ఆటలతో ఆన్‌లైన్లో చదువు నేర్పించే స్పైసీ టూన్స్

ఆటలతో పిల్లల్లో కొత్త ఉత్సాహంఆడుతూ నేర్చుకొనే పద్దతలుగణిత పజిళ్లు, పదాలతో కూర్పులుఆన్ లైన్ లో స్పైసీ టూన్ ఆటలు

ఆటలతో ఆన్‌లైన్లో చదువు నేర్పించే స్పైసీ టూన్స్

Saturday May 02, 2015,

2 min Read

ఒకప్పుడు ఆటలాడుతున్నారంటే చదువు సంథ్యలొలిలేశారనే వారు. కానీ ఇప్పుడు పిల్లలు ఆటలకు దూరం కావడంతో చదువులో చురుకుదనం కోల్పోతున్నారట. చదువుతో కూడిన ఆటలను ప్రొత్సహించాలని ప్రపంచంలోని గొప్ప యూనివర్సిటీలైన ఆక్స్ ఫర్డ్, స్టాండ్ఫర్డ్ లాంటివి చెబుతున్నాయి. ఇదేవిషయాన్ని తమ వ్యాపార సూత్రంగా మార్చుకున్నారు స్పైసీటూన్స్ వ్యవస్థాపకులు.

విద్యార్థుల్లో ఆహ్లాదం కలిగించే ఆటలను అలవాటు చేయడం ద్వారా ఎన్నో ఆసక్తిని రేకెత్తించే ఫలితాల పొందవచ్చు. ఆటలతో నేర్చుకోడాన్ని గేమిఫికేషన్ అంటారు. ఇదెంతో ఆహ్లాదభరితమైనది. చదువుకునే చిన్నారులకు దీని వల్ల ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.

స్పైసీ టూన్స్ రూపొందించిన ఓ గేమ్‌లోని స్క్రీన్ షాట్

స్పైసీ టూన్స్ రూపొందించిన ఓ గేమ్‌లోని స్క్రీన్ షాట్


స్పైసీ టూన్స్

ఐటూఇండియా,ఐటూప్లే అనేది దేశంలోనే గేమింగ్‌కు సంబంధించిన మొదటి స్టార్టప్. మాసివ్ మల్టిప్లేయర్ ఆన్ లైన్ గేమ్ (MMOG) ప్లాట్‌ఫార్మ్‌లో భారత్‌లో మొదటి సారి పిల్లలకు కావల్సిన పాఠాలను ఆటల ద్వారా అందిస్తోంది. ఆన్ లైన్లో 6 నుంచి 12 ఏళ్ల మధ్యనున్న పిల్లలకోసం స్పైసీటూన్స్ పేరుతో 'ఐటూప్లే' కొత్త వెంచర్‌ని ప్రారంభించింది. ఐటూ ప్లే ప్రారంభించిన రెండేళ్లకే కొత్త వెంచర్ స్టార్ట్ కావడం విశేషం. గేమిఫికేషన్ ఆఫ్ లెర్నింగ్ అనే ఈ ప్రొగ్రాం లో న్యూయార్క్ యూనివర్సిటీ, మిచిగాన్ స్టేట్ యూనివర్సీటీ తోపాటు ఇంపీరియల్ కాలేజీలు భాగస్వాములుగా ఉన్నాయి. గేమిఫికేషన్ కార్యక్రమంతో స్పైటీ టూన్స్ చిన్నారులను చాలా విషయాలను నేర్పిస్తుంది. వాస్తవిక ప్రపంచంలో ఎకడమిక్ నాలెడ్జ్‌తో పాటు సామాజిక నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. తన దైన కార్యక్రమాలతో సాంప్రదయ పద్దతులకు విరుద్ధంగా స్పైసీటూన్ ప్రయోగాత్మకంగా చిన్నారులకు నేర్చుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది.

