ఈ నాలుగు దేశాల్లో సిగరెట్ తాగడం వల్ల 50శాతం మంది చనిపోతున్నారు  

0

పొగతాగనివాడు దున్నపోతై పుట్టును అన్నమాటేమో గానీ, అది తాగితే తొందరగా పోవడం మాత్రం ఖాయమని తాజా సర్వే చెప్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పొగరాయుళ్లు మనదేశంలో 11.2 శాతం వున్నారని తేలింది. 2015లో ప్రపంచ వ్యాప్తంగా కేవలం స్మోక్ చేయడం వల్లనే చావుని కొని తెచ్చుకున్నవాళ్లు 11.5 శాతం ఉంటే.. అందులో ఇండియా, చైనా, అమెరికా, రష్యా దేశాల నుంచే యాభై శాతం మరణాలు సంభవించాయి. ఇంకా సూటిగా చెప్పాలంటే పది మరణాల్లో ఒక మరణం పొగతాగడం వల్లనే వచ్చింది.

1995 నుంచి 2015 వరకు 195 దేశాల్లో చేసిన సర్వేలో ఈ వాస్తవం వెలుగులోకి వచ్చింది. చాలా దేశాల్లో పొగతాగడం వల్లనే ఎక్కువ మంది చనిపోతున్నారని తేలింది. పరిశోధనలో తేలిన పాజిటివ్ అంశం ఏంటంటే.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు పొగాకు వాడకాన్ని తగ్గించేందుకు పాటుపడుతున్నాయి.

ఇండియాతో పాటు పాకిస్తాన్, పనామా దేశాలో పొగాకు వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు అనేక పాలసీలు తీసుకొస్తున్నాయి. అందులో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే, ఇండియాతో పాటు మరో నాలుగు దేశాల్లో మహిళలు ఎక్కువగా స్మోక్ చేస్తున్నారు. మనదగ్గర ఫీమేల్ స్మోకర్ల సంఖ్యమాత్రం తగ్గటం లేదని సర్వేలో తేలింది.

మొత్తానికి స్మోకింగ్ అనేది అంటువ్యాధిలా మారింది. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు. అగ్ర రాజ్యం నుంచి మిడిల్ ఇన్ కమ్ దేశాల దాకా పొగరాయుళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.