కష్టాలను ఎదుర్కొని నిలబడినవారే విజయానికి కేరాఫ్ గా మారుతారు- శ్రద్ధాశర్మ

కష్టాలను ఎదుర్కొని నిలబడినవారే విజయానికి కేరాఫ్ గా మారుతారు- శ్రద్ధాశర్మ

Friday September 30, 2016,

1 min Read

టెక్ స్పార్క్స్ 2016 గ్రాండ్ ఫినాలే బెంగళూరులో ఆడంబరంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గేతో పాటు ఎందరో వ్యాపార దిగ్గజాలు, స్టార్టప్ ఫౌండర్లు, ఆంట్రప్రెన్యూర్లు హాజరయ్యారు. యువర్ స్టోరీ ఫౌండర్, సీఈవో శ్రద్ధా శర్మ ఈవెంట్ లో ప్రారంభోపన్యాసం చేశారు. ఈ స్టార్టప్ ఫెస్టివల్ లో పాల్గొన్న వారందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

ఏడేళ్ల ప్రయాణాన్ని శ్రద్ధాశర్మ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఒక మంచి వేదిక మీద అలాంటివన్నీ షేర్ చేసుకున్నందుకు ఆనందంగా ఉందని శ్రద్ధా అన్నారు. ఈవెంట్ కు హాజరైన ప్రతీ ఒక్కరికీ ఆమె పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ధైర్యంగా ముందుకు అడుగేస్తే ఎన్ని కష్టాలైనా ఇష్టంగా దాటుకుంటూ పోవచ్చని శ్రద్ధా శర్మ అన్నారు. 

image


ఎన్ని సవాళ్లు ఎదురైనా చిరునవ్వుతో స్వీకరిస్తే విజయం సిద్ధిస్తుందన్నారు. ఆరేళ్ల టెక్ స్పార్క్స్ జర్నీ కూడా అలాంటిదే అన్నారామె. ఈ ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తే, మరెందరికో అనేక రకాలుగా సాయపడిందని శ్రద్ధ శర్మ తెలిపారు. టెక్ స్పార్క్స్ గ్రాండ్ ఫినాలే ఒక కొత్త చరిత్ర సృష్టించదని ఆమె అభిప్రాయ పడ్డారు. ఇదే ఉత్సాహంతో మరిన్ని స్టార్టప్ ఫెస్టివల్స్ చేపట్టే విశ్వాసం పెరిగిందని చెప్పారు.

ఒంటరి ప్రయాణం ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. ఆ కష్టంలో సంతోషాన్ని వెతుక్కోవడమే నిజమైన విజయం – శ్రద్ధాశర్మ
image


“వ్యాపారం అనే ప్రయాణంలో ఒక్కోసారి స్నేహితులు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒంటరి ప్రయాణంలో ఆటుపోటులు కామన్. ఎదుర్కొని నిలబడినవారే విజయానికి కేరాఫ్ గా మారుతారు. అవకాశం ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తుంది”- శ్రద్ధాశర్మ