మీ కాలేజీకి బ్రాండ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా?అయితే మేం మర్చండైజ్‌ చేస్తాం !!

మీ కాలేజీకి బ్రాండ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా?అయితే మేం మర్చండైజ్‌ చేస్తాం !!

Wednesday December 30, 2015,

4 min Read

ఇప్పుడు స్కూళ్లు, కాలేజీలు కేవలం పాఠాలకే పరిమితం కావడం లేదు. ఏదో రకంగా తమకో బ్రాండ్ క్రియేట్ చేసుకొని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకర్షించాలని చూస్తున్నాయి. యూనిఫామ్స్ విషయంలో అయినా, ఏవైనా ఈవెంట్లను ఆర్గనైజ్ చేయడంలోనైనా ప్రత్యేకంగా నిలవడానికి ఆరాటపడుతున్నాయి. అలాంటి స్కూళ్లు, కాలేజీలే లక్ష్యంగా వారికి కావాల్సిన మర్చండైజ్ ను అందిస్తామంటోంది ఇండోర్ కు చెందిన క్యాంపస్ మాల్.ఇన్ ! ఇప్పటికే ఈ క్యాంపస్ మర్చండైజ్ రంగంలో ఉన్న ఆల్మా మేటర్, ఈ-స్పర్శ, ప్రైడ్ వేర్ వంటి వాటికి గట్టిపోటీనిస్తామంటోంది.

image


మీ కాలేజీకి ఘన చరిత్ర ఉందా? ఆ వారసత్వాన్ని కొనసాగించుకోవాలనుకుంటున్నారా? మీకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారా? మీ అభిరుచికి తగినట్లుగా ఉండే మర్చండైజ్ ను తాము అందిస్తామని అంటోంది క్యాంపస్ మాల్. సదరు కాలేజీ, స్కూల్ సంస్కృతికి అద్దం పట్టేలా వాటిని రూపొందించడం వీరి ప్రత్యేకత. ఉన్నత చదువులు చదివిన ముగ్గురు యువకుల ఆలోచనే ఈ కొత్త స్టార్టప్.

వన్ స్టాప్ షాపింగ్ మాల్

టీషర్ట్స్, పోలోస్, హుడీస్, స్వెటర్స్, మగ్స్, క్యాప్స్, యాక్సెసరీస్ వంటి అన్ని మర్చండైజ్ ను క్యాంపస్ మాల్ అందిస్తుంది. ‘నాణ్యమైన దుస్తులను అందించడంతోపాటు నమ్మకమైన సర్విస్, కోరిన సమయానికే డెలివరీ అందజేస్తాం. ప్రస్తుతానికి ఈ రంగంలో సరైన నెట్ వర్క్ అందుబాటులో లేదు’ అని కో ఫౌండర్, సీఈవో అంకుర్ గుప్తా తెలిపాడు. అతడు అమెరికాలోని డీపాల్ యూనివర్సిటీ నుంచి ఎంబీయే పూర్తి చేశాడు. పూర్వ విద్యార్థుల సమ్మేళనాలకు కూడా ప్రత్యేకంగా మర్చండైజ్ ను అందజేయడం క్యాంపస్ మాల్ ప్రత్యేకత. వాళ్లు ఆర్గనైజ్ చేసే ఈవెంట్స్, రీయూనియన్స్, ప్రమోషన్స్ కోసం అపరిమితమైన అవకాశాలు తాము కల్పిస్తామని మరో కోఫౌండర్ అర్పిత్ బజాతియా (33) చెబుతున్నాడు. ఇతను ఐఐఎమ్ కలకత్తా నుంచి డిగ్రీ పట్టా పొందాడు. తాము క్రియేట్ చేసిన బ్రాండ్ వల్ల ఇన్ స్టిట్యూట్లు, పూర్వవిద్యార్థుల అసోసియేషన్లు లబ్ధి పొందేలా చూడటమే తమ లక్ష్యమని మరో కోఫౌండర్, అమెరికాలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివిన సిద్ధార్థ్ బజాతియా (32) చెప్పాడు.

అలా మొదలైంది

ముగ్గురు వ్యవస్థాపకుల్లో ఒకరైన అంకుర్ గతంలో పదేళ్ల పాటు అమెరికాలోని ఓ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసారు. అయితే ఇండియాలో ఎడ్యుకేషన్ స్టార్టప్ మొదలుపెట్టాలన్నది అతని లక్ష్యం. 2011లో ఇండియాకు తిరిగి వచ్చిన అంకుర్.. స్మార్ట్ క్లాస్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. వివిధ ప్రాంతాల్లో వంద స్కూళ్లు, కాలేజీలు తిరిగినా ఒక్క ఉత్పత్తినీ అమ్మలేకపోయారు. ఆ సమయంలోనే విద్యాసంస్థలకు వివిధ ఉత్పత్తులను విక్రయిస్తున్న అర్పిత్, సిద్దార్థ్ తో చేతులు కలిపారు. ముగ్గురూ కలిసి మర్చండైజ్ పోర్టల్ ను ప్రారంభించాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ‘అప్పటికి చాలా వరకు విద్యాసంస్థలు తమ మర్చండైజ్ అవసరాలతో టోకు వర్తకులను సంప్రదించేవారు. అటు పూర్వ విద్యార్థులు కూడా రీయూనియన్స్ పేరుతో ఏడాదికి ఒకటి, రెండుసార్లు ప్రత్యేక మర్చండైజ్ కోసం ప్రయత్నించేవారు. అయితే వారి డిమాండ్ కు తగిన సరఫరా లభించకపోవడంతోపాటు నాణ్యత కూడా అంతంతమాత్రంగానే ఉండేది’ అని అంకుర్ చెప్పారు. ‘మేం పూర్తిగా వ్యవస్థీకృతం కాని రంగంలోకి అడుగుపెట్టబోతున్నామని మాకు తెలుసు. కానీ మర్చండైజ్ కోసం విద్యాసంస్థలు, అసోసియేషన్లు పడుతున్న ఇబ్బందులు తొలగించడానికి ప్రత్యేకంగా ఓ ఈ-స్టోర్ ను ప్రారంభించాలని అనుకున్నాం’ అని స్టార్టప్ వెనుక ఉన్న ఉద్దేశాన్ని చెప్పారు అర్పిత్.

