2017లో బిజినెస్ బిందాస్ చేసే 5 ఆన్ లైన్ మార్కెటింగ్ ట్రెండ్స్..

2017లో బిజినెస్ బిందాస్ చేసే 5 ఆన్ లైన్ మార్కెటింగ్ ట్రెండ్స్..

Monday December 26, 2016,

2 min Read

2016లో డిజిటల్ మార్కెటింగ్ హవా నడిచింది. మరి 2017లో కూడా సేమ్ సినారియో ఉంటుందా? డిజిటల్ మార్కెటింగ్ రూపం ఈ ఏడాది ఎలా వుండబోతోంది? మార్పులని బట్టి ఎలా ప్రిపేరవ్వాల్సి వుంటుంది? ఔటాఫ్ బాక్స్ ఆలోచిస్తే తప్ప హెవీ కాంపిటిషన్ తట్టుకోలేరన్నది వాస్తవం.

అన్నీ ఫాలో అవాల్సిన అవసరం లేదు. కానీ అన్నిటిమీదా అవగాహన మాత్రం ఉండాలి. సరైన మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటే తప్ప పోటీలో నెగ్గుకురాలేం.

image


అవేంటో ఒకసారి చూద్దాం..

1. ఆగ్మెంటెడ్ రియాలిటీ: పొకెమాన్ గో ఆట తెలుసుగా. ఇప్పుడంటే పడిపోయింది కానీ, మొన్నటిదాకా రెండు అంశాల్లో మార్కెట్ ని విపరీతంగా ప్రభావితం చేసింది. ఒకటి మొబైల్ యాప్స్ ద్వారా భారీ మొత్తాన్ని సమకూర్చి పెట్టింది. రెండోది ఆగ్మెంటెడ్ రియాలిటీని నలుమూలలా విస్తరించేలా చేసింది. కాబట్టి, ఆ రంగంలో మరిన్ని కొత్తకొత్త బ్రాండ్లు యాడ్స్, యాప్స్, గేమ్స్ రూపంలో వస్తాయని కచ్చితంగా ఊహించవచ్చు.

2. డేటా విజువలైజేషన్: డేటా అనాలిసిస్, దాని వెనుక వ్యాఖ్యానం అనేది డిజిటల్ మార్కెటింగ్ లో అతి ప్రధానమైనది. ఎవరు కొన్నారు.. ఏం కొన్నారు.. ఎప్పుడు కొన్నారు.. ఎందుకు.. ఏది అనే మెసేజ్ ఎఫెక్టివ్ గా ఉండవచ్చుగాక.. కానీ అంతకు మించి డేటా ఉంటేనే అనాలిసిస్ కష్టం. పైగా నడుస్తున్నది డేటా విజువలైజేషన్ జమానా. అందుకు తగ్గట్టుగా టెక్నాలజీని సిద్ధం చేసుకోకపోతే 2017లో కచ్చితంగా వెనుకబడి పోతారు.

3. నేటివ్ అడ్వర్టయిజింగ్ : ఇది కొత్తేం కాకపోయినా, 2017లో దానివల్ల కలిసొచ్చే అవకాశమూ లేకపోలేదు. వ్యాపార ప్రకటనలో నేటివిటీ ఉంటే కస్టమర్లు అట్రాక్ట్ అవుతారు. చాలా బ్రాండ్స్ స్థానికత అనే బాటలో నడవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల జనానికి ఇప్పటిదాకా పెద్దగా రీచ్ కాని ఉత్పత్తులు కూడా మన అనే భావన తెస్తాయి.

4. లైవ్ వీడియో స్ట్రీమింగ్: సోషల్ మీడియాలో లైవ్ వీడియోలు, వాటి స్ట్రీమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదొక ప్రత్యామ్నాయ మీడియాగా మారిపోయింది. కంటెంట్ తోపాటు వ్యూస్ పెరిగిపోతున్నాయి. అంతెందుకు చాలా యాప్స్ లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాయి. అందుకే 2017లో లైవ్ వీడియో స్ట్రీమింగ్ మార్కెట్ కు భీకరమైన స్కోప్ ఉందని చెప్పొచ్చు.

5. మైక్రో మార్కెటింగ్: మీకు తెలుసు.. ఇవాళ రేపు ఆన్ లైన్ మార్కెట్ బిజినెస్ ఏ స్థాయిలో ఉందో. ఒక్క వ్యాపారమే కాదు.. ఆయా సంస్థల పరపతి కూడా అనూహ్యంగా పెరిగిపోయింది. కస్టమర్లతో వ్యక్తిగత సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఇదంతా నిర్ధిష్ట కస్టమర్లపై ఫోకస్ చేయగలిగితేనే సాధ్యమవుతుంది. ఈ దిశగా క్యాంపెయిన్ చేస్తే సంస్థకు తిరుగులేదు.

పైన చెప్పిన ఐదు టాపిక్సే కాదు.. వచ్చే ఏడాది డిజిటల్ మార్కెట్ ను ఏలేందుకు చాలా అంశాలున్నాయి. కానీ పైన ఉదహరించినవి మాత్రం నడుస్తున్న ట్రెండ్స్. వాటిమీద ఫోకస్ చేయగలిగితే చాలు. అన్నీ లెక్కలోకి తీసుకోకపోయినా, కనీసం అవగాహన అయినా కలిగి ఉండాలి. ఒకవేళ వాటి గురించి తెలుసుకోడానికి అంతగా టైం లేకుంటే, ఢిల్లీకి చెందిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ మీకు అన్ని వివరాలు అందిస్తుంది. ఎలాంటి సందేహాలున్నా తీర్చి, మీ వ్యాపారం విస్తరించేందుకు బాటలు పరుస్తుంది.