ఆంధ్రాలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న బాలీవుడ్ జంట

0


బాలీవుడ్ సూపర్ కపుల్ అజయ్ దేవగన్, కాజోల్ ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. రాష్ట్రంలో ఎంటర్టయిన్మెంట్ ప్రాజెక్టు చేపట్టడానికి సుముఖత వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను సిఎం చంద్రబాబుకి చూపించాడు అజయ్ దేవగన్.

“వర్చువల్ రియాల్టీ ప్రాజెక్ట్ పై మాకు ఆసక్తి ఉంది,” అజయ్

ఇదే విషయమై ముఖ్యమంత్రితో అజయ్ దంపతులు సమావేశమయ్యారు. దుబాయ్ తరహాలో అత్యంత ఖరీదైన వర్చువల్ టెక్నాలజీ స్టుడియోని ఏపీలో నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ ప్రతిపాదనతో ముందకొచ్చిన అజయ్ దంపతులకు చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ అందింది.

టూరిజం ప్రచార కర్తలుగా

ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్రచారకర్తలుగా వ్యవహరించడానికి సైతం కాజోల్ దంపతులు ముందుకొచ్చారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీ సర్కార్ ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్లు కాజల్, అజయ్ ప్రకటించారు. అమరావతి కేంద్రంగా టూరిజం మరింత దూసుకు పోతుందని ఇద్దరూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ టూరిజం అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామన్నారు. గతంలో ఏపీ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఎందరో సినీ ప్రముఖులున్నారు. అది చాలాకాలం క్రితం మాట. తాజాగా ఓ బాలీవుడ్ జంట రావడం విశేషం. 

 

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik