై సిటీ ఉపయోగపడుతుంది. అయితే ఎఫ్ఎంసీ కేవలం వివరాలివ్వడానికే పరిమితం కావడం లేదు. ఆయా ప్రాంతాల్లో సేవల సగటు ఖర్చు, ఫోటోలు, రివ్యూలు, రేటింగులు, మెనూ, పూర్తి వివరాలతో మ్యాప్ వంటివి అందుబాటులో ఉంటాయి. వారు వెళ్లాలనుకునే ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్ వంటి వివరాలన్నీ అరచేతిలోకి వచ్చేస్తాయి.

ఉదాహరణకు బ్యాంకాక్‌లోని డ్రీమ్ వరల్డ్‌కు ఎవరైనా వెళ్లేందుకు ముందుగా... ఆ ప్రాంతానికి దగ్గర్లో ఉన్న భారతీయ రెస్టారెంట్ల వివరాలతో సహా మ్యాప్ ప్రత్యక్షమవుతుంది. అవసరమనుకుంటే నచ్చిన రెస్టారెంట్లలో ముందుగానే టేబుల్ బుక్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. ప్రీబుకింగ్, ప్రీపేమెంట్ వంటివి ఇష్టంలేనివారికి... ఫ్లాట్ డిస్కౌంట్ కూపన్స్ కూడా అందిస్తుంది FMC.

నకుల్‌ భాటియాకు ఎదురైన ఇబ్బందులు

దీనికి ముందే 2 ట్రావెల్ సంబంధిత కంపెనీలు నిర్వహించిన నకుల్... ఈసారి మాత్రం గట్టి పట్టుదలతో దీన్ని ప్రారంభించారు. మరో సంస్థ ప్రారంభించేందుకు చేతిలో అన్ని వసతులు సిద్ధంగానే ఉన్నా... మార్కెట్ రీసెర్చ్, నిధుల సమీకరణ, మానసిక సన్నద్ధత వంటి వాటి కోసం ఏడాదికి పైగా కాలం వెచ్చించారు. సప్లయర్లను ఆన్‌బోర్డ్‌లోకి తీసుకురావడమే అన్నిటికంటే పెద్ద కష్టమంటారు నకుల్.

నాణ్యమైన సేవలందించే సంస్థలతో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తోంది ఫోర్క్ మై సిటీ. అంతర్జాతీయ ప్రయాణమంటే సగటున ఒక్కొక్కరికి కనీసం రూ.50వేలు ఖర్చవుతుంది. దీనికి షాపింగ్ వంటి ఖర్చులు అదనం. ముఖ్యంగా ప్రయాణికులు ఎవరికైనా... టూర్ అంటే అక్కడికెళ్లే రోజును పూర్తిగా ఎంజాయ్ చేయడమే. అందుకే నాణ్యత విషయంలో రాజీపడ్డం లేదంటారు నకుల్. 4,5 స్టార్ పార్ట్‌నర్స్‌కే ప్రాధాన్యతనిస్తున్నారు. బ్యాంకాక్, పట్టాయాలలో దాదాపు 20 భారతీయ రెస్టారెంట్లతో వీరికి ఒప్పందాలున్నాయి. వాటిలో ఇండస్, మాయా & బావర్చిలతో పాటు థాయ్‌లాండ్‌లోని అతి పెద్ద స్పా గ్రూప్‌తోనూ టైఅప్ ఉంది.

image


ప్రపంచ పాపులర్ బ్రాండ్ కావాలనేదే లక్ష్యం

ఆఫ్‌లైన్ రంగం నుంచే ప్రధాన పోటీ ఉంటుందంటున్నారు నకుల్ భాటియా. ప్రస్తుతం ఉన్న పోర్టల్స్ అన్నీ గ్రూపులుగా వెళ్లేవారికే ప్రాధాన్యతనిస్తున్నాయి తప్ప... వ్యక్తిగతంగా వెళ్లేవారికోసం ప్రత్యేకంగా ఏం చేయలేకపోతున్నాయి. అందుకే ఫోర్క్ మై సిటీ ఈ సెగ్మెంట్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టింది.

ప్రస్తుతం పట్టాయా, బ్యాంకాక్‌లలో సేవలందిస్తున్న ఫోర్క్ మై సిటీ... వార్సా, బుడాపెస్ట్, సింగపూర్, న్యూయార్క్, ప్రేగ్ వంటి నగరాలకూ విస్తరించేందుకు సిద్ధమవుతోంది. అలాగే కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా... ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన బ్రాండ్‌గా ఫోర్క్ మై సిటీని తీర్చిదిద్దాలన్నదే ఈ సంస్థ ఫౌండర్ల లక్ష్యం.