ఫ్యూచరంతా మొబైల్ టెక్నాలజీదే- షాప్ క్లూస్ అధినేత సంజయ్ సేథి

0

మొబైల్ స్పార్క్స్ 2016లో షాప్ క్లూస్ అధినేత సంజయ్ సేథి ఈ కామర్స్ లో ఉన్న సాధకబాధకాలన్నీ వివరించారు. తమ సంస్థ సైట్ ద్వారా లక్షల రూపాయల కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతుంటాయని చెప్పిన సంజయ్.. ఆడియన్స్ అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

మన దగ్గర ఎంతసేపూ కాపీ కొట్టడం తప్పితే అమెరికాలోలాగ బిజినెస్ మోడల్ ప్రత్యేకంగా ఎందుకు ఉండదు అనే ప్రశ్నకు సంజయ్ ఇలా సమాధానం ఇచ్చారు..

దగ్గరగా పరిశీలించి చూస్తే మనకు ఒకటి అర్ధమవుతుంది. మనం ఏదైనా చేద్దాం అనుకునేలోపు అంచనాలు తారుమారవుతాయి. ఎందుకంటే గతంలో ఎవరో ఒకరు దాన్ని ఆల్రెడీ చేసి ఉంటారు. అందుకే ముక్కుమూసుకుని ఫాలో అయిపోతుంటాం- సంజయ్

ప్రతీ మార్కెట్ దేనికదే ప్రత్యేకం. ప్రతీ వ్యాపారం దేనికదే విభిన్నం. దేశంమొత్తం ఒకే బిజినెస్ మోడల్ ఉండాలంటే అసాధ్యం అని సంజయ్ అన్నారు.

షాప్ క్లూస్ మార్కెట్లోకి ఎంటరయినప్పుడు ముందుగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలపై ఫోకస్ చేసింది-సంజయ్ .

ఒకే వ్యక్తి వ్యాపారాల మీద వ్యాపారాలు చేసిన పాతరోజులు పోయాయి. కొత్త జెనరేషన్ ఆంట్రప్రెన్యూర్ షిప్ మారింది. టెక్నాలజీ సాయంతో గొప్పగొప్ప ఐడియాలతో మార్కెట్‌ని దున్నేస్తున్నారు- సంజయ్


ఆఫ్ లైన్, ఆన్ లైన్ సేల్స్ గురించి మరొకరు వేసిన ప్రశ్నకు సంజయ్ ఏమన్నారంటే..

మంచి లాభాలు రావాలంటే మంచి పరపతి కూడా కావాలి. అప్పుడే మంచి రిజల్ట్ వస్తుంది. జీఎస్టీ, ప్లాస్టిక్ కరెన్సీ లాంటి కొత్తకొత్త పాలసీలు, ఐడియాలు వస్తున్నాయి. ఆన్ లైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంకా వేగంగా వృద్ధిలోకి రావాలి. అలాగని అదొక్కటే తారకమంత్రం కాదు- సంజయ్

టెక్నాలజీ విషయంలో ఇండియా ట్రాన్స్ ఫార్మింగ్ దశలో ఉంది. డెస్క్ టాప్, లాప్ టాప్ నుంచి జనం ఇప్పుడిప్పుడే మొబైల్ టెక్నాలజీలోకి మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంట్రప్రెన్యూర్లంతా మొబైల్ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేస్తే రేపటి ఫలితాలు అనుకున్నదానికంటే మెరుగ్గా ఉంటాయని సంజయ్ సేథీ సలహా ఇచ్చారు.  

Related Stories