2016లో దుమ్మురేపుతున్న టాప్ ఇండియన్ స్టార్టప్స్

0

గతేడాది స్టార్టప్స్ ది ఒడిదుడుకుల ప్రయాణమే. కానీ 16 జనవరి, 2016లో ప్రధాని నరేంద్రమోడీ 'స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా' పేరుతో నిబంధనల్ని సరళతరం చేయడం, పన్ను చట్టాలను సడలించడం... భారతదేశంలోని యువ, భావి ఆంట్రప్రెన్యూర్స్ కు మంచి ఉత్సాహాన్నిచ్చింది. పలు స్టార్టప్ లకు పెట్టుబడులు ప్రవహించాయి. ఆ స్టార్టప్స్ అన్నీ ఈ సంవత్సరాన్ని గొప్పగా ప్రారంభించేశాయి. 

ఇప్పటికే దేశంలోని పలు స్టార్టప్ లకు 300-400 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. నెల క్రితం లేటెస్ట్ రౌండ్ ఫండింగ్ తో యూనికార్న్ క్లబ్ లో గౌరవప్రదంగా చేరి షాప్ క్లూస్ వార్తల్లో నిలిచింది. అంతేకాదు.. పలు సంస్థలు ఇలాగే పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నాయి. ఆన్ లైన్ లో సరుకులమ్మే సంస్థలు, హోటల్ బుకింగ్, ట్రావెల్, ట్రాన్స్ పోర్టేషన్ లాంటి ఇ-కామర్స్ సైట్లు మరిన్ని పెరిగే అవకాశం ఉన్నాయి. విశేషమేంటంటే... ఏ ఒక్క సంస్థ కూడా ఓ రంగానికి అధిపతి కాదు.

సరుకుల నుంచి లగ్జరీ వరకు అన్ని రంగాల్లో మార్కెట్ ను పంచుకునే అవకాశం ఉండటంతో కొత్త స్టార్టప్స్ రానున్నాయి. ప్రస్తుతం ఆధిపత్యం చూపిస్తున్న ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్, పేటీఎం, షాప్ క్లూస్ లాంటివి పరస్పరం పోటీలో ఉన్నా వృద్ధి సాధించడం విశేషం. కొన్నిసార్లు మాటల కన్నా అంకెలే నిజానిజాలను బయటపెడుతుంటాయి. రెండున్నరేళ్ల నుంచి హోటళ్లన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొస్తున్న OYO రూమ్స్ నెల రోజుల క్రితం పది లక్షల చెకిన్స్ పూర్తి చేసుకుంది. ఇక ఆరేళ్ల క్రితం మొదలైన ఆన్ లైన్ ట్రావెల్ సంస్థ గోఇబిబో వార్షిక వృద్ధి రేటు 400 శాతంతో మూడో త్రైమాసికంలో 16 లక్షల గదుల బుకింగ్స్ పూర్తిచేసుకుంది. ఆటోమొబైల్ క్లాసిఫైడ్స్ రంగం కూడా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ కార్ ట్రేటర్ కొన్ని రోజుల క్రితం రూ.950 కోట్లు నిధులు పొందింది.

ఈ స్టోరీ కూడా చదవండి

ఇక జొమాటో, గ్రోఫర్స్ లాంటి కొన్ని స్టార్టప్స్ చిన్న చిన్న నగరాల్లో అడుగుపెడుతూ వారి వ్యూహాన్ని మార్చుకునే ఆలోచనల్లో ఉన్నాయి. ఇక ఓలా లాంటి ఆటోరిక్షా ప్లాట్ ఫామ్ మరిన్ని టైర్-2 నగరాల్లో సేవలందించబోతున్నాయి. మరిన్ని నిధుల సేకరణ, స్వాధీనపర్చుకోవడం, భాగస్వామ్యాలు, సరికొత్త మార్కెటింగ్ వ్యూహాలను ఈ ఏడాదిలో స్టార్టప్స్ లల్లో చూడొచ్చు. మరి 2016లో ఇండియన్ స్టార్టప్ ప్రపంచంలో ఏ స్టార్టప్స్ సత్తాచాటుతాయి? ముఖ్యంగా వాటిలో కాంపిటీషన్ ను తట్టుకొని నిలబడేవి ఎన్ని? చూద్దాం.

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

Related Stories