రెండు గ్లోబల్ కంపెనీలను కొనుగోలు చేసిన ‘టెక్ వేవ్’

రెండు గ్లోబల్ కంపెనీలను కొనుగోలు చేసిన ‘టెక్ వేవ్’

Sunday April 24, 2016,

2 min Read


టెక్వేవ్ కన్సల్టింగ్ ఇంక్. ఇది గ్లోబల్ ఎండ్ టు ఎండ్ ఐటి సర్వీస్ కంపెనీ. దీని హెడ్ క్వార్టర్స్ అమెరికా పెన్సిల్వేనియాలో ఉన్నప్పటికీ హైదరాబాద్ లో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఉంది. వచ్చే ఏడాది చివరికల్లా వంద మిలియన్ డాలర్ల సంస్థగా మారడానికి ప్రణాళికలు రచిస్తోంది. యూకే కి చెందిన డిజిటల్ సర్వీస్ కంపెనీ టెక్ అద్వైతా, హంగేరీ కేంద్రంగా పనిచేస్తున్న ఎస్ఏపీ కంపెనీ మేజర్స్ టెక్ వేవ్ వశమయ్యాయి. దీంతో యూకేలో టెక్ వేవ్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే నెదర్లాండ్స్ లో టెక్ వేవ్ కార్యాలయం ఏర్పాటయింది. ఈ డీల్ తో యూరప్ ఐటి మార్కెట్ లో కాలు మోపినట్లైంది. మిడ్ టియర్ ఐటి సర్వీసు కంపెనీ అయిన టెక్ వేవ్ సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాల్లోనూ కార్యాలయాలను ఇటీవలే ఏర్పాటు చేసుకుంది. ఉద్యోగుల సంఖ్యను 2000 వరకూ పెంచుకుంది.

image


“మా సంస్థ 50 మిలియన్ డాలర్ల రెవెన్యూ మార్కెట్ ని ఇప్పటికే క్రాస్ చేసింది. మా లక్ష్యం 100 మిలియర్ డాలర్లు”-దామోదర్ రావ్ గుమ్మడాపు

టెక్ వేవ్ సీఈఓ అయిన దామోదర్.. సంస్థ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఈ ఏడాదిలోనే టెక్ వేవ్ 100 మిలియన్ డాలర్లను దాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిగ్నిఫికెంట్ గ్రోత్ కోసం తమ దగ్గర సరైన స్ట్రాటజీ ఉందని అన్నారాయన. ఇందులో భాగంగా గ్లోబల్ క్లెయింట్ బేస్ ను పెంచుకుంటూ పోతున్నామని, కొత్త కంపెనీలను కొంటున్నామని చెప్పుకొచ్చారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సోషల్ మీడియా, మొబైల్, అనలిటిక్స్, క్లౌడ్( ఐఎస్ఎమ్ఏసి) లో పెట్టుబడులు పెడుతున్నామని ఆయన ప్రకటించారు. టెక్ అద్వైత ఈ కామర్స్ లో మంచి పట్టున్న సంస్థ. దీన్ని ఎక్వైరీ చేయడం ద్వారా తమకు మరింత కలసొస్తుందని అన్నారు. గ్లోబల్ డెలివరీ టీంలో ఇప్పుడు కొత్తగా 70కలసడం వల్ల ఈ సంఖ్య 700లకు చేరుతుందని చెప్పుకొచ్చారు.

టెక్ వేవ్ గురించి 

టెక్ వేవ్ కు మాదాపూర్ లోని ఫియోనిక్స్ అవనోయి బిజినెస్ పార్క్ లో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఉంది. ప్రపంచంలో ఉన్న క్లెయింట్స్ కు ఈ సెంటర్ సపోర్ట్ ఇస్తుందని సీఓఓ రాజశేఖర్ గుమ్మడాపు అన్నారు. దీంతో పాటు రిమ్ సర్వీసులు అందిస్తున్నారు. జిడిసిలో బిల్డ్ చేసిన ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ చేపడుతుంది. ఈఆర్పీ, బిజినెస్ అనలిటిక్స్, ఈపిఎం సొల్యూషన్స్ తో పాటు వాటి ఇంప్లిమెంట్ సర్వీసులు అందించడంలో టెక్ వేవ్ దిట్ట. క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ తో పాటు అడ్వాన్స్ డ్ డేటా మైనింగ్ లను హైదరాబాద్ గ్లోబల్ డెలివరీ సెంటర్ నుంచి టెక్ వేవ్ అందిస్తోంది.

image


“రొటీన్, మెయింటెనెన్స్ పనుల కోసం ఈ ఆఫ్ షోర్ సర్వీసు క్లెయింట్స్ కు ఒక అద్భుత మైన సొల్యూషన్”- దామోదర్

సాధారణ చార్జీలతోనే క్లెయింట్స్ క్వాలిటీ ప్రీమియర్ సర్వీసులను పొందుతున్నారని దామోదర్ చెప్పుకొచ్చారు. 2004 లో ప్రారంభమైన టెక్ వేవ్.. ఈఆర్పీ, బిజినెస్ అనలిటిక్స్, బిగ్ డేటా అనలిటిక్స్, క్లౌడ్ మొబిలిటీ స్పేస్ లలో స్పెషలిస్ట్. ఈ సంస్థకున్న క్లెయింట్స్ లో ఫార్చూన్ 500 కంపెనీల్లో ఉన్న సంస్థలు కూడా ఉండటం విశేషం. అమెరికాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న కంపెనీల్లో టెక్ వేవ్ 9వ స్థానంలో ఉంది. స్థానికంగా కంపెనీలకు ఈ ర్యాంక్ అందించే ఫిలడెల్ఫియా బిజినెస్ జర్నల్ లో ఇది ప్రచురితమైంది. ఐటి సర్వీసు డొమైన్ లో టాప్ 15లో ఉందని ఇంక్ 500 మ్యాగజైన్ ప్రచురించింది. అన్నింటికంటే ప్రధానమైన విషయమేంటంటే.. ఈ సంస్థ వ్యవస్థాపకులు మన హైదరాబాదీలే కావడం.