వినూత్న ఆలోచనలు.. సరికొత్త ఆవిష్కరణలు-మొబైల్ స్పార్క్స్ 2016

0

దేశంలోని వందకోట్ల మందికి మొబైల్ టెక్నాలజీ అందించడమే లక్ష్యంగా యువర్ స్టోరీ మొబైల్ టెక్ స్పార్క్స్ 2016 నిర్వహించింది. ఢిల్లీలో జరిగిన ఈ ఈవెంట్‌ లో దేశవ్యాప్తంగా ఉన్న ఆంట్రప్రెన్యూర్లు, స్పాన్సర్లు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. యువర్ స్టోరీ చీఫ్ ఎడిటర్ శ్రద్ధాశర్మ స్వాగతోపన్యాసం చేయగా పలు సంస్థల ఫౌండర్లు, సీఈవోలు స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు.

మొబైల్ వాడకం గతంలో ఎలా వుండేది.. ఇప్పుడెలా వుంది భవిష్యత్తులో ఎలా వుంటుందనే ట్రెండ్ గురించి కూలంకశంగా చర్చించారు. సామాన్య ప్రజలకు ఉపయోగపడే స్టార్టప్ కంపెనీలకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం ఉంటుందని కేంద్ర ఐటీ శాఖ సెక్రటరీ రాజీవ్ భన్సల్ అన్నారు. పాతనోట్ల రద్దు మీద కూడా ఇంట్రస్టింగ్ డిబేట్ జరిగింది. దేశవ్యాప్తంగా మూలగుతున్న నల్లధనం మీద సెషన్ జరిగింది. ప్రముఖ లీగల్ సర్వీసు సంస్థ లీగల్ రాస్తా విలువైన సూచనలు, సలహాలు అందించింది. టాక్స్ సేవింగ్ పై జిటాఇండియా సంస్థ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పింది.  

మొబైల్ స్పార్క్స్ 2016 ఫోటో గ్యాలరీ

Related Stories