image


సవాలు – పరిష్కారం

ఇప్పుడున్న అకడమిక్ లెర్నింగ్‌కు టీం వర్క్ సహకారంతో లీడర్‌షిప్‌ను పెంపొందించడం ఐటూప్లే టీం, వెంచర్డ్ ఫ్యాక్టరీలు ప్రధాన ఉద్దేశం. అండర్ వాటర్ కాంక్వెస్ట్(నీటిలో ఆటలు), వర్డ్ బిల్డింగ్ (పదాల కూర్పు), మాథ్ పజిల్ (లెక్కలతో ఆటలు) లాంటి కార్యక్రమాలను స్పైసీటూన్స్ చేపడుతుంది. మొదట్లో ఐటూప్లే ఒక స్పేస్ థీమ్‌ని ప్రారంభించింది. ఇది వారికి అనుకూలంగా పనిచేస్తుందన్న మాట. ఆ తర్వాత అంచెలంచెలుగా కొత్త ఆలోచనలను ఆచరణలో పెడుతూ దూసుకు పోయింది స్పైసీటూన్. వీరు చేసిన ప్రతి డిజైన్, క్యారెక్టర్, ప్లాట్‌లపై అధ్యయనం చేయడమే కాదు ఇన్ హౌస్‌ రీసెర్చ్ కూడా చేసిన తర్వాతే ప్రకటించారు.

ఐటూప్లే సిఈఓ రవి

ఐటూప్లే సిఈఓ రవి


ఈఏడాది ఫిబ్రవరి 15న స్పైసీటూన్ జనం ముందుకొచ్చింది. బోర్డు మూడు విభాగాలుగా కంపెనీని విభజించింది. గేమ్ డిజైన్, టెక్నాలజీ డిపార్ట్ మెంట్‌తోపాటు కళలకు సంబంధించిన విభాగం. నైపుణ్యంతో పాటు ప్యాషన్ ఉన్న యంగ్ టీం డిజైన్ లేదా డిజిటల్ ప్రొడక్ట్ డిపార్ట్‌మెంట్ కిందపనిచేస్తుంది. ఈ టీంలో వారంతా ఐఐటి, నిట్, నిడ్ నుంచి వచ్చిన వారే ఎక్కువ. ఎక్స్‌పెరిమెంటల్ లెర్నింగ్ వైపు ఆకర్షితులయ్యేలా స్పైసీటూన్ కార్యక్రమాలను తయారు చేస్తుంది. బాహ్య ప్రపంచంలో ఉన్న ఇతర వ్యక్తులతో ఈ విషయాలు పంచుకున్నప్పటికీ ప్రొగ్రామ్స్ సేఫ్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అమెరికాకు సంబంధించిన చిన్నారుల ఆన్‌లైన్ పాలసీ యాక్ట్‌ను ఫాలో అయ్యారు. దీంతో ఇంటర్నెట్‌లో సమాచార మార్పిడి జరిగినా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావన్న మాట.

భవిష్యత్ లక్ష్యం

ఇండస్ట్రీలో స్పైసీ టూన్ మొదటి కంపెనీ కావడంత ప్రాడక్ట్‌కు సహకరించడానికి బ్రిటానియా ముందుకొచ్చింది. బ్రిటానియా జిమ్ జాబ్‌తో స్పైసీ టూన్ ఫిబ్రవరిలో ప్రారంభమైంది. రోజుకి 500 మంది ప్లేయర్స్ కలిగిన యూజర్ బేస్‌తో దూసుకుపోతోంది. ఇదంతా ఐదున్నర వారాల్లోనే సాధ్యమైందంటే నమ్ముతారా? మొత్తంగా 25వేల మంది యునిక్ యూజర్లున్నారు. గడిచిన 15 నెలలతో పోలిస్తే ఇది ఆరురెట్లు ఎక్కువ. ప్రస్తుతానికి ఇది డెస్క్‌టాప్‌కే పరిమితమైనా భవిష్యత్తులో మొబైల్‌లో కూడా అడుగుపెట్టబోతున్నారు.

ఐటూప్లే టీం

ఐటూప్లే టీం


చిన్నారులందరికీ ఈ వేదిక ఉచితంగా అందుబాటులో ఉండాలనేది స్పైసీటూన్స్ ఉద్దేశం. మర్కండైజ్, బుక్స్‌తో ఆదాయాన్ని పొందాలని కంపెనీ ఆశిస్తోంది. ప్రొడక్ట్ లాంచ్ అయిన నాలుగు నెలలకే యూజర్ ఎక్స్‌పీరియన్స్‌లో ఫిక్కీ బఫ్(FICCI BAF) అవార్డును గెలుపొందింది స్పైసీటూన్స్.