కేన్సర్ చికిత్సకు కస్టమైజ్డ్ మెడిసిన్

కేన్సర్ చికిత్సలో మరో విప్లవాత్మక అడుగుప్రతీ కేన్సర్‌ రోగికీ ప్రత్యేక చికిత్స ఉండాలనే వాదనడీఎన్ఏని విశ్లేషించి ఫలితాల ఆధారంగా చికిత్స అవసరమంటున్న ల్యాబ్ పీ53సరిగా అనాలసిస్ చేయకపోతే ప్రాణం పోయాల్సిన మందే ప్రాణం తీస్తుందని హెచ్చరిక

0

ల్యాబ్ పీ53... కేన్సర్ వ్యాధి చికిత్సపై పరిశోధనలు చేస్తున్న సంస్థ. కేన్సర్ చాలా క్రూరమైన జబ్బు. దీని బారిన పడితే... అంతర్గతంగా వచ్చే ఇతరత్రా వ్యాధులు, సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి. కేన్సర్ చికిత్స కూడా చాలా రిస్క్ అనే చెబ్తారు డాక్టర్లు. జాగ్రత్తగా ఉండకపోతే... ప్రాణం పోయాల్సిన ఔషధం... గంటల వ్యవధిలోనే ఆయువు తీసే ప్రమాదం కూడా ఉంటుంది. ఏ ఇద్దరూ ఒకలా ఉండరు అన్న మాదిరిగానే... ఓ ఇద్దరి డీఎన్ఏలూ కూడా కలవవు. ఇదే ఔషధాలు ప్రాణం తీసేలా మారడానికి కారణమనే అంచనాలున్నాయి.


డీకోడింగ్ డీఎన్ఏ

జన్యుపరమైన ఈ తరహా అంతరాలను గుర్తించి... డీఎన్ఏను డీకోడ్ చేసి, రోగికి తగిన మందు ఇవ్వడంపై పరిశోధనలు చేస్తోంది ల్యాబ్ పీ53. అయితే ఇతర చికిత్సల మాదిరిగా కాకుండా... ఈ తరహా జెనెటిక్ పరీక్షలకు చాలా పెద్దమొత్తంలో ఖర్చవుతుంది. మహా నగరాల్లోని అతి కొద్ది మంది మాత్రమే ఈ తరహా చికిత్స చేయించుకోగలరు. ప్రస్తుత అంచనాల ప్రకారం కేన్సర్ పేషెంట్లలో... 15-20శాతం మంది టైర్-1 హాస్పిటల్స్‌లో మాత్రమే ఈ చికిత్స అందుబాటులో ఉంది. వారే ఈ ఖర్చును భరించగలరని చెప్పాలి.

ఎంత ఖర్చవుతుంది ?

ప్రస్తుతం దేశంలో 3 కంపెనీలు మాత్రమే కేన్సర్ జీనోమిక్స్ సేవలందిస్తున్నాయి. అయితే ల్యాబ్ పీ53కి... ఫార్మాకో జెనెటిక్స్‌లో యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకోపియా నుంచి సర్టిఫికేషన్ ఉండడం విశేషం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ రోగులకు అందిస్తున్న చికిత్స విలువ దాదాపు 20 బిలియన్ డాలర్లు. అంటే మన రూపాయల్లో లక్షా పాతికవేల కోట్లు. ఒక పేషెంట్‌కు డీఎన్ఏ జెనెటిక్ టెస్ట్ చేయాలంటే దాదాపు రూ.1.2 లక్షలు ఖర్చవుతుంది. ఈ పరీక్షకు సంబంధించిన విశ్లేషాణాత్మక రిపోర్టులను డాక్టర్లకు మాత్రమే పంపుతారు.


మాస్టర్ మైండ్ ఈయనే

లేబ్ పీ53 ఆలోచన, కాన్సెప్ట్‌ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అభిలేష్ ఎం. గుణశేఖర్. ఫౌండర్ అయిన ఈయన మేనేజింగ్ డైరెక్టర్‌గానూ విధులు నిర్వహిస్తున్నారు. వీఐటీ యూనివర్సిటీ(వేలూర్)లో విద్యాభ్యాసం చేశారీయన. టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్‌లో సైంటిస్టుల గ్రూప్‌లో గుణశేఖర్ ఒకరు.

అభిలేష్ మల్లి గుణశేఖర్, ఫౌండర్ ల్యాబ్ p53
అభిలేష్ మల్లి గుణశేఖర్, ఫౌండర్ ల్యాబ్ p53

సంక్లిష్టమైన వ్యాధికి జన్యుపరమైన చికిత్స

దేశీయ క్లినికల్ రంగంలోకి కేన్సర్ జెనోమిక్స్‌ను తీసుకొచ్చిన తొలి సంస్థ Lab P53. పర్సనలైజ్డ్ కేన్సర్ థెరపీ ఈ సంస్థ వినూత్న చికిత్సా విధానం. అత్యంత ప్రమాదకరమైన జబ్బును అంచనా వేయడం, చికిత్స అందించడంలో ఏ చిన్న పొరపాటు ఉండకూడదనే... ఈ జీనోమిక్స్‌ను అభివృద్ధి చేశామంటారు అభిలేష్. దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఔత్సాహికులైన పెట్టుబడిదారులు, ప్రజల కోసం ఎదురుచూస్తున్నామని చెబ్తోందీ సంస్థ.


సహజంగానే కేన్సర్ చాలా సంక్లిష్టమైన వ్యాధి. మైక్రోస్కోప్‌లో చూసినపుడు దాదాపు అన్ని ట్యూమర్లు ఒకే రకంగా కనిపిస్తుంటాయి. కానీ జన్యుపరంగా అవన్నీ వేటికవే ప్రత్యేకత సంతరించుకుంటాయనే విషయాన్ని గుర్తించాల్సి ఉంది. సరైన చికిత్స అందించాలంటే.. ఖచ్చితంగా జనోమిక్ అనాలసిస్ అవసరమంటోంది ల్యాబ్ పీ53.

Related Stories

Stories by Poornavathi T