స్టార్ట్ఏపీ ఫెస్ట్ కు రెడీ అవుతున్న వైజాగ్ !

స్టార్ట్ఏపీ ఫెస్ట్ కు రెడీ అవుతున్న వైజాగ్ !

Monday February 22, 2016,

2 min Read

బెంగళూరు, ఢిల్లీ తర్వాత స్టార్టప్ ఈకో సిస్టమ్ ప్రవేశించిన హైదరాబాద్ వాటికంటే మెరుగైన ఫలితాలు సాధించి దూసుకుపోతోంది. ఇప్పుడు ఆంధ్రా నుంచి మరో నగరం స్టార్టప్ హబ్ గా మారేందుకు సిద్ధపడుతోంది. నాస్కాం లెక్కల ప్రకారం వైజాగ్ నుంచి 100 స్టార్టప్స్ రిజిస్టర్ అయ్యయి. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి బూస్టింగ్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం, స్థానిక వ్యాపార సంస్థలు కలసి చేపడుతున్న స్టార్ట్ ఏపీ ఫెస్ట్ ఇప్పుడు స్టార్టప్ సర్కిల్లో చర్చనీయాంశం అయింది.

image


ఇప్పటికే సన్ రైజ్ స్టార్టప్స్

హైదరాబాద్ టీ హబ్ లాగానే వైజాగ్ లో కూడా సన్ రైజ్ స్టార్టప్స్ పేరుతో ఒక స్టార్టప్ విలేజీని ఏర్పాటు చేశారు. ఈ ఇంక్యుబేషన్ సెంటర్ లో ఇప్పటికే చాలా స్టార్టప్ లు పనిచేస్తున్నాయి. అందులో టాక్స్, మీటప్స్ జరుగుతున్నాయి. దేశంలో టియర్-2 సిటీలు స్టార్టప్ లకు అనుకూలమని గుర్తించిన నాస్కాం.. తొందరలోనే వైజాగ్ లో కూడా ఓ వేర్ హౌస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు వైజాగ్ లో జరిగిన ఇన్వస్ట్ మెంట్ మీట్ లో ఏపీ సీఎం చంద్రబాబు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఇలా ఇప్పుడిప్పుడే స్థానికంగా ఉన్న స్టార్టప్ లకు గుర్తింపు వస్తోంది. సరైన సమయం కావడంతో స్టార్టప్ ఏపీ ఫెస్ట్ కు వైజాగ్ సిద్ధపడుతోంది.

image


స్టార్ట్ ఏపీ ఫెస్ట్

ది స్టార్ట్ ఏపీ ఫెస్ట్ ఈవెంట్ గతంలో ఎన్నడూ ఇంత స్థాయిలో జరగలేదు. మార్చి 4,5,6 తారీఖుల్లో దీన్ని నిర్వహిస్తున్నారు. వర్క్ షాప్స్, స్పీచెస్, టాక్స్ లాంటివి చేపడుతున్నారు. దేశ నలుమూల నుంచి ఆంట్రప్రెన్యూర్లు, సెలబ్రిటీ స్పీకర్లు ఇందులో పాల్గొంటున్నారు. పదికి పైగా ప్రాడక్టులు లాంచ్ కానున్నాయి. దాదాపు 100 స్టార్టప్ లు కొత్తగా ప్రవేశించనున్నాయి. 40 మంది స్పీకర్లు మాట్లాడనున్నారు. 3 రోజుల్లో ఎనిమిది ప్యానెల్ డిస్కసన్స్ జరుగుతాయి. ఆంట్రప్రెన్యూర్లు ఎందరో తమ అనుభవాలను షేర్ చేసుకుంటారు. పూర్తి స్టార్టప్ స్పిరిట్ తో జరుగుతోన్న ఈ ఫెస్ట్ చాలా కంపెనీలకు ఫండింగ్ ఇస్తుందని ఆశిస్తున్నారు.

image


సీఎం ట్వీట్ తో ప్రచారానికి ఊపు

ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా ట్విట్టర్ లో ఈవెంట్ వివరాలు వెల్లడించారు. స్టార్టప్ ఫెస్ట్ కు కలసి రావాలని సంస్థలకు ఆహ్వానం పలికారు. సీఎం ట్వీట్ తో ప్రచారం ఉపందుకుంది. ఇప్పటి వరకూ వందకు పైగా రిజిస్ట్రేషన్లు అయ్యాయని స్టార్ట్ ఏపీ నిర్వాహకులు తెలిపారు. ఏంజిల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండంతో కనీసం 80 స్టార్టప్ లు అయినా పిచ్ కావొచ్చని భావిస్తున్నారు. ప్రత్యేక బీటుబీ లాంజ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కంపెనీలు తమకు కావల్సిన వారితో కలసే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల నుంచే 50 నుంచి 100 స్టార్టప్ లు ఇందులో పాల్గొంటాయని అంచనా. ఆంధ్రాలో అతి పెద్ద నగరమైన విశాఖలో జరుగుతోన్న ఈవెంట్ కావడంతో- దేశంలో అన్ని రాష్ట్రాల ఆంట్రప్రెన్యూర్లలో ఆసక్తిని రేపుతోంది.

వెబ్ సైట్