image


భవిష్యత్ బంగారమే !!

క్యాంపస్ మాల్ ప్రారంభించిన కొన్నాళ్లకే పేరున్న ఎన్నో విద్యాసంస్థలను తమ క్లైంట్లుగా మార్చుకోగలిగింది. క్యాంపస్ మాల్ కు తొలి కస్టమర్ అంకుర్ చదివిన ‘ద డేలీ’ కాలేజీ, ఆ తర్వాత సిమ్ శ్రీ, నర్సీ ముంజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, ముంబైకి చెందిన ఎస్పీ జైన్, కురుక్షేత్ర ఎన్ ఐటీ, గ్వాలియర్ లోని ద సింధియా స్కూల్, లారెన్స్ స్కూల్ వంటి ప్రముఖ విద్యాసంస్థలకు మర్చండైజ్ ను సరఫరా చేయడం మొదలుపెట్టారు. 

క్యాంపస్ మాల్ మూడు పద్ధతుల్లో విద్యాసంస్థలకు సేవలు అందిస్తుంది. ఒక్కో విద్యాసంస్థకు ప్రత్యేకంగా ఒక ఈ-స్టోర్ ను రూపొందిస్తారు (ఉదా: iitm.campusmall.in). అందులో ఆ విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తమకు కావాల్సిన ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు. ఇక రెండోది స్టూడెంట్ ఎంగేజ్ మెంట్ ప్రోగ్రామ్ పేరుతో డిస్కౌంట్ రేట్లకు అనేక రకాల మర్చండైజ్ ను సదరు విద్యాసంస్థకు అందజేస్తుంది. మూడోది- వేల సంఖ్యలో అవసరమయ్యే యూనిఫామ్స్, ఈవెంట్లకు సరిపడా దుస్తులను కూడా సరఫరా చేస్తుంది. ‘దేశంలో 14 లక్షల ప్రైమరీ, కే12 విద్యాసంస్థలు, 700కు పైగా యూనివర్సిటీలు, 36 వేల కాలేజీలు ఉన్నట్లు మానవవనరుల మంత్రిత్వశాఖ నివేదికలో తేలింది. అంతేకాదు దేశంలో యూనిఫామ్ బిజినెస్ 1.4 బిలియన్ డాలర్లుగా ఉందని ఐకాన్ గ్రూప్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ఓ సర్వేలో తెలిసింది. దీన్నిబట్టి ఈ రంగంలో మంచి అవకాశాలున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మేం మా వరకు వెయ్యి విద్యాసంస్థలను గుర్తించాం. వాళ్లే మా ప్రధాన లక్ష్యం’ అని అర్పిత్ చెప్పారు.

ఇప్పటికే ఈ రంగంలో కొంత పోటీ ఉన్నా వాళ్లందరి కన్నా క్యాంపస్ మాల్ ను ముందు వరుసలో నిలబెడతామన్న నమ్మకాన్ని అర్పిత్ వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 40 నగరాల్లోని 85 విద్యాసంస్థలకు ప్రత్యేకంగా ఆన్ లైన్ స్టోర్లను తాము నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమీప భవిష్యత్తులో 500 విద్యాసంస్థలకు తమ సేవలను విస్తరించాలని భావిస్తున్నట్లు అర్పిత్ చెప్పారు. 

క్యాంపస్ మాల్ నిర్వహిస్తున్న ముగ్గురూ గతంలో అమెరికాలో చదివిన వాళ్లు కావడంతో అక్కడి పుస్తకాలు, అనుభవం నుంచి ప్రేరణ పొందుతున్నారు. రామ్ చరణ్, ల్యారీ బోసిడీ రచించిన ‘ఎగ్జిక్యూషన్’ పుస్తకం తనపై ఎంతగానో ప్రభావం చూపిందని అంకుర్ చెబుతున్నారు. ‘ప్రపంచంలో ఎన్నో గొప్ప ఆలోచనలు ఉన్నాయి. ఎంతోమంది వ్యక్తులు వాటిని సాకారం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. కానీ వాటిని ఎంత సమర్థంగా అమలు చేస్తున్నామనడంలోనే విజయం దాగి ఉందన్నది ఆ పుస్తకంలోని సారాంశం’ అని అంకుర్ తెలిపారు. 

నిజమే మరి.. కలలు కనడం, గొప్ప ఆలోచనలు చేయడం ఎవరైనా చేస్తారు. కానీ వాటిని సాకారం చేయగలిగిన వాళ్లు మాత్రం కొందరే.

వెబ్ సైట్ http://campusmall.in/