పక్కా ప్లాన్ ఉంటే సక్సెస్ మీ వెంటే : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

పక్కా ప్లాన్ ఉంటే సక్సెస్ మీ వెంటే : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

Monday April 04, 2016,

2 min Read


హైదరాబాద్ భవిష్యత్ లో గ్లోబల్ సిటీగా మారబోతుందని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అన్నారు. దానికి సరైన ప్రణాళిక అవసరమని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఐటి పాలసీ ప్రకటించే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసారు.

“గొప్ప గోల్స్ ఉంటేనే గొప్ప విజయాలు సాధ్యమవుతాయి,” నారాయణ మూర్తి

ఐటి పాలసీ బ్రోచర్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని అద్భుతమైన , ఆసక్తికరమైన మాటలను చెప్పి అందరినీ ఉత్తేజపరిచారు నారాయణమూర్తి. పెద్ద గోల్స్ పెట్టుకొని ముందుకు అడుగేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మూడు ముఖ్యమైన విషయాలపై ప్రభుత్వం, అధికారులు కాన్సన్ ట్రేట్ చేయాలని సూచించారు.

image


1.బెంచ్ మార్క్ యువర్ సెల్ఫ్

తెలంగాణ ఐటి పాలసీ ప్రకటించడం గొప్పవిషయం. అయితే భవిష్యత్ లో అధిగమించాల్సిన విషయాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. బెంచ్ మార్క్ ఇప్పుడే నిర్ణయించుకుని పనిచేయాలి. బెంచ్ మార్క్ అంటే మన దేశంలో ఉండే ఇతర నగరాల్లాగ కాకుండా.. ప్రపంచస్థాయి నగరాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. సిలికాన్ వ్యాలీ, టోక్యో లాంటి మహానగరాలు ఎదిగినట్లు హైదరాబాద్ దూసుకుపోవాలని ఆకాంక్షించారు. అక్కడికి చేరుకొని వారిని మించేలా ఎదగడానికి శ్రమించాలని అభిప్రాయపడ్డారు. 

“మీకంటూ ఓ గొప్ప బెంబ్ మార్క్ ఉండాలి,” నారాయణ మూర్తి
image


2.అన్ని అవకాశాలను వినియోగించుకోవాలి

ఎదిగే క్రమంలో అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని నారాయణమూర్తి అన్నారు. రిసోర్స్, డేటాని వినియోగించుకోవడం తెలుసుకోవాలని అన్నారు. దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలన్నారు. 

నారాయణమూర్తి ప్రసంగిస్తారని అనౌన్స్ మెంట్ రాగానే ఆయన చక చకా అడుగు లేస్తూ డయాస్ దగ్గరకు వెళ్లి ప్రసంగం మొదలు పెట్టారు. వేగం అంటే ఏమిటో అక్కడికి వచ్చిన వారందరికీ చూపించారు. బహుశా స్టేజీపైనున్న వారందరికంటే సీనియర్ అయిన ఆయన అందరి కంటే తొందరగా స్పీచ్ కంప్లీట్ చేయడమే కాదు.. అందరికంటే అద్భుత మైన వాక్యాలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సైతం ఆయన మాటలను ఉటంకించి ప్రసంగాంచారు. నారాయణమూర్తి ప్రసంగం నుంచి తాను స్ఫూర్తి పొందానని సీఎం కేసీఆర్ అన్నారు. స్పీడ్ ని ఉపయోగించుకుంటే ఆ తర్వాత ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలే వస్తాయని అన్నారు.

image


మీ శక్తి సామర్థ్యాలు తెలుసుకోండి

మన శక్తి సామర్థ్యాలే మనల్ని ఉన్నత శిఖరాల్లో నిలుపుతాయని నారాయణమూర్తి అన్నారు. చాలామంది దాన్ని గుర్తించడంలో విఫలమవుతారు. దాంతోనే వారి పతనం ప్రారంభమవుతుంది. ఆ తప్పు చేయొద్దని ఆయన సలహా ఇచ్చారు. చాలా మంది వారి శక్తికి మించి ప్రయత్నింస్తుంటారు. దీంతో వారి ఊహించిన విజయాన్ని అందుకోలేకపోతున్నారు. చేయదగిని పనిని ముందుగా ఊహించండి. దానికి సరిపడా శక్తియుక్తులు మేళవించండి. అది సాధించిన తర్వాత మరో టార్గెట్ పెట్టుకోండనేది నారాయణమూర్తి అభిప్రాయం. 

నారాయణమూర్తి మాట్లాడింది కొద్ద సేపే అయినప్పటికీ ఆయన చెప్పిన మాటలు అందిరీనీ కట్టి పడేసాయి. శక్తి సామర్థ్యాలను నమ్ముకొని అడుగులేస్తే సక్సెస్ ని ఎవరూ ఆపలేరని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.