ఆటో డ్రైవర్ల ఆగడాలను అరికట్టడానికి నడుంబిగించిన ‘రౌడీ ఆటో’

పెరుగుతున్న ఆటో డ్రైవర్ల అరాచకాలకు చెక్ పెట్టేందుకు వచ్చిన ‘రౌడీ ఆటో’.నగరంలో ఉన్న ఆటో డ్రైవర్ల వివరాలు ఈ యాప్ లో ఉంటాయి.అతను మంచి వాడా చెడ్డవాడా అనే రేటింగ్స్ తో పాటు రివ్యూ కూడా ఉంటుంది.

ఆటో డ్రైవర్ల ఆగడాలను అరికట్టడానికి నడుంబిగించిన ‘రౌడీ ఆటో’

Tuesday June 30, 2015,

2 min Read

మన దేశంలో నగర జనాభా 3.16శాతం ప్రతీ సంవత్సరం పెరుగుతుండగా, 9 శాతం వాహనాలు కూడా పెరుగుతున్నాయి. ఇక రోజురోజుకు పట్టణీకరణతో పాటు వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. EMBARQ రిపోర్ట్ ప్రకారం 75 శాతం గ్లోబల్ ఆటో రిక్షా జనాభా మన దేశంలో కనిపిస్తారట. అయితే వీరిపై సరైన అధ్యాయనం లేదని అంటోంది.

image


గత కొంత కాలంగా కస్టమర్‌తో స్నేహపూర్వకంగా, మర్యాదగా ఉండకపోవడంతో పాటు వృత్తి ధర్మాన్ని పాటించడంలేదంటూ ఆటో డ్రైవర్లపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇక వారి గురించి చెప్పుకోవడానికి చాలా కధనాలే ఉన్నాయి. అలాంటి వారిలో ఒకరు సౌమజీత్ భౌమిక్. ఆటో డ్రైవర్ అనగానే ఓవర్ చార్జ్ చేయడం, లేదా అసభ్యంగా ప్రవర్తించే వారనే బలమైన నమ్మకం చాలామంది జనాల్లో ఉంది. ఇలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఆటో ప్రయాణం సురక్షితంగా ఉండాలనే ‘RowdyAuto.in’ ప్రారంభించారు.

ఓ సారి సౌమజీత్ ట్రాఫిక్ సిగ్నల్ పై తన కార్లో ఉన్నప్పుడు, ఆటో డ్రైవర్ ఈయన కార్ ని ఢీ కొట్టడమే కాకుండా, పైగా బెదిరించి డబ్బులు కూడా డిమాండ్ చేసాడు. ఈ విషయంలో అక్కడున్న పోలిసులు కూడా సమస్య పరిష్కారానికి పెద్దగా పట్టించుకోలేదు. ఈ సమస్యపై తన ఐఐటీ ఖరగ్‌పూర్ మిత్రుడు సాస్వతా బెనర్జీతో చర్చించినప్పుడు, రౌడీ ఆటో ఐడియా పుట్టుకొచ్చింది. త్వరలో మొబైల్ యాప్ లాంచ్ చేయడంతో పాటు ఓ ప్రత్యేక ఫోన్ నంబర్ సర్విస్ కూడా ప్రారంభిస్తామని అంటున్నారు.

‘RowdyAuto’ ఐడియా ఉద్దేశం ఏంటంటే.. దాదాపు నగరంలో ఉన్న అన్ని ఆటోల వివరాలను సేకరణ, ఆ డేటా బేస్‌లో రేటింగ్స్ కూడా ఉంటాయి, అసభ్యంగా మాట్లాడే ఆటో డ్రైవర్లు, ఓవర్ చార్జ్ చేసే వారితో సహా కస్టమర్ ఫ్రెండ్లీ ఉండే వారి గురించి కూడా రేట్ చేయవచ్చు.

image


ప్రస్తుతం ఈ పోర్టల్ మూడు సులువైన పద్ధతుల్లో పనిచేస్తుంది.

  • 1. సర్చ్ : లైసెన్స్ ప్లేట్ నంబర్‌తో ఆ ఆటో డ్రైవర్ హిస్టరీ తెలుసుకునే అవకాశం ఉంటుంది.
  • 2. రివ్యూ: ఇటీవల మీరు ప్రయాణించిన ఆటో ప్రయాణంపై రివ్యూ రాయగలితే అందరికి అతని గురించి తెలుస్తుంది.
  • 3. నిర్ణయం : అనుమానితుడైనా, లేక సమస్యాత్మకమని తెలసిన వెంటనే అతన్ని అవాయిడ్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవచ్చు.

గతేడాది మొదలైన ఈ సైట్‌కు జనాల నుంచి మంచి స్పందనే వస్తోంది. ప్రారంభంలోనే దాదాపు 1500 మంది వరకూ తాము ప్రయాణించిన ఆటోలపై రివ్యూలు రాశారు.

‘RowdyAuto’ కష్టపడే ఆటో డ్రైవర్లతో పాటు, ఓవర్ చార్జ్ చేయని వారిని ప్రోత్సహించే విధంగా ప్రయత్నిస్తుంది, వచ్చే 5 ఏళ్లలో సురక్షితమైన, నమ్మకమైన ఆటో రిక్షా విధానాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. ‘RowdyAuto.in’ నుండి ‘AwesomeAuto.in’ గా మారాలని వారి లక్ష్యం.